• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ వనరులు, పరిశ్రమలు  

1.  భారతదేశంలో ఎక్కువగా ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తున్న ఖనిజం ఏది?
 

2.  అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది? 
 

3.  మధ్యప్రదేశ్ ఏ ఖనిజాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుంది?
 

4.  ఆంధ్రప్రదేశ్‌లో ఇనుప ధాతువు నిక్షేపాలు ఏజిల్లాలో ఉన్నాయి?
 

5.  మాంగనీస్ ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం ఏది? 
 

6.  రాజస్థాన్  ఏ ఖనిజం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది?
 

7. అల్యూమినియం దేని నుంచి తయారవుతుంది?
 

8.  ఏ శిలల్లో ఎక్కువగా ఇనుప ధాతు నిక్షేపాలున్నాయి?
 

9.  కోలార్ దేనికి  పేరుగాంచింది?
 

10.  సున్నపురాయి పరిశ్రమకు కావలసిన ముఖ్యమైన ముడి పదార్థం ఏది?

11.  భారతదేశంలో రాగి ఉత్పత్తి   ఏ విధంగా ఉంది?
 

12.  భారతదేశం నుంచి ముడి ఇనుము అధికంగా కొనుగోలు చేస్తున్న దేశం ఏది?
 

13.  భారతదేశంలో అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది?
 

14.  1904లో మొట్ట మొదటి సిమెంట్ కర్మాగారం స్థాపించిన ప్రాంతం ఏది? 
 

15.  దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం నెలకొల్పేందుకు సహాయం చేసిన దేశం ఏది?
 

16.  పట్టు పరిశ్రమ  ఏ  రాష్ట్రంలో విరివిగా ఉంది?
 

17.  భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఏ  సంవత్సరంలో నెలకొల్పారు?
 

18.  రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని  ఏ  దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
 

19.  మన దేశంలోని  ఏ  పారిశ్రామిక ప్రాంతాన్ని పశ్చిమ జర్మనీలోని ''రూర్''తో పోలుస్తారు?
 

20.  వస్త్ర పరిశ్రమలు ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి?
 

21.  పశ్చిమ తీరంలో పెట్రోలియం ఉత్పత్తి ముఖ్య కేంద్రం ఏది?
 

22.  దేశంలోని ముఖ్యమైన ఇనుప ధాతువులు ఏవి?

23. లిగ్నైట్ రకపు బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది? 
 

24.  ఏ మేఖల ఇసుక నిక్షేపాల్లో థోరియం, యురేనియం ఖనిజాలున్నాయి?
 

25.  సీసం, జింకు నిక్షేపాలు ఏ ఆకృతిలో కలగలసి ఉంటాయి?
 

26.  ఇనుము-ఉక్కు పరిశ్రమకు కావలసిన ముఖ్య ముడి పదార్ధాలు ఏవి? 
 

27.  విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఆధారమైన ఖనిజం ఏది?
 

28.   అణుశక్తి ఇంధనంగా ఉపయోగపడేది ఏది?
 

29.  పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
 

30.   కడప జిల్లాలో ఏ  ఖనిజం ఎక్కువగా ఉత్పత్తి  అవుతుంది?
 

31.  పెన్సిల్ మొనల తయారీలో ఉపయోగించే లోహం ఏది? 

32.  ఎలక్ట్రిక్ దీపాల ఫిలమెంట్ల తయారీలో దేన్ని ఉపయోగిస్తారు?
 

33.  పింగాణీ పరిశ్రమకు కావలసిన  ముఖ్య ఖనిజం ఏది?
 

34.  ఆంధ్రప్రదేశ్‌లో  ఏ  జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి?
 

35.  భారత ప్రతిస్థాపక యోగ్యశక్తి అభివృద్ధి సంస్థ నెలకొల్పిన సంవత్సరం  ఏది?
 

36.  ఖనిజ నిక్షేపాలు మన దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 
 

37.  అంకలేశ్వర్‌లో దొరికే ఖనిజం ఏది?
 

38.  చైనా మట్టి  ఏ  ప్రాంతంలో లభిస్తోంది?

39.  విమానాల తయారీలో  ఏ లోహాన్ని ఎక్కువగా వాడతారు?

40.  'మాజగావ్‌డాక్' ఎక్కడ ఉంది?
 

41.  ఉక్కు కర్మాగారాలు ఎక్కువగా ఏ రంగంలో ఉన్నాయి?
 

42.  భారతదేశంలో నూలు వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రెండు రాష్ట్రాలు  ఏవి? 
 

43.  భారతదేశపు అతి పురాతన పరిశ్రమ ఏది?
 

44.  భారతదేశంలోని అతిపెద్ద పరిశ్రమ ఏది?
 

45.  కర్రగుజ్జు తయారీకి  ఏ వృక్షాల కలప అవసరం?
 

46.  భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లును ఎక్కడ  స్థాపించారు?
 

47.  ఆధునిక నూలు మిల్లు ఎక్కడ ప్రారంభించారు?
 

48.  బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారానికి ఎక్కడి నుంచి బొగ్గు లభిస్తుంది?

 

49.  జనపనార పరిశ్రమ ఏ రాష్ట్రంలో కేంద్రీకృతమైంది?
 

50.  విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది?
 

51.  ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం వహిస్తున్న రాష్ట్రం ఏది?

52. T.I.S.C.O.అంటే ఏమిటి?
 

53.  పంచదార కర్మాగారాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? 
 

54.  శ్రీనగర్  ఏ వస్త్రాలకు ప్రసిద్ధి?
 

55.  మన దేశంలో ప్రథమ ఇనుము-ఉక్కు కర్మాగారం  ఎక్కడ నెలకొల్పారు?
 

56.  న్యూస్ ప్రింట్ కాగితం ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏది?
 

57.  ప్రైవేట్ రంగంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం ఏది?
 

58.  దేశంలోని నౌక నిర్మాణ కేంద్రాల్లో పెద్దది ఏది?
 

59.  అధిక సంఖ్యలో తోళ్లను శుభ్రపరిచే కేంద్రం ఎక్కడ ఉంది?
 

60.  సున్నపురాయి అధికంగా లభించే రాష్ట్రం ఏది?
 

61.  ఉత్తరప్రదేశ్‌లో గాజు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
 

జవాబులు:  1.నేలబొగ్గు     2.బాక్సైట్     3.వజ్రాలు    4.కర్నూలు/ఖమ్మం   5.మూడోస్థానం   6.జిప్సం      7.బాక్సైట్    8.ఆర్కెయిన్      9.బంగారం   10.సిమెంట్.    11.చాలాతక్కువ     12.జపాన్     13.మధుర   14.చెన్నై     15.బ్రిటన్    16.కర్ణాటక  17.1904     18.జర్మనీ   19 . చోటానాగ్‌పూర్    20.ముంబయి/అహ్మదాబాద్      21.బాంబేహై       22.హెమటైట్, మాగ్నటైట్   23.తమిళనాడులోని నైవేలీ     24.మధ్య రాజస్థాన్, గుజరాత్      25.స్పటికాకృతి    26.ఇనుపధాతువు,మాంగనీస్     27.మైకా     28.యురేనియం      29.అసోం        30.బైరైటిస్     31.గ్రాఫైట్       32.టంగ్‌స్టన్       33.కయనైట్   34.అనంతపూర్   35.1987.      36.బీహార్         37.పెట్రోలియం    38.తమిళనాడు      39.అల్యూమినియం   40.ముంబై      41.ప్రభుత్వ       42.మహారాష్ట్ర, గుజరాత్       43.నూలు వస్త్ర/ చేనేత       44.వస్త్ర పరిశ్రమ      45.శృంగాకార     46.1818      47.ముంబయి     48.ఝరియా.     49.పశ్చిమ బెంగాల్     50. కర్ణాటకలోని భద్రావతి వద్ద     51.పంజాబ్    52.టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ    53.ఉత్తరప్రదేశ్   54.ఉన్ని   55.జంషెడ్‌పూర్     56.నేపానగర్    57.డిగ్బాయ్  58.విశాఖపట్టణం   59.చెన్నై       60.తమిళనాడు       61.ఫిరోజాబాద్.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌