• facebook
  • whatsapp
  • telegram

మండల పరిషత్  

* పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడు అంచెలు ఉంటాయి. కిందిస్థాయిలో గ్రామ పంచాయతీ, పైస్థాయిలో జిల్లా పరిషత్, మధ్యస్థాయిలో మండల పరిషత్ ఉంటుంది.
* మండల పరిషత్ పరిధిలో 20 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

 

మండల పరిషత్ నిర్మాణం: మండల పరిషత్ కింది సభ్యులతో ఏర్పడుతుంది.

* ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు
     (ఎంపీటీసీ - MPTC = Mandal Parishad Teritorial Constituency)
* మండలానికి సంబంధించిన నియోజక వర్గ శాసన సభ్యులు.
(విధానసభ, లోక్‌సభ సభ్యులు - ఎంఎల్ఏ, ఎంపీ)
* మండలంలో ఓటరుగా నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు.
* మండలంలో ఓటరుగా నమోదు చేసుకున్న అల్పసంఖ్యాక వర్గానికి చెందిన 'కో ఆప్ట్' చేయబడిన ఒక వ్యక్తి.
* ఎంపీటీసీ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడానికి మండలాన్ని ప్రాదేశిక నియోజక వర్గాల కింద విభజిస్తారు.
* ఈ నియోజక వర్గాల్లో 3000 నుంచి 4000 వరకు జనాభా ఉండేలా మండలాన్ని అవసరమైనన్ని నియోజక వర్గాలుగా విభజిస్తారు.

 

మండల పరిషత్ ఎన్నికకు రిజర్వేషన్లు

* ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో కేటాయిస్తారు.
* బీసీలకు   వ వంతు.
* మహిళలు   వ వంతు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50% సీట్లు కేటాయిస్తున్నారు.)

ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలు

* 21 సంవత్సరాల వయసు నిండినవారు.
* ఆ మండల ఓటర్ల జాబితాలో పేరు నమోదైనవారు.

 

పదవీకాలం

* ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, కోఆప్ట్ సభ్యులు అయిదేళ్లు పదవిలో ఉంటారు.
* పదవిరీత్యా సభ్యులైనవారు ఆ పదవీకాలం పూర్తి అయ్యేవరకు మండల పరిషత్ సభ్యులుగా కొనసాగుతారు.
ఉదా: ఎంపీ, ఎంఎల్ఏ

 

శాశ్వత ఆహ్వానితులు:

* జిల్లా కలెక్టరు
* మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు.
మండల పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు.
గమనిక: వీరు సమావేశాల్లో పాల్గొని మాట్లాడటానికి అధికారం ఉంది. కానీ ఓటు వేయడానికి అర్హత లేదు.

 

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు:

* ప్రతి మండల పరిషత్‌కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు.
* వీరిని మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ) పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.
* మండల పరిషత్ తొలి సమావేశంలోనే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

 

మండల పరిషత్ ఆర్థిక వనరులు

* ప్రభుత్వ గ్రాంట్‌లు
* విరాళాలు
* ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటాలు
* స్వంత ఆర్థిక వనరులు
* మండల పరిషత్ విధించే పన్నులు

 

విధులు

* గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు మొదలైన వాటి సహకారంతో సమాజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.
* వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి చర్యలు చేపట్టడం. నూతన వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేయడం.
* పశుసంపద అభివృద్ధికి కృషి చేయడం.
* పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు.
* అడవుల అభివృద్ధికి కృషి.

 

మండల అభివృద్ధి అధికారి (ఎండీవో)

* ప్రతి మండల పరిషత్‌కు ఒక అభివృద్ధి అధికారి ఉంటాడు.
* ఇతడు మండలానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి.
* మండల పరిషత్ నిర్ణయాలను అమలు చేయడం ఇతడి ముఖ్యవిధి.
* మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పని తీరును ఇతడు పర్యవేక్షిస్తాడు.
* ఇతడు మండల పరిషత్ సమావేశాలకు హాజరు కావచ్చు కానీ ఓటు హక్కు లేదు.
* ఇతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌