• facebook
  • whatsapp
  • telegram

పటాల అధ్యయనం - విశ్లేషణ

1. అల్‌ ఇద్రిసి రూపొందించిన పటానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) ఈ పటంలోని వివరాలు అరబిక్‌ భాషలో ఉన్నాయి.

2) ఈ పటం యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది.

3) ఆఫ్రికా ఖండంలోని ఉత్తర, దక్షిణ భాగాలను చూపించారు.

4) అల్‌ ఇద్రిసి క్రీ.శ.1154లో ప్రపంచ పటాన్ని రూపొందించారు.

2. 16వ శతాబ్దంలో ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగిన దేశం?

1) హాలెండ్‌      2) ఇంగ్లండ్‌  

3) ఫ్రెంచ్‌       4) అమెరికా

3. పటంలో చిత్తడి భూములను గుర్తించేందుకు ఉపయోగించే రంగు?

1) గోధుమ      2) పసుపుపచ్చ  

3) ఆకుపచ్చ      4) నలుపు

4. ఒక గ్రామ వైశాల్యం పది చదరపు కిలోమీటర్లు. ఆ గ్రామ జనాభా వెయ్యి. అయితే ఆ గ్రామ జనసాంద్రత ఎంత?

1) 150    2) 1000    3) 10     4) 100

5. పటంలో    ఇలాంటి గుర్తు దేనికి సంకేతం?

1) చెరువు     2) నిర్జన కోట 

3) సమాధి      4) మసీదు

6. ప్రపంచంలో మొదట పటాలను తయారు చేసింది సుమేరియన్లు. అయితే వీరికి పటాల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఏమిటి?

1) ప్రపంచ దేశాలతో వ్యాపారం ప్రారంభించడానికి

2) వ్యవసాయ భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరచడానికి

3) ఆ దేశ భూభాగ విస్తీర్ణం తెలుసుకోవడానికి

4) వరదల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి

7. ఒక పటంలో ఒక విషయానికి సంబంధించిన అంశాలను మాత్రమే పేర్కొంటే అవి ......

1) అట్లాస్‌      2) పురాతన పటాలు 

3) విషయ నిర్దేశిత పటాలు 

4) వినియోగ పటాలు

8. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఏ పటాలు బాగా ఉపయోగపడతాయి?

1) థీమాటిక్‌ పటాలు  2) భౌతిక పటాలు 

3) భూవినియోగ పటాలు

4) ఎత్తులను తెలిపే పటాలు

9. సుమేరియన్లు తయారు చేసిన ప్రపంచ పటంలో వారు గుర్తించిన దీవుల సంఖ్య?

1) 7   2) 10   3) 6   4) ఏదీకాదు

10. దగ్గర, దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలను తయారు చేయడం పట్ల మొదట ఆసక్తి కనబరచింది?

1) ఇరాక్‌ వారు      2) చైనీయులు 
3) రోమన్లు      4) గ్రీకులు

11. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సవివరమైన పటాలను తయారు చేసింది?

1) అనాక్సిమాండర్‌    2) హెరిడోటస్‌ 

3) టాలమీ       4) గెరార్డస్‌ మార్కేటర్‌

12. ‘నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణల యుగం’ అని ఏ కాలాన్ని పిలుస్తారు?

1) 15వ శతాబ్దం       2) 16వ శతాబ్దం 

3) 13వ శతాబ్దం      4) 14వ శతాబ్దం

13. బైబిల్‌లోని భావనలకు అనుగుణంగా చిత్రించిన ప్రపంచ పటంలో పవిత్ర భూమి, విశాలమైన ఖండం ఏది?

1) యూరప్‌        2) ఆఫ్రికా 

3) ఆసియా        4) ఆస్ట్రేలియా

14. డచ్‌ దేశ పటాల తయారీదారుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) టాలమీ       2) గెరార్డస్‌ మార్కేటర్‌  

3) హెరిడోటస్‌      4) అనాక్సిమాండర్‌

15. రాజస్థాన్‌ రాష్ట్ర జనసాంద్రత .... చ.కి.మీ.

1) 122    2) 131  3) 201   4) 269

16. పటంలో ‘  ’ గుర్తు దేన్ని సూచిస్తుంది?

1) నీటి లోతు 

2) కాంతి లేని లంగరు వేసే స్థలం 

3) దీపస్తంభం

4) కాంతితో లంగరు వేసే స్థలం

17. కృష్ణప్ప అనే రైతుకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 6 ఎకరాల భూమిలో పంటసాగు చేస్తున్నాడు. మిగిలిన 4 ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంకాని బంజరు భూమి. ఈ నాలుగెకరాల భూమిని పటంలో ఏ రంగుతో గుర్తించవచ్చు?

1) గోధుమ     2) పసుపుపచ్చ 

3) తెలుపు      4) లేతఎరుపు

18. కిందివాటిలో కాంటూరు రేఖలకు సంబంధించి సరైన వాక్యం?

1) రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే తక్కువ వాలు అని అర్థం.

2) రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం.

3) సమదూరంలో రేఖలు ఉంటే వాలు ఒకే రకంగా ఉందని అర్థం.

4) పైవన్నీ సరైనవే

19. ‘ఐసో ప్లెత్‌’ అంటే?

1) పటంలో హెచ్చు తగ్గుల ఆకృతి 

2) పటంలో సమాన లోతు ఉన్న ప్రదేశాలు

3) సమాన దూరంలో ఉన్న ప్రదేశాలు 

4) సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలు

20. పటాల తయారీకి కింది ఏది అనవసరం?

1) దిక్కులు      2) దిక్సూచి 

3) స్కేలు       4) చిహ్నాలు

21. ఉదయిస్తున్న సూర్యుడికి అభిముఖంగా నిలబడిన వేదాంత అనే విద్యార్థి ఇల్లు ఆ గ్రామంలో దక్షిణం వైపు ఉంది. అతడు తన ఇంటికి చేరుకోవాలంటే ఏ వైపుకు నడవాలి?

1) అలాగే ముందుకు నడవాలి 

2) వెనుకవైపునకు తిరిగి నడవాలి 

3) తన కుడి చేతివైపు తిరిగి నడవాలి 

4) తన ఎడమ చేతివైపు తిరిగి నడవాలి

22. హిందుస్థాన్‌ పటాలను తయారు చేయమని జేమ్స్‌ రస్సెల్‌ను కోరిన గవర్నర్‌ జనరల్‌?

1) వారెన్‌ హేస్టింగ్స్‌    2) విలియం బెంటింక్‌ 

3) రాబర్ట్‌ క్లైవ్‌     4) కర్జన్‌

23. సర్వే ఆధారంగా భారతదేశ మొట్టమొదటి పటాలను జేమ్స్‌ రస్సెల్‌ ఎప్పుడు రూపొందించాడు?

1) 1782    2) 1792   3) 1802    4) 1812

24. అధికారిక విషయ నిర్దేశిత పటాల్లో రంగుల ‘ఛాయా క్రమశ్రేణి’ని గుర్తించండి.

1) లేత రంగు నుంచి ముదురు రంగు  

2) ముదురు రంగు నుంచి లేత రంగు

3) అనేక రంగుల కలయిక 

4) గుర్తించిన రంగులు

25. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబ్‌ను ఎవరి సామ్రాజ్యంలో రూపొందించారు?

1) అశోకుడు     2) అలెగ్జాండర్‌

3) జహంగీర్‌     4) హర్షుడు

26. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

1) కృష్ణా     2) గోదావరి 

3) మంజీరా      4) ప్రాణహిత

27. తెలంగాణలో నల్ల మృత్తికలు అధికంగా  ఉన్న జిల్లాలు?

1) జయశంకర్, మంచిర్యాల 

2) మంచిర్యాల, కుమురం భీం 

3) జగిత్యాల, మంచిర్యాల 

4) కుమురం భీం, ఖమ్మం

28. కిందివాటిలో సరికానిది?

1) ఉపరితల ఛాయా చిత్రాలు పటాలు కావు.

2) ఉపగ్రహ ఛాయా చిత్రాలను పటాల తయారీకి ఉపయోగిస్తారు.

3) పశ్చిమ తెలంగాణలో సాధారణ వర్షపాతం, తూర్పు తెలంగాణలో అధిక వర్షపాతం కురుస్తుంది.

4) కాంటూరు రేఖలు ్ఞగ్ఠీ ఆకారాన్ని పోలి ఉంటాయి.

29. "V" ఆకారపు లోయలను ఏర్పరిచేవి?

1) హిమనీ నదాలు    2) నదులు 

3) సముద్రపు అలలు     4) ఇసుక రేణువులు

30. కింది అంశాలను జతపరచండి.

రాష్ట్రాలు             జనసాద్రత

i) సిక్కిం       (  )    a) 52

ii) మిజోరం     (  )     b) 236

iii) గోవా      (  )     c) 86

iv) మధ్యప్రదేశ్‌   (  )     d) 394

1) i - a, ii - c, iii - b, iv - d   

2) i - d, ii - b, iii - a, iv - c

3) i - c, ii - b, iii - d, iv - a   

4) i - c, ii - a, iii - d, iv - b

31. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులేని తెలంగాణ జిల్లా?

1) మహబూబ్‌నగర్‌       2) వనపర్తి 

3) ఖమ్మం          4) నల్గొండ

32. రిషిక హైదరాబాద్‌ నుంచి భోపాల్‌కు వెళ్లాలంటే ఎటువైపుగా ప్రయాణించాలి?

1) తూర్పు      2) ఉత్తరం   

3) పడమర      4) దక్షిణం

33. భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. ఎందుకంటే?

1) ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్రమట్టం దాదాపు సమానం.

2) ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో మరొకటి కలసి ఉన్నాయి.

3) ప్రపంచంలోని సముద్ర జలాల్లో పోటుపాటుల ఎత్తు సమానం.

4) భూమిపై లోతైన ప్రాంతాలు సముద్రాలు.

34. ఒయాసిస్‌ అంటే?

1) ఎడారిలోని మంచినీటి సరస్సు  

2) ఎడారిలోని ఉప్పునీటి సరస్సు  

3) ఎడారిలోని నదీ ప్రవాహం   

4) ఎడారిలోని నీటిగుంట

35. భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో పెరిగే అరణ్యాలు?

1) ఆకురాల్చే అరణ్యాలు   2) చిట్టి అడవులు 

3) సతతహరితారణ్యాలు 

4) ఆల్ఫైన్‌ అడవులు

36. కిందివాటిలో సరికానిది?

1్శ క్రీ.శ.1839లో డా మింగ్‌ హుయి తు ప్రపంచ పటాన్ని రూపొందించాడు. 

2్శ డా మింగ్‌ హుయి తు తన పటంలో గుడ్‌ హోప్‌ అగ్రాన్ని చూపించాడు.

3్శ యూరోపియన్లు టాలమీ పుస్తకాలను   క్రీ.శ.1480లో తిరిగి కనుక్కున్నారు. 

4్శ పైవన్నీ సరైనవే

37. ప్రపంచ పటంలో ఖండాల ఆకారం, దిశలను సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించినవారు?

1) గ్రీకు   2) చైనా   3) డచ్‌   4) సుమేరియా

38. రిషిక అనే విద్యార్థి భారతదేశంలోని భూస్వరూపాలకు పటంలో రంగులు వేయాలనుకుంది. అయితే పర్వతాలు, వాటిలో ప్రవహించే నదులకు ఏ రంగు అద్దాలో ఆలోచిస్తూ ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థినికి నీ సలహా......

1) ముదురు ఆకుపచ్చ, లేత నీలం 

2) ముదురు ఊదా, ముదురు నీలం 

3) లేత ఊదా, లేత నీలం 

4) ముదురు ఊదా, లేత నీలం 

39. అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకునే ప్రాంతాన్ని ఏమంటారు? 

1) గ్లోబ్‌  2) అట్లాస్‌  3) గ్రిడ్‌  4) పటం

40. గ్లోబల్‌ అనే పదం గ్లోబస్‌ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. లాటిన్‌ భాషలో గ్లోబస్‌ అంటే?

1) భూమి         2) గోళం 

3) గుండ్రం         4) ప్రపంచం

41. భూమిపై ఉన్న వాస్తవ దూరానికి పటంలో చూపిన దూరానికి ఉన్న నిష్పత్తిని పటం పరి భాషలో ఏమంటారు? 

1) స్కేలు          2) దిక్సూచి 

3) సంప్రదాయ చిహ్నాలు  4) చిత్తుచిత్రం

42. సూర్యోదయం అయ్యే దిక్కుకు, సూర్యాస్తమయం అయ్యే దిక్కుకు మధ్య ఉన్న దిశ పేరు?

1) ఈశాన్యం     2) నైరుతి 

3) ఆగ్నేయం     4) ఏదీకాదు 

43. కార్టోగ్రాఫర్స్‌ అంటే? 

1) అందమైన చిత్రాలు గీసేవారు 

2) పటాలను తయారు చేసే విధానం 

3) పటాలను తయారు చేసేవారు 

4) పటాలను సంకలనం చేయడం 

44. గ్రామాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు చూపే పటం?

1) భౌతిక పటం     2) రాజకీయ పటం 

3) విషయ నిర్దేశిత పటం 

4) చారిత్రక పటం 

45. భారతదేశంలోని చోటా నాగ్‌పుర్‌ పీఠభూమి ఖనిజాలకు ప్రసిద్ధి. ఇవి లభించే ప్రాంతాలను పటంలో ఏ రంగుతో సూచిస్తారు? 

1) తెలుపు     2) నలుపు 

3) లేత ఎరుపు     4) పసుపుపచ్చ 

46. ఒక పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి భారతదేశంలోని నదులు, సరస్సులు, తూర్పు కనుమలు చూడటానికి విహార యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే వారి యాత్రను సులభతరం చేసేందుకు ఉపయోగపడే పటం? 

1) భారతదేశ పటం  2) రాజకీయ పటం 

3) భౌతిక పటం       4) చారిత్రక పటం

సమాధానాలు

13  21  32  44  52  62  73  84  91  104  113  121  133  142  153  162  174  184  191  202  213  223  232  242  253  263  272  284  292  304 311  322  331  341  353  361  373  384  393  402  411  424  433  442  451  463  

Posted Date : 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌