• facebook
  • whatsapp
  • telegram

కాంతి 

* కాంతి ఒక శక్తి స్వరూపం. ఇది స్వయం ప్రకాశకాలైన వస్తువుల్లో జనించి దాదాపు అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ కాంతి కిరణాలు ప్రయాణిస్తున్న మార్గంలో ఎదురుగా ఉన్న వస్తువులపై పతనమై, పరావర్తనం చెంది మనకంటిలోని రెటీనాను 1/16 వ సెకను కాలంపాటు తాకినట్లయితే ఆప్టిక్ అనే నాడి ద్వారా మానవుడిలో దృష్టి జ్ఞానం కలుగుతుంది. మానవుడి దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తమాలజీ, నేత్ర వైద్యుడిని ఆప్తమాలజిస్ట్ అని అంటారు.
 

కాంతి ధర్మాలు
    1. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది.
    2. కాంతి వేగం
    3. కాంతి పరావర్తనం
    4. కాంతి వక్రీభవనం
    5. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
    6. కాంతి విశ్లేషణ/ విక్షేపణం
    7. కాంతి పరిక్షేపణం
    8. కాంతి వ్యతికరణం
    9. కాంతి వివర్తనం
    10. కాంతి ధృవణం

* కాంతి ఒక శక్తి స్వరూపం.
* కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశా శాస్త్రం (Optics) అంటారు.
* కాంతిని ఇచ్చే వస్తువును కాంతి జనకం అంటారు
* కాంతి దృష్ట్యా వస్తువులు రెండు రకాలు. అవి:
      1) స్వయం ప్రకాశకాలు
      2) అస్వయం ప్రకాశకాలు లేదా గౌణ ప్రకాశకాలు
1. స్వయం ప్రకాశకాలు: తమంతట తాము కాంతిని వెదజల్లే వస్తువులు.
ఉదా: సూర్యుడు, నక్షత్రాలు, మిణుగురు పురుగులు.
 

2. గౌణ ప్రకాశకాలు: వీటికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు. ఇవి తమపై పడిన కాంతిని పరావర్తనం చేస్తాయి.
ఉదా: గ్రహాలు, ఉపగ్రహాలు.
* తమ ద్వారా కాంతిని స్వేచ్ఛగా ప్రయాణింపజేసే వస్తువులను పారదర్శక పదార్థాలు అంటారు.
ఉదా: గాలి, నీరు, కెనడా బాల్సమ్ నూనె, నునుపు గాజు.
* తమ ద్వారా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేసే వస్తువులను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు.
ఉదా: పాలిథీన్ కవరు, నూనెలో అద్దిన కాగితం, ట్రేసింగ్ కాగితం.

* తమ ద్వారా కాంతిని ప్రసరింపనీయని వస్తువులను కాంతి నిరోధక పదార్థాలు అంటారు.
ఉదా: కాగితం, అట్ట, చెక్కముక్క, ఇనుము.
* నీడలు ఏర్పడాలంటే కాంతితోపాటు అపారదర్శక వస్తువు ఉండాలి.
* సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకన్ల సమయం పడుతుంది.
* నీటి బిందువు ద్వారా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంధ్ర ధనుస్సు ఏర్పడుతుంది.
* ఆకుపచ్చ, ఎరుపు, నీలంలను ప్రాథమిక వర్ణాలు అని అంటారు.
* బల్బు వెలగడానికి వాడే విద్యుత్‌లో 10% కాంతినిస్తే, 90% ఉష్ణానికే సరిపోతుంది.
* కాంతి సెకనుకు 3 లక్షల కి.మీ. ప్రయాణిస్తుంది.
* మన సంప్రదాయంలోని కళారూపాల్లో తోలు బొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెరమీద ఏర్పరుస్తూ వివిధ కథలు ప్రదర్శిస్తుంటారు.
* నీడ అనేది కాంతి లేని ప్రదేశం. ఇక్కడ ఏవిధమైన రంగు ఉండదు.
* చంద్రుడి నుంచి కాంతి భూమిని చేరడానికి 1.255 సెకనులు పడుతుంది.

* సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది.
* తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి.
* కాంతి కిరణాలు సరళ రేఖామార్గంలో (రుజుమార్గంలో) ప్రయాణించడం వల్ల నీడలు ఏర్పడతాయి.
* పిన్‌హోల్ కెమెరా ద్వారా కాంతి సరళరేఖా మార్గపు ప్రయాణాన్ని గమనించవచ్చు.
* పిన్‌హోల్ కెమెరాలో ప్రతిబింబం తలకిందులుగా పడుతుంది. కారణం కాంతి రుజుమార్గ ప్రయాణం.
* నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియజేస్తుంది.
* సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్‌డయల్‌లో నీడలను ఆధారంగా చేసుకుని సమయాన్ని కొలుస్తారు.
కాంతి పరావర్తనం: ఏదైనా వస్తువు మీద పడిన కాంతి, తిరిగి వెనక్కు మరలుతుంది. దీన్నే కాంతి పరావర్తనం అంటారు.
* ఏదైనా వస్తువుపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటిని చేరినప్పుడు దాన్ని (వస్తువును) మనం చూడగలం.
* దర్పణాల్లో కాంతి పరావర్తనం చెందుతుంది.
* అద్దం (దర్పణం)పై పడిన కాంతి కిరణాన్ని పతన కిరణం అని అద్దం నుంచి బయలుదేరిన కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు.


                              
* పతన కిరణానికి, లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం (∟i) అని పరావర్తన కిరణానికి, లంబానికి మధ్యకోణాన్ని పరావర్తన కోణం (∟R) అని అంటారు.

సమతల దర్పణం
* సిల్వర్ బ్రోమైడ్ పూత పూసిన సమతల గాజు ఫలకాన్ని సమతల దర్పణం అంటారు.
* దీనిలో వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటాయి.
* పార్శ్వ విలోమం (కుడి, ఎడమ అవడం) జరుగుతుంది.
* వస్తుదూరం, ప్రతిబింబ దూరం సమానంగా ఉంటాయి.


     
* సమతల దర్పణం ఆవర్థనం విలువ - 1
* సమతల దర్పణాల్లో ఏర్పడే పరావర్తన ప్రతిబింబం అనే సూత్రం ఆధారంగా పెరిస్కోపును నిర్మిస్తారు.
* దీనిలో సమతల దర్పణాల మధ్య కోణం 45o
* బంకర్లు, జలాంతర్గాముల్లోని సైనికులు వీటిని ఉపయోగిస్తారు.
* పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడూ ఒకే తలంలో ఉన్నపుడు మాత్రమే ఎదుట ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని చూడగలం.

* కెలిడయోస్కోప్‌ను సమతల దర్పణంలో ఏర్పడే అసంఖ్యాక పరావర్తన ప్రతిబింబాలు అనే సూత్రం ఆధారంగా తయారుచేస్తారు.
* కెలిడయోస్కోపులో సమతల దర్పణాల మధ్య కోణం 60o.
గోళాకార దర్పణాలు: స్పూను ముందు భాగంలా వంపుగా ఉండే దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు.
* బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పలో లోపలివైపు తలాన్ని పుటాకారతలం అని, బయటివైపు తలాన్ని కుంభాకార తలం అని అంటారు.
* దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అంటారు.
* దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు.
* కుంభాకార, పుటాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు.
* తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. దీన్ని దర్పణంలో చూడగలం.
* తెరపై పట్టడానికి వీలుకాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు.
* పుటాకార దర్పణాలు మిథ్యాప్రతిబింబాలను పెద్ద ప్రతిబింబంగా, తలకిందులుగా ఏర్పరుస్తాయి.
* పుటాకార దర్పణాలను టార్చిలైట్, వాహనాల హెడ్‌లైట్లు, ENT వైద్యులు ఉపయోగిస్తారు.

* కుంభాకార దర్పణాలు ప్రతిబింబాలను చిన్నవిగా, నిటారుగా ఏర్పరుస్తాయి. వీటిని రివ్యూమిర్రర్ (Rivew Mirror) లో ఉపయోగిస్తారు.
* నునుపు తలంపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమపరావర్తనం అంటారు.
* గరుకు తలాలపై కాంతి ఒక క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటారు.


             
* కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతనకోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి.
* ''కాంతి తన పరావర్తన, ప్రయాణ మార్గంలో తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుని ప్రయాణిస్తుంది అని ఫెర్మాట్ భావించారు.
* కాంతి తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుంది. కాబట్టి పరావర్తన కోణం, పతన కోణం విలువలు సమానంగా ఉంటాయి.

గోళాకార దర్పణాల్లో పరావర్తనం


¤ పుటాకార ద‌ర్పణం అక్షం 'O', వ‌క్రతా కేంద్రం C, నాభి F అయితే నాభి అక్షానికి, వక్రతా కేంద్రానికి స‌మాన‌దూరంలో ఉంటుంది.
¤ అక్షానికి, నాభికి మ‌ధ్య దూరం 'f' అయితే దీన్నే నాభ్యంత‌రం అంటారు.
¤ వక్రతా వ్యాసార్ధం నాభ్యంత‌రానికి రెట్టింపు ఉంటుంది.
R = 2f
f = R/2 అవుతుంది.

 దర్పణంలో


దీన్నే దర్పణ సూత్రం అంటారు.
       f = నాభ్యంతరం
       u = వస్తు దూరం
       v = ప్రతిబింబ దూరం
¤ ప్రతిబింబం ఎత్తుకు, వస్తువు ఎత్తుకు ఉండే నిష్పత్తిని ఆవర్థనం అంటారు.
 

ప్రశ్న: 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న పుటాకార దర్పణం ముందు 25 సెం.మీ. దూరంలో, 4 సెం.మీ. ఎత్తున్న వస్తువును ఉంచాం. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది?

సాధన: f = -15 సెం.మీ.
           u = -25
           h = 4

¤ ఆర్కేమెడిస్ అనే శాస్త్రవేత్త అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగులబెట్టాడు.
¤ సోలార్ కుక్కర్‌లో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు.

]

కాంతి (Light).  >> Page - 11

¤ పుటాకార దర్పణంలో కాంతి కిరణాలు వికేంద్రీకరణం చెందుతాయి.
¤ కుంభాకార దర్పణంలో కాంతి కిరణాలు కేంద్రీకరణం చెందుతాయి.
¤ రోమన్‌లు అద్దాల తయారీలో లెడ్‌పూతలను వాడేవారు.
¤ స్పెయిన్ దేశస్థులు 11వ శతాబ్దంలో అద్దాలను తయారుచేయడం ప్రారంభించారు.
¤ చైనీయులు క్రీ.శ.500లో సిల్వర్ - మెర్క్యూరీ అద్దాలను తయారుచేశారు.
ప్రశ్న: 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార దర్పణం ముందు 10 సెం.మీ. దూరంలో వస్తువులను ఉంచినప్పుడు ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది?
సాధన:
u = - 10 సెం.మీ.
f = 15 v = ?

v = 6 సెం.మీ.

 ప్రశ్న: 3 మీటర్ల వక్రతా వ్యాసార్ధం ఉన్న ఒక కుంభాకార దర్పణాన్ని ఒక వాహనానికి రియర్ వ్యూ మిర్రర్‌గా ఉపయోగించారు. దర్పణానికి 5 మీ. దూరంలో బస్సు ఉంటే దాని ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది?

సాధన: f =  R/2
f =  = 1.5 మీ.
u = -5, v = ?

 కాంతి వక్రీభవనం:

¤ ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు.
¤ కాంతి సమతలంపై పడి వంగి ప్రయాణిస్తుంది.
¤ బరువైన యానకాన్ని సాంద్రతర యానకం అని, తేలికైన యానకాన్ని విరళ యానకం అని అంటారు.
¤ కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణిస్తున్నపుడు లంబానికి దూరంగా జరుగుతుంది.
¤ విరళ యానకం నుంచి సాంద్రతర యానకానికి ప్రయాణిస్తున్నపుడు లంబం వైపుగా వక్రీభవన కిరణం జరుగుతుంది.

¤ శూన్యంలో కాంతి వేగం 3 × 108 మీ/సె. దీన్ని 'c' తో సూచిస్తారు.
¤ మరే ఇతర పారదర్శక పదార్థంలోనైనా కాంతి వేగం 'c' కంటే తక్కువగా ఉంటుంది.

¤ ఏదైనా యానకంలో కాంతి వేగం v అయితే శూన్యంలో కాంతి వేగానికి, యానకంలోని కాంతి వేగానికి ఉన్న నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటారు. దీన్నే పరమ వక్రీభవనం గుణకం అంటారు.

¤ వక్రీభవన గుణకానికి ప్రమాణాలు లేవు.
¤ ఒక యానకంలో కాంతి ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో వక్రీభవన గుణకం తెలుపుతుంది.
¤ శూన్యంలో కాంతి వేగంలో 'n' వ వంతు యానకంలో కాంతి వేగం అవుతుంది.


కొన్ని పదార్థాల వక్రీభవన గుణకాలు

 ¤ వక్రీభవన గుణకం ఎక్కువగా ఉండే యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది.
¤ వక్రీభవన గుణకం రెండు అంశాలపై ఆధారపడుతుంది.
     1. పదార్థ స్వభావం
     2. ఉపయోగించిన కాంతి తరంగ దైర్ఘ్యం


¤ పతన కోణం (i), వక్రీభవన కోణం (r) ల సైన్ విలువల నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటారు. దీన్నే స్నెల్ నియమం అని అంటారు.

¤ పతన, వక్రీభవన కిరణాలు; రెండు యానకాలను వేరుచేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకేతలంలో ఉంటాయి.
¤ వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
¤ నిర్దిష్ట పతన కోణం వద్ద సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం యానకాన్ని విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధకోణం అంటారు.
¤ సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతరం పరావర్తనం అంటారు.

సంపూర్ణాంతర పరావర్తనం - అనువర్తనాలు:

 
¤ ఎండమావులు, ఇంధ్రధనుస్సు ఏర్పడటానికి సంపూర్ణాంతర పరావర్తనం అవసరం.
¤ వజ్రాలు మెరవడానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం సందిగ్ధ కోణం చాలా తక్కువ (24.4º) కాబట్టి వజ్రంలోని ప్రవేశించే కాంతి సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది ప్రకాశిస్తుంది.
¤ దృశాతంతువులు (Optical fibers) సంపూర్ణాంతర పరావర్తనం పై ఆధారపడి పరిచేస్తాయి.
¤ ఆప్టికల్ ఫైబర్ అనేది గాజు/ ప్లాస్టిక్‌తో చేసిన సన్నని తీగ. దీని వ్యాసార్ధం 1 మైక్రోమీటరు = 10 మీ. ఉంటుంది.
¤ ఇలాంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైప్‌గా ఏర్పడతాయి.
¤ లాప్రోస్కోప్, ఎండోస్కోప్‌లో, సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు.
¤ పొట్టలోపలి భాగం చిత్రీకరణకు దీన్ని ఉపయోగిస్తారు.
ప్రశ్న: శూన్యంలో కాంతివేగం 3,00,000 కి.మీ./సె. వజ్రంలో కాంతి వేగం 1,24,000 కి.మీ./సె. అయితే వ్రజం వక్రీభవన గుణకం ఎంత?

                                                             = 2.42

 ప్రశ్న: నీటిపరంగా గాజు వక్రీభవన గుణకం  . గాజు పరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత?

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం:
¤ ఒక తొట్టెలో కర్రను ముంచినట్లయితే అది వంగినట్లు కనిపిస్తుంది.
¤ నక్షత్రాలు మెరవడం - తొట్టెలోని నాణెం పైకి వచ్చినట్లు కనిపించడం.
¤ ఆకాశంలోని పక్షికి నీటిలోని చేప పెద్దదిగా, నీటిపై ఉన్నట్లు కనిపించడం.
¤ చేపకు ఆకాశంలోని పక్షి ఉన్న పరిమాణం కంటే చిన్నదిగా, ఎక్కువ ఎత్తులో ఉన్నట్లు అగుపించడం లాంటివన్ని వక్రీభవన అనువర్తనాలు.
 

¤ ఒక పారదర్శక గోళకేంద్రం వద్ద ఒక చిన్న అపారదర్శక బిందువు ఉంది. గోళం బయట నుంచి చూసినప్పుడు ఆ బిందువు యథాస్థానంలో కనిపిస్తుంది.

¤ వక్రీభవనం కటకాల్లో జరుగుతుంది.

C1, C2లను కలిపే రేఖలను ప్రధానాక్షం అంటారు.
కటకం మధ్య బిందువును కటక ధ్రుక్ కేంద్రం P అంటారు.
i) అనంత దూరంలో వస్తువు ఉన్నపుడు కటకంపై పడే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి.
నాభి వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది.
 

ii) వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం తలకిందులుగా ఉన్న నిజప్రతిబింబం. ఇది ప్రధాన అక్షంపై నాభికి, వక్రతా కేంద్రానికి మధ్య ఏర్పడుతుంది.

iii) వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు C1 వద్ద నిజప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు పరిమాణంతో సమాన పరిమాణం ఉన్న ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది.

iv) వక్రతా కేంద్రం, నాభి మధ్య వస్తువును ఉంచినప్పుడు నిజప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. C1కు ఆవల ప్రతిబింబం ఏర్పడుతుంది.

f : నాభ్యంతరం

R1, R2 : వక్రతా వ్యాసార్ధాలు
¤ కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కంటే తక్కువ వక్రీభవన గుణకం ఉన్న యానకంలో ఉంచినప్పుడు కేంద్రీకరణ కటకంలా; వక్రీభవన గుణకం కంటే ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న యానకంలో ఉంచినప్పుడు వికేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.
ఉదా: నీటిలోని గాలి బుడగ వికేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.
ప్రశ్న: వక్రీభవన గుణకం n = 1.5గా ఉన్న ద్విపుటాకార కటకం గాలిలో ఉంచారు.  కటకం రెండు వక్రతా వ్యాసార్ధాలు 30 సెం.మీ., 6 సెం.మీ. అయితే నాభ్యంతరం ఎంత?

 ప్రశ్న: 20 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ కటకం ముందు 60 సెం.మీ. దూరంలో వస్తువు ఉంది. అయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?

ప్రశ్న: ఒక ద్వికుంభాకార క‌ట‌కం రెండు వ‌క్రత‌లాల వ్యాసార్ధాలు స‌మానం. క‌ట‌కం వ‌క్రీభ‌వ‌న గుణ‌కం 1.5 అయితే నాభ్యంత‌రం ఎంత‌?

¤ కటక నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధాలు సమానమైతే దాని వక్రీభవన గుణకం 1.5

మానవుడి కన్ను - రంగుల ప్రపంచం 

¤ మానవుడి కంటికి ఏ ఒత్తిడి లేకుండా స్పష్టంగా ఒక వస్తువును ఎంత కనీస దూరం నుంచి చూడగలడో ఆ దూరాన్ని స్పష్టదృష్టి కనీస దూరం అంటారు.
¤ సాధారణ మానవుడి స్పష్టదృష్టి కనీస దూరం 25 సెం.మీ.
¤ 10 ఏళ్లలోపు పిల్లలకు స్పష్టదృష్టి కనీసం దూరం 7 సెం.మీ. నుంచి 8 సెం.మీ.
¤ వృద్దులకు స్పష్టదృష్టి కనీసదూరం 1 మీటరు నుంచి 2 మీ లేదా అంతకంటే ఎక్కువ.
¤ చిన్న పిల్లల కంటి చుట్టూ కండరాలు దృఢంగా స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి.
¤ ఏ గరిష్ఠ కోణం వద్ద వస్తువును మనం పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని దృష్టి కోణం (angle of Vision) అంటారు.
¤ 60º కంటే తక్కువగా ఉంటే వస్తువును మొత్తం చూడగలం, 60º కంటే ఎక్కువ అయితే వస్తువులో కొంతభాగం మాత్రమే చూడగలం.
¤ దృష్టికోణం వ్యక్తి వ్యక్తికీ వయసును బట్టి మారుతుంది.
¤ జ్ఞానేంద్రియాల్లో కన్ను ఒక ముఖ్యమైన అవయవం.
¤ కన్నుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది. దాని ముందు భాగం వక్రంగా ఉండి కార్నియా అనే రక్షణ పొరను కలిగి ఉంటుంది.
¤ కార్నియా వెనక భాగంలో నేత్రోదక ద్రవం ఉంటుంది. దీని వెనుక ప్రతిబింబం ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది.
¤ నేత్రోదయ ద్రవం, కటకానికి మధ్య ఐరిస్/నల్లగుడ్డు అనే కండర పొర ఉంటుంది.
¤ ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు.

¤ మనకు కంటిలో కనిపించే రంగు ప్రాంతం ఐరిస్.

¤ కంటిలోని కటకానికి, రెటినాకు మధ్య దూరం 2.5 సెం.మీ. మాత్రమే.
¤ కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరీ కండరాలు కటక వక్రతావ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.
¤ కంటి కటకం వస్తువు నిజప్రతిబింబాన్ని రెటీనాపై తలకిందులుగా ఏర్పరుస్తుంది.
¤ రెటీనా అనేది సున్నితమైన పొర. ఇందులో దండాలు, కోనులు అనే 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి.
¤ దండాలు రంగును, శంకువులు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
¤ కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్ధుబాటు సామర్థ్యం అంటారు.
¤ కంటి కటక నాభ్యంతరం 2.27 నుంచి 2.50 సెం.మీ. మధ్య ఉంటుంది.
¤ కంటి కటక దోషాల వల్ల వచ్చే లోపాలు
     1) హ్రస్వదృష్టి (Myopia)
     2) దూరదృష్టి (Hyper metropia)
     3) చత్వారం (Presbyopia)

1) హ్రస్వదృష్టి: కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటుంది.

¤ హ్రస్వదృష్టి లోపం ఉన్నవారు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు.
¤ దీన్ని నివారించడానికి పుటాకార కటకం ఉపయోగిస్తారు. (ద్విపుటాకారం)
2) దీర్ఘదృష్టి:
¤ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు.
¤ కంటి కటకం కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
¤ ద్వికుంభాకార కటకాన్ని వాడడం ద్వారా ఈ దీర్ఘదృష్టిని నివారించవచ్చు.
3) చత్వారం:
¤ వయసుతో పాటు వచ్చే అంధత్వాన్ని చత్వారం అని పిలుస్తారు.
¤ సిలియరీ కండరాలు క్రమంగా బలహీన పడటం ద్వారా ఇది సంభవిస్తుంది.
¤ దీన్ని నివారించడానికి ద్వినాభి కటకాన్ని వాడతారు.
కటక సామర్థ్యం: ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటారు.
¤ కటక నాభ్యంతరం వ్యుత్క్రమ విలువను కటక సామర్థ్యం అంటారు.

కాంతి (Light).  >> Page - 30

¤ కటక సామర్థ్యం ప్రమణాలు డయాప్టర్‌లు. దీన్ని 'D' తో సూచిస్తారు.
ప్రశ్న: 2D కటకాన్ని వాడాలని వైద్యుడు సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత?
సాధన: P = 2D

కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం:
¤ ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుచేసి ఉన్న పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు.
¤ పట్టకంలో పతన కిరణానికి, బహిర్గత కిరణానికి మధ్య ఉండే కోణాన్ని విచలన కోణం d (Angle of deviation) అంటారు.

n = వక్రీభవన గుణకం
A = పట్టక కోణం
Dm = విచలన కోణం

ప్రశ్న: 60º పట్టక కోణం ఉన్న పట్టకం కనిష్ఠ విచలన కోణం 30º అయితే పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకం కనుక్కోండి.

సాధన: A = 60º, Dm = 30º

¤ తెల్లటి కాంతికిరణం వివిధ రంగులు (VIBGYOR) గా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. దీన్ని న్యూటన్ కనుక్కున్నారు.
¤ ఎరుపు రంగు అధిక తరంగదైర్ఘ్యాన్ని, ఊదారంగు తక్కువ తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి.
¤ ఊదారంగుకు ఎక్కువ విచలనం, ఎరుపు రంగుకు తక్కువ విచలనం ఉంటాయి.
¤ తరంగదైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం తగ్గుతుంది.

¤ కాంతి తరంగ వేగం, తరంగ దైర్ఘ్యం, తరంగ పౌనఃపున్యం మధ్య ఉండే సంబంధం v = λ

¤ కాంతి కిరణాలు వర్షపు బిందువులవైపు పడి వక్రీభవనం చెందడం వల్ల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
¤ నీటి బిందువుల్లోకి ప్రవేశించే కిరణాలు, బయటికి వెళ్లే కిరణాల మధ్యదూరం 40º  42º మధ్య ఉన్నపుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
¤ 42º ఉన్నప్పుడు ఎరుపు రంగు, 40º ఉన్నప్పుడు ఊదారంగు కనిపిస్తాయి.
కాంతి పరిక్షేపణం:
      ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతల్లో విడుదల చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.
                                                                       లేదా
      కాంతి కిరణాలు ప్రయాణిస్తున్న మార్గంలో ఎదురుగా చిన్న చిన్న వస్తువులను ఢీకొని వేగంలో మార్పు లేకుండా వేరొక దిశలో ప్రయాణించే దృగ్విషయాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.
¤ ఇది కాంతి కిరణం కోణంపై, తరంగదైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది.
   

¤ కాంతి కణాల పరిమాణం పై ఆధారపడుతుంది.

ఉదా: సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడం, మధ్యాహ్న వేళలో తెలుపురంగులో కనిపించడం, ఆకాశం నీలం రంగులో కనిపించడం, చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టిన మంచు ముక్కల పై కాంతి ప్రసరించినప్పుడు అవి మెరవడం అనేది పరిక్షేపణానికి అనువర్తనాలు.
¤ భారత శాస్త్రవేత్త సి.వి.రామన్ కాంతి పరిక్షేపణాన్ని ద్రవాలు, వాయువుల్లో వివరించారు. దీన్నే రామన్ ఫలితం అంటారు.
¤ ''ఒక ద్రవం వల్ల పరిక్షేపణం చెందిన కాంతి పతన కాంతి యొక్క పౌనఃపున్యానికి ఎక్కువ (లేదా) తక్కువ ఉంటుంది. దీన్నే రామన్ ఫలితం అని అంటారు. దీన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు అణువుల ఆకారాలను నిర్థారిస్తారు.
¤ పొగమంచు, దుమ్ము, ధూళి కణాల ద్వారా కాంతి కిరణాలు ఎక్కువగా పరిక్షేపణం చెందుతాయి కాబట్టి ఈ పదార్థాల ద్వారా కొంత దూరంలో ఉన్న వస్తువులను మనం చూడలేం.
ప్రశ్న: పట్టకం ఒక తలంపై 40º కోణంతో పతనమైన కాంతి 30º విచలనాన్ని పొందింది. ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణం కనుక్కోండి.

 ప్రశ్న: దీర్ఘదృష్టి ఉన్న ఒక వ్యక్తికి వైద్యుడు 100 సెం.మీ. నాభ్యంత‌రం ఉన్న క‌ట‌కాన్ని వాడ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. అయితే క‌ట‌క సామ‌ర్థ్యం ఎంత‌?

ప్రశ్న: ఒక వ్యక్తి దృష్టిదోష నివార‌ణ‌కు - 2.5 D క‌ట‌కం అవ‌స‌ర‌మైంది. అత‌డికి దృష్టిదోషానికి వాడాల్సిన క‌ట‌కం ఏది? క‌ట‌క నాభ్యంత‌రం ఎంత‌?


   ఒక వ్యక్తి పుటాకార క‌ట‌కాన్ని వాడాలి.
¤ కాంతి విక్షేపణంలో తెల్లటి కాంతి కిరణ పుంజం పట్టకంపై పతనం చెంది, ఏడు రంగులను ఏర్పరుస్తుంది. ఇవి (VIBGYOR)

రంగులు - రకాలు:
కాంతి విశ్లేషణంలో ఏర్పడిన రంగులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
     1. ప్రాథమిక రంగులు (Primary Colours)
     2. గౌణ రంగులు (Secondary Colours)

1. ప్రాథమిక రంగులు:

     ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతాయి.


2. గౌణ రంగులు:
     ప్రాథమిక రంగుల్లో ఏవైనా రెండు భిన్నమైన రంగులు ఒకదాంతో మరొకటి కలిసినప్పుడు ఏర్పడే ఫలిత రంగులను గౌణ రంగులు అంటారు.
   

 సంపూరక రంగులు:

 రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగులు కలసి తెలుపు రంగును ఏర్పరిచినట్లయితే వాటిని సంపూరక రంగులు అంటారు.
అనువర్తనాలు
i) ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుడిని ఆకుపచ్చ గాజుపలక ద్వారా చూసినప్పుడు సూర్యుడు నలుపు రంగులో కనిపిస్తాడు.
ii) పగటి సమయంలో ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది. దీన్ని ఎరుపు రంగు గాజుపలక ద్వారా చూసినప్పుడు నలుపు రంగులో కనిపిస్తుంది.
iii) ప్రాథమిక రంగులు ఒకదాంతో మరొకటి సమపాళ్లలో కలిసినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది.
                                  R + B + G = White
కాంతి వ్యతికరణం
       రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంతి కిరణాలు ఒకదానిపై మరొకటి అధ్యారోపణం చెందినప్పుడు ఫలిత కాంతి తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి మార్పు చెందుతాయి. ఈ ధర్మాన్ని కాంతి వ్యతికరణం అంటారు. దీన్ని థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.
ఉదా: నీటిపై నూనెను వెదజల్లినప్పుడు అనేక రంగులు కనిపించడానికి కారణం కాంతి వ్యతికరణం.
         కాంతి ఈ ధర్మం వల్ల సబ్బు బుడగ ఉపరితలంపై అనేక రంగులు ఏర్పడతాయి.

 కాంతి వివర్తనం:

       కాంతి కిరణాలు ప్రయాణిస్తున్న మార్గంలో ఎదురుగా ఉండే చిన్న అడ్డు తలాలను తాకి వాటి చుట్టూ వంగి ప్రయాణించే ధర్మాన్ని కాంతి వివర్తనం అంటారు.
¤ దీన్ని గ్రిమాల్డి అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.
¤ కాంతి వివర్తనం కింది అంశాలపై ఆధారపడుతుంది.
    i) కాంతి కిరణాల కోణం
    ii) కాంతి కిరణాల తరంగ దైర్ఘ్యం
    iii) తలం పరిమాణం
ఉదా:
¤ సంపూర్ణ సూర్యగ్రహణ సమయమంలో సూర్యుడి మూడో పొర కరోనా కనిపించడానికి కారణం కాంతి వివర్తనం.
¤ పర్వతం వెనుక భాగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు కాంతి కిరణాలు వివర్తనం చెందడం వల్ల అవి చారల్లా కనిపిస్తాయి.
¤ మేఘాలు, చెట్ల కొమ్మల ద్వారా సూర్యకాంతి ప్రసరించినప్పుడు వివర్తనం చెంది వెండి చారల్లా కనిపిస్తాయి.
¤ CD, DVD, గ్రామ్‌ఫోన్ ప్లేట్లపైన కాంతి కిరణాలు పతనమైనప్పుడు వివర్తనం చెంది వాటిపైన అనేక రంగులు కనిపిస్తాయి.

                           

    


 


           

Posted Date : 31-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌