• facebook
  • whatsapp
  • telegram

ధ్వని

ప్రతిరోజు మనం వివిధ రకాల శబ్దాలను వింటుంటాం. ఉదాహరణకు మానవుల మాటలు, పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు; ఆటోలు, బస్సులు, లారీలు, రైళ్లు, ట్రాక్టర్ల లాంటి వాహనాల నుంచి వచ్చే శబ్దాలు; బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, టెలివిజన్ నుంచి వచ్చే సంగీతం ఇలా వివిధ రకాలైన శబ్దాలను మనకు వినిపిస్తాయి. మన జీవితం వివిధ ధ్వనులతో ముడిపడి ఉంది. మన పరిసరాలు వివిధ ధ్వనులతో నిండి ఉన్నాయి. మన జీవితాల్లో ధ్వని ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ధ్వనుల ద్వారానే మనం ఇతరులతో మన అభిప్రాయాలు పంచుకోగలుగుతున్నాం.
 

ధ్వని ఉత్పత్తి చేయడం:

ఒక రేకు పెట్టెలో రాళ్లువేసి ఊపడం వల్ల గలగల శబ్దం, ఒక విద్యార్థి నోటితో శబ్దం చేయడం వల్ల ఈల శబ్దం, టేబుల్ పై స్కేలుతో కొట్టడం వల్ల 'టక్‌టక్' శబ్దం, నేలపై బూటు లేదా చెప్పుకాలుతో కొట్టడం వల్ల 'టప్‌టప్' శబ్దాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.

* ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది యాంత్రిక శక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి ధ్వని ప్రసారానికి యానకం అవసరం.

* కంపించే వస్తువులన్నీ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి.

* ధ్వని ప్రసారమయ్యేటప్పుడు అణువుల స్థానంలో మార్పురాదు. శక్తి మాత్రమే ప్రసారమవుతుంది. ధ్వని ప్రసరణ జరిగే యానకం రెండు ధర్మాలను కలిగి ఉంటుంది.

    1. స్థితి స్థాపకత

    2. జడత్వం

* కణాలు ఉన్న పదార్థాన్ని యానకం అంటారు. ఇది ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది.

* యానకం లేని ప్రాంతాన్ని శూన్యం అంటారు. ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు.

* పైథాగరస్ అనే గ్రీకు తత్త్వవేత్త ధ్వనితరంగాలు గాలిలోని అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి, చెవిని చేరి గ్రహణ సంవేదనను కలగజేస్తాయని వివరించారు. ఈ విషయాన్ని గెలీలియో, బేకన్ శాస్త్రవేత్తలు అంగీకరించారు.

* సర్ ఐజాక్ న్యూటన్ మొదటిసారిగా గాలిలో ధ్వని ప్రసారాన్ని గురించి వివరించారు.

* శృతిదండం ఒక శబ్ద అనునాదకం. ప్రయోగశాలలో ధ్వనిని శృతిదండం సాయంతో ఉత్పత్తి చేస్తారు.

* శృతిదండాన్ని జాన్‌షోర్ అనే ఇంగ్లండ్ సంగీత విద్వాంసుడు కనుక్కున్నారు.

* శృతిదండం పిచ్ దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది.

* సంగీత పరికరాలను శృతి చేయడంలో శృతిదండం పిచ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.

తరంగాలు:

* తరంగం అంటే శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకు మోసుకు వెళ్లేది.

* తరంగాలు స్వభావరీత్యా రెండు రకాలు

       1. యాంత్రిక తరంగాలు

       2. విద్యుదయస్కాంత తరంగాలు
 

1. యాంత్రిక తరంగాలు:

* ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం.

* శూన్యంలో ఈ తరంగాలు ప్రయాణించలేవు.

ఉదా: ధ్వని తరంగాలు
 

2. విద్యుదయస్కాంత తరంగాలు:
* ఈ తరంగాలు యానకంలోనూ, శూన్యంలోనూ ప్రయాణిస్తాయి.
* శూన్యంలో కాంతివేగం (C = 3 × 108 m/ sec)తో సమానంగా ప్రయాణిస్తాయి.
* యానకంతో నిమిత్తం లేకుండా ప్రయాణిస్తాయి.
ఉదా: రేడియో తరంగాలు, మైక్రోతరంగాలు, X - కిరణాలు.

* తరంగాలు ప్రయాణించే విధానాన్ని అనుసరించి రెండు రకాలు.
       1. పురోగామి తరంగాలు.
       2. స్థిర లేదా స్థావర తరంగాలు.

 

పురోగామి తరంగాలు:
* జనించిన బిందువు నుంచి వెనక్కి తిరిగి రాకుండా అనంత దూరాలకు ప్రయాణించే తరంగాలను పురోగామి తరంగాలు అంటారు.
* పురోగామి తరంగాల ప్రయాణ దిశలో ఏదైనా అవరోధం ఏర్పడితే అవి పరావర్తనం చెందుతాయి.
* పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థ (దశ)లో మార్పు Πc రేడియన్లు (లేదా) 180oగా ఉంటుంది.
* యానకంలోని కంపనాలను బట్టి పురోగామి తరంగాలు రెండు రకాలు
       1. అనుదైర్ఘ్య తరంగాలు (LONGITUDINALWAVES)
       2. తిర్యక్ తరంగాలు (TRANSVERS WAVES)

 

1. అనుదైర్ఘ్య తరంగాలు:
* యానకంలోని కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తాయి.
* వీటిలో అధిక సాంద్రత ఉన్న ప్రాంతాన్ని సంపీడనం అని తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతాన్ని విరళీకరణం అని అంటారు.

          


* రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం () అంటారు.
ఉదా:  గాలిలో ధ్వని తరంగాలు
           స్ప్రింగులో ఏర్పడే తరంగాలు
           నీటిలోపల ఏర్పడే తరంగాలు
           గుడి గంట మోగేటపుడు ఏర్పడే తరంగాలు

 

2. తిర్యక్ తరంగాలు:
* యానకంలోని కణాలు తరంగ చలన దిశకు లంబంగా ప్రయాణిస్తాయి.


                        

* తరంగంలో ఎత్తయిన భాగాన్ని శృంగం, లోతైన భాగాన్ని ద్రోణి అని పిలుస్తారు.
* రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం () అంటారు.
ఉదా: * కాంతి తరంగాలు
        * తీగలపై ఏర్పడే తరంగాలు
       *  నీటిపై ఏర్పడే తరంగాలు

స్థిర లేదా స్థావర తరంగాలు:
* సమాన పౌనఃపున్యాలు, కంపన పరిమితులు ఉన్న రెండు పురోగామి తరంగాలు ఒకే పథంలో ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల స్థిరతరంగాలు ఏర్పడతాయి.
* స్థిర తరంగాలు శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకు మోసుకుని వెళ్లలేవు.
* స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు శక్తి రెండు బిందువుల మధ్య నిలిచిపోతుంది.
* అధిక కంపన పరిమితి ఉన్న ప్రాంతాన్ని ప్రస్పందన బిందువు అని, తక్కువ కంపన పరిమితి ఉన్న ప్రాంతాన్ని అస్పందన బిందువు అని అంటారు.
* రెండు వరుస ప్రస్పందన లేదా అస్పందన బిందువుల మధ్య దూరం 

* ప్రస్పందన, అనుక్రమ అస్పందన బిందువుల మధ్య దూరం   అవుతుంది.

సమస్య:
* రెండు వరుస ప్రస్పందన బిందువుల మధ్య దూరం 15 సెం.మీ. అయితే తరంగ దైర్ఘ్యాన్ని లెక్కించండి.
       = 15 సెం.మీ.
     = 2 × 15 = 30 సెం.మీ.
ఉదా:  అనునాదం చెందే గాలి స్తంభాల్లో స్థిర తరంగాలు ఏర్పడతాయి.
           రెండు వైపులా బిగించిన తాడులో స్థిర తరంగాలు ఏర్పడతాయి.

ధ్వని తరంగాలు - లక్షణాలు:
ధ్వని తరంగం 4 లక్షణాలను కలిగి ఉంటుంది.
     1. తరంగ దైర్ఘ్యం 
     2. కంపన పరిమితి
     3. పౌనఃపున్యం లేదా ఆవర్తన కాలం 
     4. తరంగ వేగం

1. తరంగ దైర్ఘ్యం:
*  రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు.
*  దీన్ని లామ్డా (Lamda) అనే గ్రీకు అక్షరం తో సూచిస్తారు.
* ఇది పొడవును సూచిస్తుంది.
     దీని ప్రమాణాలు: మి.మీ., సెం.మీ.
      SI ప్రమాణం = మీటరు


2. కంపన పరిమితి:
*  యానకంలోని కణాలు వాటి మధ్యమ స్థానం నుంచి ఇరువైపులా పొందే గరిష్ఠ అలజడిని కంపన పరిమితి అంటారు.
* దీన్ని (amplitude) "a"తో సూచిస్తారు.

3. ఆవర్తన కాలం లేదా పౌనఃపున్యం:

*  ధ్వని ప్రసారంలో యానకపు సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టిన కాలాన్ని ధ్వని తరంగపు ఆవర్తన కాలం అంటారు.
* దీన్ని 'T'తో సూచిస్తారు. దీని SI ప్రమాణం 'సెకను'.
* ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
* పౌనఃపున్యాన్ని "υ" (న్యూ)తో సూచిస్తారు.
* దీని SI ప్రమాణాలు హెర్ట్జ్‌లు (Hz)

ధ్వని తరంగ వేగం:
     ఒక తరంగంపై ఉండే ఏదైనా ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు.
   తరంగ వేగం V = υ అవుతుంది.
* ధ్వని వేగం ఘన పదార్థాల్లో అధికంగా, వాయు పదార్థాల్లో తక్కువగా ఉంటుంది.
      Vఘన > Vద్రవ > Vవాయు

* 20°C వద్ద పొడిగాలిలో ధ్వని వేగం 343.2 మీ./సె. లేదా 1236 kmph
    20°C వద్ద నీటిలో ధ్వని వేగం = 1484 మీ./సె. (గాలి కంటే 4.3 రెట్లు అధికం)
    20°C వద్ద ఇనుములో ధ్వనివేగం = 5120 మీ./సె. (గాలికంటే 15 రెట్లు అధికం)
* ఘన పదార్థాల్లో ధ్వని వేగం V = 
           Y = యంగ్ గుణకం
           ρ = పదార్థ సాంద్రత
* ద్రవ పదార్థాల్లో ధ్వని వేగం V = 
           E = సమోష్ణ స్థూల గుణకం
           ρ = ద్రవాల సాంద్రత
* వాయు పదార్థాల్లో ధ్వని వేగం V = 

 ρ = సాంద్రత

ధ్వని.  >> Page - 11

*  అనునాదం చెందే గాలి స్తంభాల ధ్వని వేగం V = 2υ (l2 - l1)
    υ = శృతిదండం పౌనఃపున్యం
    l1 = మొదటి అనునాద స్తంభ పొడవు
    l2 = రెండో అనునాద స్తంభ పొడవు
గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు:
1. ఉష్ణోగ్రతా ప్రభావం:
* గాలిలో ధ్వని వేగం దాని పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
         
* ఉష్ణోగ్రతను పెంచడంతో అణువుల కంపన పరిమితి పెరిగి, గాలిలో ధ్వని వేగం పెరుగుతుంది.
* గాలి ఉష్ణోగ్రతను 1°C పెంచినప్పుడు గాలిలో ధ్వని వేగం 0.61 మీ./సె. గా పెరుగుతుంది అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో ధ్వని వేగం ఎక్కువ.
2. పీడన ప్రభావం:
* గాలిలో ధ్వనివేగం అనేది దాని పీడనంపై ఆధారపడి ఉండదు. కాబట్టి పీడనాన్ని పెంచినా, తగ్గించినా గాలిలోని ధ్వని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు.
ఉదా: వాతావరణ పీడనం అధికంగా ఉన్న సముద్రతీరాల్లో, సాధారణంగా ఉన్న సమతల ప్రదేశాల్లో, తక్కువగా ఉన్న పర్వతాల్లో ధ్వని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు.

3. సాంద్రత ప్రభావం:

*  న్యూటన్ - లాప్లాస్ సమీకరణం ప్రకారం వాయువుల్లో ధ్వని వేగం దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది.

*  వాయువుల సాంద్రత తక్కువగా ఉన్నట్లయితే వాటిలో ధ్వని వేగం (330ms-1ఎక్కువగా ఉంటుంది.
ఉదా: తక్కువ సాంద్రత ఉన్న హైడ్రోజన్ వాయువులో ధ్వని వేగం ఎక్కువగా, సాంద్రత అధికంగా ఉండే గాలిలో ధ్వని వేగం తక్కువ గా ఉంటుంది.


4. తేమ లేదా ఆర్ధ్రత ప్రభావం:
* గాలిలోని తేమ శాతం పెరిగినట్లయితే దాని సాంద్రత తగ్గుతుంది. కాబట్టి ధ్వని వేగం పెరుగుతుంది.
ఉదా: తేమ శాతం ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది.


సూపర్‌సోనిక్ వేగం:
* ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని సూపర్‌సోనిక్ వేగం అంటారు.
ఉదా: జెట్ విమానాలు, రాకెట్‌లు, క్షిపణులు లాంటివి సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి.
*  సూపర్ సోనిక్ వేగాన్ని Mach Number(మాక్ సంఖ్య) అనే ప్రమాణంలో కొలుస్తారు.

 డాప్లర్ ప్రభావం:
సాపేక్ష వేగం:

*  ఒక వస్తువు వేగాన్ని, మరొక వస్తువు వేగంతో పోల్చడాన్ని సాపేక్ష వేగం అంటారు.
*  రెండు వస్తువులు ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు వాటి సాపేక్ష వేగం ఆ రెండు వస్తువుల వేగాల మొత్తానికి సమానం. 
        
*  రెండు వస్తువులు ఒకేదిశలో ప్రయాణిస్తున్నట్లయితే వాటి సాపేక్ష వేగం అనేది వాటి వేగంలోని తేడాకు సమానంగా ఉంటుంది.
         
*  ధ్వనిజనకం, ధ్వని పరిశీలకుడికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పరిశీలకుడు వినే ధ్వని పౌనఃపున్యాన్ని 'డాప్లర్ ఫలితం' అంటారు.

డాప్లర్ ఫలితంలో పరిశీలకుడు వినే ధ్వని పౌనఃపున్యం

V = ధ్వనివేగం
Vo = ధ్వని పరిశీలకుడి వేగం
Vs = ధ్వని జనక వేగం
n = ధ్వని అసలు పౌనఃపున్యం


అనువర్తనాలు:
*  RADAR (Radio Amplification Detection and Ranging) లో విమానాలు, క్షిపణుల ఉనికిని తెలుసుకోవడానికి డాప్లర్ ఫలితాన్ని ఉపయోగిస్తారు.
* సూర్యుడి ఆత్మభ్రమణ దిశను తెలుసుకోవడానికి
* కూడలి వద్ద వాహనాల వేగాలను లెక్కించడానికి ఉపయోగపడే "Speed Gun" లో.
* శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలను అధ్యయనం చేయడానికి
*  మానవ శరీరంలో రక్త సరఫరాలోని లోపాన్ని తెలుసుకోవడానికి వైద్యరంగంలో ఉపయోగిస్తారు.

*  దీని ఆధారంగా పనిచేసే డాప్లర్ ఆపరేటర్స్ అనే పరికరాన్ని ఉపయోగించి గర్భస్థ శిశువు హృదయ స్పందనను స్పష్టంగా వినవచ్చు.
*  చంద్రుడిపై వాతావరణం శూన్యం కాబట్టి చంద్రుడిపై డాప్లర్ ఫలితాన్ని ధ్వని దృష్ట్యా వివరించలేం. కాని కాంతి దృష్ట్యా అనువర్తించగలం.
*  డాప్లర్ ఫలితంలో పరిశీలకుడు వినే ధ్వని పౌనఃపున్యం కింది వాటిపై ఆధారపడుతుంది.
     i) ధ్వని పరిశీలకుడు
     ii) ధ్వని జనకం
     iii) ధ్వని జనకం, పరిశీలకుడి మధ్య ఉండే యానకంపై ఆధారపడి ఉంటుంది.
* ధ్వని వేగం కింది అంశాలపై ప్రభావితమై ఉంటుంది.
     1. ఉష్ణోగ్రత
     2. పీడనం
     3. సాంద్రత
     4. ఆర్ధ్రత

 సంగీత సాధనాలు:

ఇవి మూడు రకాలు
తీగ వాయిద్యాలు: సితార్, బుల్-బుల్, వీణ
డప్పు వాయిద్యాలు: మృదంగం, డప్పు, తబలా
వాయు వాయిద్యాలు: పిల్లనగ్రోవి, క్లారినెట్, హార్మోనియం
సంగీత ధ్వనుల లక్షణాలు:
    1. పిచ్ లేదా కీచుదనం
    2. తీవ్రత (Loudness)
    3. నాణ్యత (Quality)
1. పిచ్ (కీచుదనం)
* ఇది పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.
* పౌనఃపున్యం ఎక్కువైతే పిచ్ ఎక్కువగా ఉంటుంది.
* కీచుస్వరం, బొంగురు స్వరం మధ్య తేడాను తెలిపే లక్షణాన్ని పిచ్ అంటారు.
* కింది ధ్వనుల పిచ్ ఆరోహణక్రమంలో ఉంటుంది.
* సింహం < పురుషుడు < స్త్రీ < పిల్లవాడు < శిశువు < కీటకం
* సింహం, దోమలను పోల్చినట్లయితే దోమ చేసే శబ్దానికి ఎక్కువ పిచ్ ఉంటుంది.

 2. తీవ్రత (Loudness)

* చెవిపై కలిగించిన గ్రహణ సంవేదన స్థాయినే శబ్దతీవ్రత అంటారు.
* ఇది వస్తువుపై ప్రయోగించే బలంపై ఆధారపడి ఉంటుంది.
* దీన్ని కంపన పరిమితితో వివరిస్తారు.
* శబ్దతీవ్రతను 'డెసిబెల్' (dB) తో కొలుస్తారు.
* డెసిబెల్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధనలు చేసిన అలెగ్జాండర్ గ్రహంబెల్ గుర్తుగా ఏర్పాటు చేశారు.

* మానవుడి చెవులు 9 dB నుంచి 180 dB వరకు వినగలవు.
* సాధారణ శబ్ద తీవ్రత 50 dB నుంచి 60 dB
   గుసగుసలు - 15 dB
   లాన్ యంత్ర శబ్దం - 90 dB
   కారు హారన్ - 110 dB
   జెట్ ఇంజిన్ శబ్దం - 120 dB
* విమానాశ్రయాల దగ్గర పనిచేసే ప్రజలు Earplugsను ఉపయోగిస్తారు.

 3. నాణ్యత (Quality):

* ఒకే పౌనఃపున్యం, తీవ్రత ఉన్న రెండు సంగీత స్వరాలు రెండు వేర్వేరు వాయిద్యాల నుంచి వెలువడినప్పుడు వాటి మధ్య బేధాన్ని తెలియజేసే సంగీత స్వర లక్షణాన్ని నాణ్యత అంటారు.
* ఇది తరంగ రూపంలో ఉండే మార్పుపై ఆధారపడుతుంది.
ధ్వని పరావర్తనం:
* ధ్వని పరావర్తనం పరావర్తన తలంపై ఆధారపడి ఉంటుంది.
* గరుకుతలం లేదా గట్టి వస్తువులు మెత్తటి, నునుపు వస్తువుల కంటే ధ్వనిని స్పష్టంగా, అధికంగా పరావర్తనం చేస్తాయి.


ప్రతిధ్వని (Echo)
* ఒక పరిశీలకుడు ఉత్పత్తి చేసిన ధ్వని, అవరోధం వల్ల పరావర్తనం చెంది తిరిగి అతడికి వినిపిస్తే పరావర్తనం చెందిన ఆ ధ్వనిని ప్రతిధ్వని అంటారు.
* మన మెదడులో శబ్ద స్పర్శ 0.1 సె. ఉంటుంది. దీన్నే ధ్వని స్థిరత అంటారు.
* ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వని, ప్రతిధ్వని చేరే కాలంలో తేడా 0.1 సె. ఉండాలి.

 t అంటే వినికిడి స్థిరతకు పట్టేకాలం, v = ధ్వనివేగం 330 m/sec అయితే


* ప్రతిధ్వని వినాలంటే కనీసం 16.5 మీ. దూరం ఉండాలి.


ధ్వని పరావర్తనం - ఉపయోగాలు:
* మెగాఫోన్, లౌడ్ స్పీకర్, హారన్‌లు
* విమానం ఎత్తు, సముద్రం లోతును కనుక్కోవడానికి
* సోనార్ పద్ధతిలో సముద్రం లోతును కనుక్కోవడానికి
* స్టెతస్కోప్ ధ్వని బహుళ పరావర్తనం ద్వారా పని చేస్తుంది.


ప్రతినాదం (Reverberation):
* పరావర్తన ధ్వని చెవికి 0.1 సెకను కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసినప్పుడు ఒక సాగదీసిన ధ్వనిలా వినిపించడాన్ని ప్రతినాదం అంటారు.
* ఆడిటోరియం, సినిమా హాళ్లలో ప్రతినాదం కనిష్ఠంగా ఉండటం కోసం రంపపుపొట్టు థర్మోకోల్ లాంటివి ఉపయోగిస్తారు.


శ్రావ్య అవధి:
* మానవుడు 20 Hz - 20,000 Hz పౌనఃపున్య అవధిలోని ధ్వనులను మాత్రమే వినగలడు. దీన్ని శ్రావ్య అవధి అంటారు.

* పిల్లలు 30,000 Hz వరకు వినగలరు.

* వృద్దులు 10,000 Hz - 12,000 Hz ధ్వనులను వినగలరు.
* 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉండే ధ్వనులను పరశ్రావ్యాలని; 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉండే ధ్వనులను అతిధ్వనులని అంటారు.
* ఏనుగులు, తిమింగలాలు, ఖడ్గమృగాలు, పాములు పరశ్రావ్యాలను వినగలవు.
* కుక్కలు 50,000 Hz, గబ్బిలాలు ఒక లక్ష Hz వరకు వినగలవు.


అతిధ్వనులు - ఉపయోగాలు:
* రంధ్రాలు చేయడానికి, కావాల్సిన ఆకృతిలో వస్తువులను కోయడానికి
* పాలను శుభ్రపరిచే ప్రక్రియ, పాత్రలను శుభ్రపరచడానికి.
* లోహాల్లో పగుళ్లను గుర్తించడానికి.
* ఇకో కార్డియోగ్రఫిలో గుండెలోని వివిధ భాగాల చిత్రీకరణకు
* ఆల్ట్రా సోనోగ్రఫి అనే పద్ధతి ద్వారా రోగి శరీరంలోని కాలేయం, పిత్తాశయం, గర్భాశయం లాంటి అంతర అంగాలను గుర్తించడానికి.
* తల్లి గర్భంలోని భ్రూణం పెరుగుదలను గుర్తించడానికి
* మూత్రపిండాల్లో తయారైన రాళ్లను చిన్న ముక్కలుగా చేయడానకి ( ఎమల్సీకరణం).
* Sonarలో ఉపయోగిస్తారు.

సోనార్: (SONAR)

* సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.
* దీన్ని నిక్సన్ కనుక్కున్నారు.
* దీనిలో రెండు పరికరాలు ఉంటాయి. 1. ప్రసారిణి 2. గ్రాహకం
* సోనార్‌ను ఉపయోగించి సముద్రం లోతును తెలుసుకోవడాన్ని ఎకోరేంజింగ్ అంటారు.
d = = అవుతుంది
సోనార్ నుంచి వస్తువుకు ఉండే దూరం (సముద్రంలో)
d =


ధ్వని కాలుష్యం:
* సాధారణ ధ్వనుల తీవ్రత 50 db - 60 dbమధ్య ఉంటుంది.
* ధ్వని తీవ్రత 80 db మించితే అది మనకు భౌతికంగా బాధను కలగజేస్తుంది. దీన్ని (80 db దాటిని ధ్వనులను) శబ్ద కాలుష్యం అంటారు.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ 1972 నుంచి ధ్వని కాలుష్యాన్ని ఒక రకమైన కాలుష్యంగా గుర్తిస్తోంది.

* సముద్రపు లోతును కనుక్కోడానికి సోనార్‌ను పంపారు. 6 సెకన్ల తర్వాత ప్రతిధ్వని సోనార్‌ను చేరితే సముద్రం లోతును కనుక్కోండి.

సముద్రంలో నీటి ధ్వని వేగం 1500 మీ./సె.

* ఒక ధ్వని తరంగ వేగం 340 మీ./సె., తరంగ దైర్ఘ్యం 2 సెం.మీ. అయితే తరంగ పౌనఃపున్యం ఎంత?

అనునాదం:

*  సమాన సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువును కంపింపజేసినప్పుడు దాని ప్రభావం వల్ల రెండో వస్తువు గరిష్ఠ శబ్ద తీవ్రతతో కంపించడాన్ని అనునాదం అంటారు.
*  అనునాదం జరగాలంటే రెండు వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానంగా ఉండాలి.
ఉదా:
i) కవాతు చేసేటప్పుడు బ్రిడ్జి (వంతెన)ని సమీపిస్తున్న సైనికులకు కవాతు ఆపమని చెబుతారు. కారణం వంతెన సహజ పౌనఃపున్యం, కవాతు పౌనఃపున్యానికి సమానమై అనునాదం ఏర్పడి ఆ వంతెన కూలిపోయే అవకాశం ఉంది.
ii) పిల్లనగ్రోవి, ఈల (విజిల్), రేడియో లాంటివి పనిచేయడంలో ఈ ధర్మం ఇమిడి ఉంటుంది.
iii) ఒక వాహనం నియమిత వేగం అధిగమించిన తర్వాత ఆ వాహన ఇంజిన్ నుంచి వెలువడుతున్న శబ్దపౌనఃపున్యం కంపిస్తున్న దాని విడిభాగాల పౌనఃపున్యానికి సమానమైనప్పుడు ప్రత్యేక ధ్వని వినిపిస్తుంది. దీన్నే Ratling of Sound అంటారు. దీనికి కారణం అనునాదం.
iv) ఒక గాజుపలక పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యం ఉన్న ఒక స్వరం ఆలపించినప్పుడు గాజు పలకలోని ప్రతీకణం గరిష్ఠ కంపన పరిమితితో కంపించి అనునాదం ఏర్పడి గాజు పలక పగిలిపోతుంది.
v) ఊయల డోలనాలు, పౌనఃపున్యం దాన్ని ఊపే వ్యక్తి బల పౌనఃపున్యంతో సమానమైనప్పుడు అనునాదం ఏర్పడి ఊయల అత్యధిక డోలనా పరిమితితో ఊగుతుంది.


 


 


 

Posted Date : 15-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌