1. ఆమ్ల ద్రావణాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు-
జ: ఎరుపు
2. క్షారద్రావణాల్లో ఫినాఫ్తలీన్ సూచిక రంగు-
జ: గులాబి
3. క్షారస్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు-
జ: ఆకుపచ్చ
4. ఒక ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలిరంగులోకి మార్చింది దాని pH విలువ-
జ: 10
5. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటను పాలలా మార్చింది. ఆ ద్రావణం దేన్ని కలిగి ఉంటుంది?
జ: HCl
6. నీటిలో కరిగే క్షారాలను ఏమని పిలుస్తారు?
జ: క్షారయుత
7. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక pH సూచికతో ఏర్పడే రంగు (pH = 1)
జ: ఎరుపు
8. కిందివాటిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు?
ఎ) యాంటీబయోటిక్ బి) ఎనాల్జిటిక్ సి) యాంటాసిడ్ డి) యాంటీసెప్టిక్
జ: సి (యాంటాసిడ్)
9. మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వల్ల ఏర్పడే వాయువు -
జ: హైడ్రోజన్
10. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లం
జ: HCl
11. చాలా లవణాలు వాతావరణం నుంచి నీటిని శోషిస్తాయి. ఈ పద్ధతిని ఏమంటారు?
జ: హైడ్రేషన్
12. కిందివాటిలో విరంజనకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) CaOCl2 బి) Na2S2O3 సి) Na2SO4 డి) CuSO4
జ: ఎ (CaOCl2)
13. H2O + ..... H3O+
జ: H+
14. తటస్థీకరణంలో నీటితోపాటు ..... ఏర్పడుతుంది.
జ: లవణం
15. చింతపండులో ఉండే ఆమ్లం -
జ: టార్టారిక్ ఆమ్లం
16. సిరా మరకలను తొలగించడానికి కిందివాటిలో దేన్ని వాడతారు?
ఎ) ఆగ్జాలిక్ ఆమ్లం బి) కార్బొనిక్ ఆమ్లం సి) సిట్రిక్ ఆమ్లం డి) ఎసిటిక్ ఆమ్లం
జ: ఎ (ఆగ్జాలిక్ ఆమ్లం)
17. బేకింగ్ సోడా ఫార్ములా -
జ: NaHCO3
18. వాతావరణంలోని ఆమ్ల వర్షానికి ప్రత్యక్షంగా కారణమయ్యే వాయువు -
జ: SO3
19. పాలు పుల్లవైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది?
జ: లాక్టిక్ ఆమ్లం
20. ఆమ్లాలు రుచికి .....గా ఉంటాయి.
జ: పుల్లగా
21. వెనిగర్ అంటే .....
జ: CH3COOH
22. pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు ..... వస్తుంది.
జ: దంత క్షయం
23. తేలు కుట్టినప్పుడు బాధను తగ్గించడానికి ....... వాడతారు.
జ: దుష్టిపాకు
24. కిందివాటిలో సహజ సూచిక కానిది -
ఎ) మందారపూలు బి) బీట్రూట్ సి) మామిడి ఆకులు డి) లిట్మస్
జ: డి (లిట్మస్)
25. టూత్‌పేస్ట్ ..... లక్షణాన్ని కలిగి ఉంటుంది.
జ: క్షార