1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ లేని జిల్లా -
జ: హైదరాబాద్
2. జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు -
జ: 21 ఏళ్లు
3. ప్రతి జిల్లా పరిషత్‌కు ఎన్ని స్టాండింగ్ కమిటీలు ఉంటాయి?
జ: 7
4. జిల్లాలో అత్యున్నత స్థానిక సంస్థ ఏది?
జ: జిల్లా పరిషత్
5. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను ఎలా ఎన్నుకుంటారు?
జ: జిల్లా పరిషత్‌కు ఎన్నికైన సభ్యులతో
6. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎవరు నియమిస్తారు?
జ: ఛైర్మన్
7. కిందివారిలో జిల్లా పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులు కానివారు -
ఎ) పంచాయతీ సర్పంచ్‌లు బి) మండలాధ్యక్షులు
సి) జిల్లా కలెక్టరు డి) ప్రధాన కార్యనిర్వహణాధికారి
జ: ఎ (పంచాయతీ సర్పంచ్‌లు)
8. ఒక మండల పరిషత్ బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
జ: జిల్లా పరిషత్
9. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం
10. జిల్లా పరిషత్ సమావేశాలకు ఓటు హక్కు లేకుండా హాజరయ్యేవారు -
జ: జిల్లా కలెక్టరు