• facebook
  • whatsapp
  • telegram

మన చుట్టూ ఉన్న పదార్థం

1. Fe2O3 + 2 Al   Al2O3 + 2 Fe ఈ రసాయన చర్య దేనికి ఉదాహరణ?
జ: స్థానభ్రంశం

 

2. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఇనుపరజను కలిపితే ఏం జరుగుతుంది?
జ: ఐరన్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి

 

3. BaCl2 + Na2SO4  BaSO+ 2 NaCl అనే రసాయన చర్య-
జ: ద్వంద్వ వియోగం

4. హైడ్రోజన్, క్లోరిన్ వాయువుల నుంచి HCl ఏర్పడటం అనే రసాయన చర్య-
జ: రసాయన సంయోగం

 

5. కిందివాటిలో ఏది వియోగ చర్యను కలగజేయదు?
     ఎ) విద్యుత్ విశ్లేషణ      బి) ఉష్ణం        సి) కాంతి        డి) స్వేదనం
జ: డి (స్వేదనం)

 

6. క్షయం చెందడం అనేది ఏ ప్రక్రియ?
జ: ఆక్సీకరణం

 

7. ముక్కిపోవడం అనేది ఏ రకమైన చర్య?
జ: ఆక్సీకరణం

8. అప్పుడే కోసిన ఆపిల్ పండు నిదానంగా గోధుమ రంగులోకి మారడం ఏ తరహా రసాయన చర్య?
జ: ఆక్సీకరణం

 

9. వెండి వస్తువులపై 'నల్లటి' పూత ఏర్పడటం-
జ: క్షయకరణం

 

10. చిప్స్ ఎక్కువకాలం నిల్వ ఉండటానికి ఏ వాయువును నింపుతారు?
జ: నైట్రోజన్

 

11. శరీరంలో ఆహారం జీర్ణమవడం ఏ తరహా చర్య?
జ: భౌతిక మార్పు

 

12. రసాయన చర్యలో పాల్గొనే కారకాలు
జ: క్రియాజనకాలు

 

13. 1 A° =  m
జ: 10-10

 

14. నీటి అణువులో ఏర్పడే బంధం-
జ: సమయోజనీయ

 

15. ధ్రువ ద్రావణాలకు ఉదాహరణ-
జ: H2O

 

16. అయానిక పదార్థాలు ఏ ద్రావణాల్లో కరుగుతాయి?
జ: ధ్రువ

 

17. BeClఆకృతి-
జ: రేఖీయం

 

18. O2 సంయోజకత
జ: 2

 

19. స్థిర ధనాత్మక అయాన్‌లను ఏమంటారు?
జ: కాటయాన్‌లు

 

20. కిందివాటిలో అష్టక నియమానికి వ్యతిరేకమైంది-
     ఎ) Ne        బి) Xe        సి) Kr         డి) He
జ: డి (He)

 

21. పరమాణువులో రుణాత్మక కణాలు-
జ: ఎలక్ట్రాన్‌లు

 

22. కిందివాటిలో రుణ విద్యుదాత్మకత ఉండే మూలకం-
      ఎ) సోడియం       బి) ఆక్సిజన్     సి) మెగ్నీషియం      డి) కాల్షియం
జ: బి (ఆక్సిజన్)

 

23. పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణం భావనను ప్రవేశపెట్టినవారు-
జ: లైనస్ పౌలింగ్

 

24. బెరీలియం క్లోరైడ్‌లో బంధకోణం విలువ
జ: 180°

 

25. NHఅణువు ఆకృతి
జ: పిరమిడ్

 

26. కిందివాటిలో తరిగిపోయే శక్తి వనరు .....
      ఎ) సౌరశక్తి       బి) పవనశక్తి         సి) నేలబొగ్గు       4) జలశక్తి
జ: సి (నేలబొగ్గు)

 

27. 1 బ్యారెల్ = ...... లీటర్లు.
జ: 159

 

28. 4000 సంవత్సరాల కిందటే బాబిలోనియాలో వాడిన పెట్రో ఉత్పన్నం .....
జ: ఆస్ఫాల్ట్

 

29. కిందివాటిలో కోల్‌తార్ ఉపయోగం కానిది -
      ఎ) మందుల తయారీ        బి) పేలుడు పదార్థాలు          సి) ఇంధనం       డి) రంగులు
జ: సి (ఇంధనం)

 

30. నాఫ్తలీన్ గుళికలను ..... నుంచి తయారు చేస్తారు.
జ: కోల్‌తార్

 

31. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు?
జ: జ్వలన ఉష్ణోగ్రత

 

32. కిందివాటిలో త్వరగా దహనం చెందని పదార్థం-
      ఎ) స్పిరిట్       బి) పెట్రోలు           సి) కర్పూరం      డి) వంటచెరకు
జ: డి (వంటచెరకు)

 

33. ఎల్‌పీజీ (ద్రవ పెట్రోలియం గ్యాస్) కెలోరిఫిక్ విలువ (KJ/kg లలో)
జ: 55,000

 

34. నూనెతో కూడిన మంటలను ఆర్పడానికి .......ను ఉపయోగిస్తారు.
జ: CO2

 

35. 'బంగారు దారం' అని దేన్ని పిలుస్తారు?
జ: జనపనార

 

36. వర్షానికి తడవని దుస్తులను తయారుచేసినవారు-
జ: మొకింతోష్

 

37. కర్రగుజ్జుకు, రసాయనాలను కలిపి వేటిని తయారు చేస్తారు?
జ: రేయాన్

 

38. పాలిస్టర్ దారాలను వేటి నుంచి తయారు చేస్తారు?
జ: పెట్రోలియం

 

39. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన దారం -
జ: నైలాన్

 

40. పళ్లు తోముకునే బ్రష్ కుంచెను ....తో తయారు చేస్తారు.
జ: నైలాన్

 

41. పిల్లల డైపర్‌లలో ఉపయోగించే దారం ఏది?
జ: రేయాన్

 

42. కిందివాటితో 'కృత్రిమ ఉన్ని' అని దేన్ని అంటారు?
       ఎ) అక్రలిత్      బి) రేయాన్       సి) నైలాన్          డి) టెర్లిన్
జ: ఎ (అక్రలిత్)

 

43. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ ఏది?
జ: పాలిథీన్, PVC

 

44. ప్లాస్టిక్‌ను ఎవరు కనుకున్నారు?
జ: పార్క్స్

 

45. 'ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు' అని ఎవరిని పిలుస్తారు?
జ: బేక్‌లాండ్

 

46. ప్లాస్టిక్ వినియోగంలో ఉపయోగించాల్సిన సూత్రం
జ: 4R

 

47. వేడిచేసినప్పుడు మృదువుగా, చల్లబరిచినప్పుడు కఠినంగా తయారయ్యేవి-
జ: థర్మోప్లాస్టిక్ 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌