• facebook
  • whatsapp
  • telegram

రసాయన చర్యలు - సమీకరణాలు

* బొగ్గును మండించడం, శరీరంలో ఆహారం జీర్ణమవడం, ఇనుము తుప్పుపట్టడం, శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ, పాలు పెరుగుగా మారడం, పొడిసున్నానికి నీటిని కలపడం, టపాసులను పేల్చడం లాంటివన్నీ రసాయన మార్పులే.
* ఒక రసాయన చర్య జరిగినప్పుడు కింది మార్పులు జరుగుతాయి.
      i) తొలి పదార్థాలు వాటి గుణాత్మక ధర్మాలు కోల్పోతాయి.
      ii) రసాయన చర్యలు ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యలు.
      iii) కరగని అవక్షేపాన్ని ఏర్పరుస్తూ చర్య జరపవచ్చు.
      iv) కొన్ని సందర్భాల్లో వాయువు విడుదల కావచ్చు.
* ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పునకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అంటారు.
* రసాయన చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
* ఒక రసాయన చర్యను అతి సూక్ష్మరూపంలో లేదా సంకేతాల్లో తెలియజేస్తే దాన్ని రసాయన సమీకరణం అంటారు.
ఉదా: CaOకు నీటిని కలపడం వల్ల Ca(OH)2 ఏర్పడుతుంది.

      CaO + H2O   Ca(OH)2
* ఏ రసాయన సమీకరణంలోనైతే క్రియాజనకాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి సమీకరణాన్ని తుల్యరసాయన సమీకరణం అంటారు.
      Fe2O3 + 2 Al   2 Fe + Al2O3
* రసాయన సమీకరణంలో క్రియాజనకాలు లేదా క్రియాజన్యాలు కిందివాటిపై ఆధారపడతాయి.
      i) భౌతిక స్థితి
      ii) ఉష్ణోగ్రతలో మార్పులు
      iii) ఏదైనా వాయువు వెలువడటం
      iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం
* పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జలద్రావణాలు అంటారు.
* వేడిచేయడానికి ''Δ" అనే గుర్తుతో సూచిస్తారు.
* ఉష్ణాన్ని విడుదల చేస్తే ఆ రసాయన చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు.
      C + O2   CO2 + ఉష్ణం
* ఉష్ణాన్ని గ్రహించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
      N2 + O2   2 NO - ఉష్ణం.

* రసాయన చర్యలో వాయువు విడుదల అయినట్లయితే '↑' గుర్తు వాడతారు.
* అవక్షేపం ఏర్పడినట్లయితే '↓' గుర్తును వాడతారు.
* రసాయన సమీకరణం క్రియాజనకాల, క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించి తెలియజేస్తుంది.
* రసాయన సమీకరణం నుంచి కింది సంబంధాలు తెలుసుకోవచ్చు.
      A) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
      B) ద్రవ్యరాశి - ఘనపరిమాణ సంబంధం
      C) ఘనపరిమాణ - ఘనపరిమాణ సంబంధం
      D) ద్రవ్యరాశి, ఘనపరిమాణం, అణువుల మధ్య సంబంధం
ఉదా: 8 గ్రాముల కాల్షియం కార్బొనేట్‌ను వేడిచేస్తే విడుదలైన CO2 ద్రవ్యరాశి ఎంత?

100 గ్రా. CaCO3 44 గ్రా. CO2 ను ఇస్తుంది.
8 గ్రాముల CaCO3 ఇచ్చే CO2 = 8/100  × 44 = 3.52 గ్రా.

* STP వద్ద 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్యనొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ద్రవ్యరాశి, ఘనపరిమాణం లెక్కించండి.


      
      46 గ్రా. సోడియం - 2 గ్రా. హైడ్రోజన్‌ను ఇస్తుంది.
      230 గ్రా. సోడియం - 230/46  × 2 = 10 గ్రా.


* స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 1 గ్రాము మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటారు.
రసాయన చర్యలు - రకాలు: ఇవి 4 రకాలు.
      1. రసాయన సంయోగం
      2. రసాయన వియోగం
      3. రసాయన స్థానభ్రంశం
      4. రసాయన ద్వంద్వ వియోగం

1. రసాయన సంయోగం:
    ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు చర్యజరిపి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని రసాయన సంయోగం అంటారు.
     C + O2   CO2 + Q
* పొడిసున్నానికి నీటిని కలిపి తడిసున్నం తయారు చేయడం.
    CaO + H2O  Ca(OH)2 + Q


2. రసాయన వియోగం:
     ఒక రసాయన చర్యలో ఒక క్రియాజనకం రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటారు.
      CaCO3   CaO + CO2 
* ఇది ఒక ఉష్ణవియోగ చర్య. వేడిచేయడం ద్వారా పదార్థాలు వియోగం చెందినట్లయితే వాటిని ఉష్ణవియోగ చర్యలు అంటారు.
    2 Pb(NO3)2  2 PbO + 4 NO+ O2
    2 H2O   2 H2 + O2
    2 AgBr  2 Ag + Br2 ↑
పై చర్యలు కాంతి సమక్షంలో జరుగుతాయి కాబట్టి వీటిని కాంతి రసాయన చర్యలు అంటారు.
* పై చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అని కూడా అంటారు.

3. రసాయన స్థానభ్రంశం:
     రసాయన చర్యలో సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలోకి ఇది వస్తుంది. దీన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
  e.g.: Zn + 2 HCl  ZnCl2 + H2
           Fe + CuSO4   FeSO4 + Cu
           Zn + 2 AgNO3   Zn(NO3)2 + 2 Ag
           Pb + CuCl2    PbCl2 + Cu


4. రసాయన ద్వంద్వ వియోగం:
     ఒక రసాయన చర్యలోని రెండు క్రియాజనకాలు ధన, రుణ ప్రాతిపదికలుగా మార్పు చెందితే అలాంటి చర్యలను రసాయన ద్వంద్వ వియోగం అంటారు.
     NO2SO4 + BaCl2   BaSO4 + 2 NaCl
     NaOH + HCl   NaCl + H2O
     NaCl + AgNO3   AgCl + NaNO3


ఆక్సీకరణం, క్షయకరణం:
* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను కలపడం లేదా హైడ్రోజన్‌ను తీసివేయడం ద్వారా జరిగే చర్యలను ఆక్సీకరణ చర్యలు అంటారు.

* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను తీసివేయడం లేదా హైడ్రోజన్‌ను కలపడం ద్వారా జరిగే చర్యలను క్షయకరణ చర్యలు అంటారు.
* ఆక్సీకరణం, క్షయకరణం ఒకేచర్యలో జరిగితే వాటిని రెడాక్స్ చర్యలు అంటారు.
      2 Cu + O2   2 CuO ఆక్సీకరణ చర్య.
      CuO + H2   Cu + H2O క్షయకరణ చర్య.

నిత్యజీవిత అనువర్తనాలు
* టపాసులు పేలడం ఆక్సీకరణ చర్య. దీనిలో మెగ్నీషియం ఆక్సీకరణం చెందడం వల్ల మిరుమిట్లు గొలిపే కాంతి విడుదల అవుతుంది.

* ఆపిల్ కోసినప్పుడు నిదానంగా గోధుమ రంగులోకి; నిమ్మకాయ కోసినప్పుడు మెల్లిగా ఎరుపు రంగులోకి; ఇనుప వస్తువులు కొత్తవి తెల్లగా, కాలం గడిచేకొద్ది గోధుమ రంగులోకి మారతాయి. కారణం ఆక్సీకరణమే.
* ఆపిల్‌లో ఉండే పాలీఫినాల్ ఆక్సిడేజ్/టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆపిల్‌ను గోధుమ రంగులోకి మారుస్తుంది.
* ఇనుము తుప్పుపట్టడం ఒక ఆక్సీకరణ చర్య.


* వెండి వస్తువులపై నల్లని పూత, రాగి వస్తువులపై ఆకుపచ్చ పూత ఏర్పడటానికి కారణం క్షయకరణం.
      4 Ag + 2 H2S + O2   2 Ag2S + 2 H2O
                                                    (నలుపు)
      2 Cu + O2   2 CuO
* తేమగల క్లోరిన్ వాయువులు రంగు గల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తాయి.
      Cl2 + H2O   HOCl + HCl
      HOCl   HCl + [O]
  ఇది క్షయకరణ చర్య.
* కొన్నిసార్లు వర్షాకాలంలో విద్యుత్తు స్తంభం నుంచి వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహఆక్సైడ్ పూత ఏర్పడటమే.
    ఈ లోహఆక్సైడ్ విద్యుత్ నిరోధంగా పనిచేస్తుంది.

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌