• facebook
  • whatsapp
  • telegram

గిరిజన గ్రామ పంచాయతీ వ్యవస్థ  

1. కిందివాటిలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన తెగ?
ఎ) గోండ్లు        బి) కోయలు        సి) యానాదులు, సవరలు        డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

2. కిందివాటిలో గిరిజన తెగ లక్షణం?
ఎ) సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు
బి) ధనిక, పేద తారతమ్యాలు ఉండవు
సి) పండిన పంటను అందరూ సమష్టిగా పంచుకుంటారు
డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

3. గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసేవారిని ఏమంటారు?
జ: ఆంత్రోపాలజిస్టులు

 

4. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలను 1940వ దశకంలో అధ్యయనం చేసినవారు?
జ: ప్యూరర్ హైమన్ డార్ఫ్

 

5. తెలుగు రాష్ట్రాల్లోని ఏ గిరిజన తెగలను హైమన్‌డార్ఫ్ అధ్యయనం చేశారు?
ఎ) చెంచులు        బి) కొండరెడ్లు        సి) గోండ్లు        డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

6. ప్యూరర్ హైమన్‌డార్ఫ్ భారత్‌లోని తెలుగు రాష్ట్రాలతోపాటు ఏ ప్రాంత గిరిజనులను అధ్యయనం చేశారు?
జ: ఈశాన్య రాష్ట్రాలు

 

7. గోండు తెగల పంచాయతీని ఏమంటారు?
జ: పంచ్

 

8. గోండుల గ్రామపెద్దను ఏమంటారు?
జ: పట్లా పాట్లల్

 

9. తెలంగాణలోని ఏ జిల్లాలో గోండుల పంచాయతీ వివరాలను హైమన్‌డార్ఫ్ వివరించారు?
జ: ఆదిలాబాద్

 

10. గోండు తెగల పంచాయతీ సమావేశాలు సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి?
జ: ఎప్పుడు అవసరమైతే అప్పుడు

 

11. గోండు పంచాయతీల్లో మాట్లాడే అవకాశం లేనివారు?
జ: స్త్రీలు

 

12. గోండు పంచాయతీ అధికారం ఏమిటి?
ఎ) పండగ తేదీలను నిర్ణయించడం
బి) వివాహం, విడాకులు మొదలైన తగాదాలను పరిష్కరించడం
సి) కర్మకాండలకు సంబంధించిన విధివిధానాల ఖరారు
డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

13. కిందివాటిలో గోండుల గ్రామపెద్దకు సంబంధించిన అంశాలు?
ఎ) గోండుల గ్రామపెద్దను 'పట్లా పాట్లల్' అంటారు.
బి) ఈ పదవి వారసత్వంగా లభిస్తుంది
సి) గ్రామపెద్ద ప్రతిరోజూ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

14. గోండుల గ్రామ పెద్ద పొలంలో గ్రామస్థులందరూ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉచితంగా పని చేయాల్సి ఉంటుంది?
జ: 1

 

15. హైమన్ డార్ఫ్ ప్రకారం గోండుల ఆచార వ్యవహారాల్లో మార్పులకు కారణం?
ఎ) పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం
బి) తెలుగు, మరాఠావారు ఆ ప్రాంతాలకు వెళ్లడం
సి) గోండులు తమ వివాదాల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించడం
డి) అన్నీ
జ: డి(అన్నీ)

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌