• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌పంచీక‌ర‌ణ‌

1. ఒక దేశ ప్రభుత్వం దిగుమతులను తగ్గించడానికి పన్ను పెంచడాన్ని ఏమంటారు?

జ‌:   వాణిజ్య అవరోధం    


2. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడమే ప్రపంచీకరణకు ముఖ్య కారణం.

బి) ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించడాన్ని వాణిజ్య అవరోధం అంటారు.

జ‌:   ఎ మాత్రమే        


3. ప్రపంచీకరణను ప్రభావితం చేసిన అంశాల్లో కిందివాటిలో సరికానిది.

I. సాంకేతిక పరిజ్ఞానం

II. ప్రపంచ పరిపాలన సంస్థలు

III. విదేశీ వాణిజ్యం, పెట్టుబడి విధానాల సరళీకరణ

IV. వాణిజ్య అవరోధం.

జ‌:   IV


4. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రతికూల అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) ఒకదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని రంగాలపై విదేశీ ఆధిపత్యం పెరుగుతుంది.

2) రాజకీయ శక్తి పునర్విభజనకు దారితీస్తుంది.

3) వివిధ రకాల వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి.

4) పైవన్నీ సరైనవే

జ‌:   వివిధ రకాల వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి.


5. వివిధ దేశాల మధ్య ఏవిధమైన హద్దులు లేని స్వేచ్ఛా వ్యాపారాన్ని ఏమంటారు?

జ‌:  ప్రపంచీకరణ       


6. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) కొన్ని సందర్భాల్లో బహుళ జాతి సంస్థలు స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి తమ ఉత్పత్తులను తగ్గించుకుంటాయి.

బి) ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టడాన్ని ఆర్థిక అవరోధం అంటారు.

జ‌:  ఏదీకాదు


7. భారత్‌లోని ఫారెక్‌ఫుడ్‌ కంపెనీని కొనుగోలు చేసిన విదేశీ కంపెనీ ఏది?

జ‌: కార్గిల్‌


8. ప్రపంచీకరణ వల్ల భారత్‌లో ఎక్కువగా లాభపడిన సంస్థ?

జ‌: ఇన్ఫోసిస్‌ 


9. కిందివాటిలో సరికానిది ఏది?

ఎ) భారత్‌లో ప్రపంచీకరణ చిన్న ఉత్పత్తిదారులపై వ్యతిరేక ప్రభావం చూపింది.

బి) భారత్‌లో ప్రపంచీకరణ వల్ల ప్రయోజనం పొందింది గ్రామీణ వినియోగదారులు.

జ‌: బి మాత్రమే 


10. కింది అంశాలను జతపరచండి. 

i) మందులు       a) టాటా మోటార్స్‌

ii) రంగులు        b) సుందరం ఫాస్టెనర్స్‌

iii) వాహనాలు     c) రాన్‌బాక్సీ

iv) నట్లు, బోల్టులు  d)  ఏషియన్‌ పెయింట్స్‌

                          e) భారత్‌ బయోటెక్‌

జ‌: i - c, ii - d, iii - a, iv - b


11. ప్రపంచీకరణ ఏ దేశాలకు బాగా అనుకూలం?

జ‌:  అభివృద్ధి చెందిన  


12. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు లిబియాలో మహ్మద్‌ గడాఫీని అధికారం నుంచి తొలగించి, నూతన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎప్పుడు?

జ‌:  2012, నవంబరు 14 


13. కిందివాటిలో సరికానిది?

ఎ) భారత్‌లో సరళీకరణ విధానాలు 1991 నుంచి ప్రారంభమయ్యాయి.

బి) అమెరికాలో మొత్తం ఉపాధిలో వ్యవసాయరంగ ఉపాధి శాతం 1%.

జ‌: బి మాత్రమే 


14. ప్రపంచ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న దేశం ఏది?

జ‌:  అమెరికా   


15. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యాల విషయంలో అవరోధాలు తగ్గించి, ఆర్థిక సరళీకరణకు కృషిచేస్తున్న సంస్థ ఏది?

జ‌: WTO

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌