• facebook
  • whatsapp
  • telegram

జిల్లా పరిషత్   

* ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉంటుంది.
* జిల్లాలో అత్యున్నత స్థానిక సంస్థ - జిల్లా పరిషత్.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. (హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు.)
* ప్రస్తుత కొత్త ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌లు 13.

 

జిల్లా పరిషత్ నిర్మాణం:

* ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి రహస్య ఓటింగ్ పద్ధతిలో ప్రత్యక్షంగా ఓటర్లు ఎన్నుకున్న సభ్యులు (జడ్పీటీసీలు).
* జిల్లా పరిధిలోని నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర శాసనసభ సభ్యులు.
* జిల్లా పరిధిలోని నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ సభ్యులు.
* జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు.
*జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు కో ఆప్ట్ సభ్యులు.

 

ఎన్నికలు

* సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడం కోసం జిల్లాలోని మండలాలన్నింటిని నియోజక వర్గాల కింద భావిస్తారు.
* ఒక నియోజక వర్గం నుంచి ఒక సభ్యుడిని రహస్య ఓటింగ్ పద్ధతిలో ఓటర్లు ఎన్నుకుంటారు.
* పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు.

 

రిజర్వేషన్లు

* ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయిస్తారు.
* బీసీలకు మూడో వంతు.
* మహిళలకు మూడో వంతు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50% సీట్లు.)

 

ఛైర్మన్, వైస్ ఛైర్మన్:

* ప్రతి జిల్లా పరిషత్‌కు ఒక ఛైర్మన్, ఒక వైస్‌ఛైర్మన్ ఉంటారు.
* గతంలో జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం పరోక్ష పద్ధతిలో జిల్లాపరిషత్ సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకుంటున్నారు.
* జిల్లా పరిషత్ తొలి సమావేశంలోనే ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను సభ్యులు ఎన్నుకుంటారు.
* వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.

 

స్టాండింగ్ కమిటీలు:

* జిల్లా పరిషత్‌కు 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి.

అవి:

     1. ప్రణాళిక, ఆర్థిక స్టాండింగ్ కమిటీ
     2. గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ
     3. వ్యవసాయ స్టాండింగ్ కమిటీ
     4. విద్య, వైద్య సేవల స్టాండింగ్ కమిటీ
     5. స్త్రీ సంక్షేమ స్టాండింగ్ కమిటీ
     6. సాంఘిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ
     7. పనుల స్టాండింగ్ కమిటీ
* ప్రతి కమిటీలో ఛైర్మన్ పదవిరీత్యా సభ్యుడిగా ఉంటారు.
* ఇతర సభ్యులను ఛైర్మన్ నామినేట్ చేస్తారు.
* అన్ని స్టాండింగ్ కమిటీల సమావేశాలకు జిల్లా కలెక్టరు హాజరు కావచ్చు. కానీ అతడికి ఓటు హక్కు ఉండదు.

 

శాశ్వత ఆహ్వానితులు

* జిల్లా పరిషత్ సమావేశాలకు ఓటు హక్కు లేకుండా కిందివారు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.
1. జిల్లా కలెక్టరు (ఇతడు స్థాయి సంఘాల సమావేశాలకు కూడా శాశ్వత ఆహ్వానితుడు)
2. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
3. జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్
4. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్
5. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు

 

ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)

* ఇతడు జిల్లా పరిషత్ పరిపాలనను నిర్వహిస్తాడు.
* ఇతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.
* ఇతడు అధికార విధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా పరిషత్‌కు బాధ్యత వహిస్తాడు.
* జిల్లా పరిషత్ సిబ్బందిపై పరిపాలనా పరమైన అజమాయిషీ కలిగి ఉంటాడు.
* జిల్లా పరిషత్ సమావేశ అజెండాను, వార్షిక బడ్జెట్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాడు.
* జిల్లా పరిషత్, జిల్లా మహాసభ, స్థాయి సంఘాలు తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాడు.

 

జిల్లా పరిషత్ విధులు:

* జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ల బడ్జెట్‌లను పరిశీలించి ఆమోదించడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిన నిధులను జిల్లాలోని మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం.
* జిల్లాలోని మండలాలు సిద్ధం చేసిన ప్రణాళికలను సమన్వయపరిచి జిల్లా ప్రణాళికను రూపొందించడం.
* మండల పరిషత్‌ల కార్యకలాపాలను పర్యవేక్షించడం.
* సెకండరీ, వృత్తి విద్య, పారిశ్రామిక పాఠశాలను ఏర్పాటు చేసి నిర్వహించడం.
* జిల్లా పరిషత్ ఆర్థిక వనరులు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు.
* అఖిల భారత సంస్థల నుంచి వచ్చే గ్రాంట్లు.
* భూమి శిస్తు, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల నుంచి వచ్చే వాటా.
* జిల్లా పరిషత్ విధించి వసూలు చేసే పన్నులు.
* దాతలు ఇచ్చే విరాళాలు, మండల పరిషత్‌లు, ప్రజలు ఇచ్చే విరాళాలు.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌