• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. 11 గ్రాముల CO2 ఎన్ని మోల్‌లకు సమానం?

జ: 0.25
 

2. 2 మోల్‌ల NH3 మోలార్ ద్రవ్యరాశి ఎంత?

జ: 34 గ్రా.
 

3. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు?

జ: లెవోయిజర్
 

4. 32U ఆక్సిజన్ ఎన్ని పరమాణువులను కలిగి ఉంటుంది?

జ: 2
 

5. నీటి అణువులో ఆక్సిజన్, హైడ్రోజన్‌ల ద్రవ్యరాశుల నిష్పత్తి-

జ: 1 : 8
 

6. 6.022 × 1023 అణువుల ఆక్సిజన్ ద్రవ్యరాశి -

జ: 32 గ్రా.
 

7. CaCO3లో కాల్షియం భారశాతం -

జ: 40
 

8. కిందివాటిలో అవగాడ్రో సంఖ్య -

ఎ) 6.022 ×  1020      బి) 6.022  ×  1024      సి) 6.022 × 1021      డి) 6.022 ×  1023

జ: 6.022  ×  1023
 

9. స్థిరానుపాత నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు?

జ: జోసెఫ్ ప్రౌస్ట్
 

10. 1 amu = ........

జ: C - 12 పరమాణువులో వ వంతు
 

11. కిందివాటిలో పరమాణు పరిమాణాన్ని ఏది నిర్ధారిస్తుంది?

ఎ) పరమాణు ద్రవ్యరాశి         బి) ప్రోటాన్ల సంఖ్య         సి) న్యూట్రాన్ల సంఖ్య         డి) ఏదీకాదు

జ: ఏదీకాదు
 

12. ఒక తటస్థ పరమాణువు కణంలో మూడు కర్పరాలు పూర్తిగా నిండాయి. అయితే ఆ పరమాణువు సంఖ్య

జ: 18
 

13. α - కణం వేటిని కలిగి ఉంటుంది?

జ: 2 ప్రోటాన్‌లు, 2 న్యూట్రాన్‌లు
 

14. ఒక పరమాణువు 16 ఎలక్ట్రాన్‌లను, 16 న్యూట్రాన్‌లను కలిగి ఉంటే దాని సంకేతం-

జ: 
 

15. పరమాణువులో న్యూట్రాన్‌లు ఉండే ప్రదేశం-

జ: కేంద్రకం లోపల
 

16. స్థిరశక్తిస్థాయులను ఎవరు ప్రవేశపెట్టారు?

జ: నీల్స్‌బోర్
 

17. కిందివాటిలో న్యూట్రాన్లు లేని కణం -

ఎ) హైడ్రోజన్        బి) డ్యూటీరియం        సి) ట్రిటియం         డి) కార్బన్ - 12

జ: హైడ్రోజన్
 

18. కిందివాటిలో స్థిరమూలకాలు -

ఎ) క్షారలోహాలు       బి) క్షారమృత్తిక లోహాలు      సి) జడవాయువులు       డి) ఏదీకాదు

జ: జడవాయువులు
 

19. కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య-

జ: 2n2
 

20. ఎలక్ట్రాన్‌ల దిగ్విన్యాసం దేని ద్వారా తెలుస్తుంది?

జ: 2l + 1
 

21. క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

జ: మాక్స్‌ప్లాంక్
 

22. కిందివాటిలో ఉద్గార వర్ణపటం -

ఎ) అవిచ్ఛిన్న        బి) రేఖా        సి) పట్టీ       డి) ఏదీకాదు

జ: అవిచ్ఛిన్న
 

23. l = 1 వద్ద ఉపకర్పరం ఆకృతి -

జ: ముద్గరం
 

24. l (అజిముతల్ క్వాంటం సంఖ్య) గరిష్ఠ విలువ -

జ: n - 1
 

25. ఎలక్ట్రాన్ విన్యాసం సంక్షిప్త రూపం -

జ: nlx
 

26. సవ్యదిశలో తిరిగే ఎలక్ట్రాన్ స్పిన్ -

జ: + 
 

27. విద్యుత్‌క్షేత్రంలో వర్ణపట రేఖలు విడిపోయే ఫలితం -

జ: స్టార్క్
 

28. దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టినవారు

జ: సోమర్‌ఫెల్డ్
 

29.L - కర్పరంలో ఇమడగలిగే ఎలక్ట్రాన్‌ల సంఖ్య-

జ: 8
 

30. ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతిమంతమైన వర్ణపట రేఖలు కనిపిస్తాయి. ఈ రేఖలు దేన్ని సూచిస్తాయి?

జ: తరంగదైర్ఘ్యం
 

31. ఒక పరమాణువులో l = 1 అయితే దాని ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ల సంఖ్య-

జ: 2
 

32. మొదటిసారిగా పరమాణు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

జ: డాల్టన్
 

33. STP వద్ద 1 మోల్ రసాయన సమ్మేళనం వాయుస్థితిలో కలిగి ఉండే అణువుల సంఖ్యను ఏమంటారు?

జ: వాయు స్థిరాంకం
 

34. హైడ్రోజన్ ప్రదర్శించే ఐసోటోపుల సంఖ్య-

జ: 3
 

35. న్యూట్రాన్‌ను కనుక్కున్నవారు-

జ: చాడ్విక్

Posted Date : 27-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌