• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక వ్యసవ్థలో సమస్యలు 

1. 1995లో భారతదేశ తలసరి ఆదాయం ఎంత?

2. ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత?
 

3. ప్రపంచంలో వయోజన అక్షరాస్యత అధికంగా ఉన్న దేశం ఏది?
 

4. భారతదేశంలో కనిపించే ద్రవ్యోల్బణం ఏ రకమైంది?
 

5. ప్రపంచాభివృద్ధి నివేదిక 1997 ప్రకారం నిమ్న ఆదాయవర్గంలోకి వచ్చే దేశానికి ఉదాహరణ ఏది? 
 

6. ఏ రకమైన నిరుద్యోగంలో ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది? 
 

7. తెలంగాణా, రాయలసీమల్లో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రాంతీయ ప్రణాళికలను అవలంబించిన సంవత్సరం ఏది?
 

8. భారతదేశ జీవన ప్రమాణం ఎంత?
 

9. నిర్మాణ సంబంధమైన ద్రవ్యోల్బణ స్థితి  ఏ దేశాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది?
 

10. అమల్లో ఉన్న వేతనాలకు ఉద్యోగాలు లభించని స్థితిని  ఏమంటారు?
 

11. ప్రస్తుతం 'అందరికీ ఆరోగ్యం' అన్న పథకాన్ని ఏ విధంగా పేరు మార్చారు?
 

12. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన ప్రాంతాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?
 

13. ఆసియా దేశాలన్నింటిలో ఆయుఃప్రమాణం అధికంగా ఉన్న దేశం ఏది?
 

14. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఏ రంగంలో కన్పిస్తుంది?   
 

15. పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తుల నిరుద్యోగం ఏ రకానికి చెందినది? 
 

16. ఆర్థికాభివృద్థి సూచికను ఆధారంగా తీసుకుంటే మన దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
 

17. ప్రాంతీయాభివృద్ధి సూచికలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
 

18. పారిశ్రామికాభివృద్ధిని సూచికగా తీసుకుంటే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
 

19. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యతా రేటు ఎంత?
 

20. ఇందిరా ఆవాస్ యోజన ఎలాంటి అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేశారు?
 

21. నీటిపారుదల అభివృద్ధి ప్రధానంగా ఏ రంగానికి తోడ్పడుతుంది?
 

22. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యతా శాతం ఎంత?
 

23. అనిచ్ఛాపూర్వక, స్వచ్ఛంద నిరుద్యోగాల మధ్య భేదాన్ని కనుగొన్నది ఎవరు?
 

24. జాతీయాదాయం పెరిగితే  ప్రజలకు  ఏది  పెరుగుతుంది?
 

25. ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో ఒకదాన్ని తెలపండి. 
 

26. పేదరికం  ఏ  ప్రాంతాల్లో కంటే  ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది? 
 

27. ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా? కాదా? అని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రమాణాల్లో ముఖ్యమైంది ఏది?
 

28. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఎక్కువగా ఉండే నిరుద్యోగ స్థితి ఏది?
 

29. భారత జాతీయ నమూనా సర్వే ప్రకారం వారానికి ఎన్ని గంటల కంటే తక్కువ పనిచేసే వారిని అల్ప ఉపాధి ఉన్నవారిగా గుర్తిస్తారు?
 

30. భారతదేశానికి  ఏ రకమైన ద్రవ్యోల్బణం వర్తిస్తుంది?
 

31. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల మధ్య దూరాన్ని తగ్గించడానికి  ప్రవేశ పెట్టిన పథకం ఏది ?
 

32. వ్యయం పెరగడం వల్ల, సాధారణ ధరల స్థాయి స్థిరంగా పెరిగినప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బణం  ఏది?
 

33. ఎస్.జి.ఎస్.వై. (S.G.S.Y) అంటే ఏమిటి? 
 

34. ఎస్.జి.ఆర్.వై. (S.G.R.Y) అంటే ఏమిటి? 

జవాబులు:  1. 340 డాలర్లు    2. రెండో స్థానం     3. రిపబ్లిక్ ఆఫ్ కొరియా      4. నిర్మాణ సంబంధమైన     5. భారతదేశం      6. ప్రచ్ఛన్న నిరుద్యోగం      7. 1970      8. 60.8 సంవత్సరాలు        9. లాటిన్ అమెరికా   10. అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం     11. అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్యం       12. తెలంగాణ, రాయలసీమ      13. సింగపూర్        14. వ్యవసాయ రంగం       15. స్వచ్ఛంద నిరుద్యోగం     16. పంజాబ్   17. పదో స్థానం     18. మహారాష్ట్ర        19. 65.38%        20. గృహ    21. వ్యవసాయ     22. 52.2%     23. జె.ఎం.కీన్స్     24. జీవన ప్రమాణం    25. అమెరికా సంయుక్త రాష్ట్రాలు    26. పట్టణ, గ్రామీణ     27. తలసరి ఆదాయం     28. స్వచ్ఛంద నిరుద్యోగం     29. 14        30. డిమాండ్ పుల్     31. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్    32. కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం        33. స్వర్ణ జయంతి గ్రామ సమృద్ధి యోజన   34. సంపూర్ణ గ్రామ రోజ్‌గార్ యోజన

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌