• facebook
  • whatsapp
  • telegram

దైర్ఘ్యమానం

1. స్క్రూగేజి కనీసపు కొలత ఎంత?

జ: 0.01 మి.మీ.
 

2. ఒక మరసీలపై 1 సెం.మీ దూరంలో 10 గాడులున్నాయి. దాని మరభ్రమణాంతరం-

జ: 1 మి.మీ.
 

3. ఒక స్క్రూగేజి తల 20 పూర్తి భ్రమణాలు చేసినప్పుడు మరసీల కదలిన దూరం 10 మి.మీ. అయితే మరభ్రమణాంతరం ఎంత?

జ: 0.5 మి.మీ.
 

4. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.2 సెం.మీ. మరసీలపై ఉన్న గాడుల సంఖ్య-

జ: 5/సెం.మీ.
 

5. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. మరసీలపై 1 సెం.మీ. దూరంలో ఉన్న గాడుల సంఖ్య-

జ:  10
 

6. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని తలస్కేల్‌పై 100 విభాగాలున్నాయి అయితే మరభ్రమణాంతరం-

జ:  2 మి.మీ.

7. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని మర భ్రమణాంతరం 1 మి.మీ అయితే తలస్కేలుపై ఉన్న విభాగాల సంఖ్య-

జ: 50
 

8. ఒక స్క్రూగేజి కనీసపు కొలత 0.02 మి.మీ., దాని తలస్కేలుపై 50 విభాగాలున్నప్పుడు దాని మరభ్రమణాంతరం-

జ: 1 మి.మీ.
 

9. ఒక స్క్రూగేజి తల 5 పూర్తి భ్రమణాలు చేసింది. దాని మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. అయితే మర కదిలిన దూరంఎంత?

జ: 5 మి.మీ.
 

10. ఒక స్క్రూగేజి మరభ్రమణాంతరం 0.1 సెం.మీ. ఎప్పుడవుతుందంటే మరసీల కదలిన దూరం 5 మి.మీ., దాని తల -

జ: 5 పూర్తి భ్రమణాలు చేసినప్పుడు
 

11. పిచ్ స్కేలుపై ఒక సెం.మీ.కు 20 విభాగాలున్నాయి. తలస్కేలుపై 50 విభాగాలున్నాయి. అయితే మరభ్రమణాంతరం ఎంత?

జ: 0.5 మి.మీ.
 

12. తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు దిగువన ఉంటే, పరికరం శూన్యాంశ దోషం, సవరణలు వరసగా-

జ: ధనాత్మకం, రుణాత్మకం

13. తలస్కేలు శూన్యవిభాగం సూచీరేఖకు ఎగువన ఉన్న, పరికరం శూన్యాంశదోషం, సవరణ వరసగా-

జ: రుణాత్మకం, ధనాత్మకం
 

14. సూచీరేఖపై ఉన్న స్కేలును ఏమంటారు?
జ: పిచ్ స్కేలు లేదా ప్రధాన స్కేలు

 

15. ఒక పరికరాన్ని ఉపయోగించి కచ్చితంగా కొలవదగిన అతిచిన్న కొలతను ఏమంటారు?
జ: ఆ పరికరం కనీసపు కొలత

 

16. ఒక పలక మందం లేదా ఒక తీగ వ్యాసం ఎంత?
జ: P.S.R. + C.H.S.R × L.C.

 

17. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 100 విభాగాలున్నాయి. తలను 4 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే మరభ్రమణాంతరం -
జ: 0.5 మి.మీ.

 

18. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 100 విభాగాలున్నాయి. తలను 4 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం కనీసపు కొలత ఎంత?
జ: 0.005 మి.మీ.

19. ఒక స్క్రూగేజి తల స్కేలు మీద 50 విభాగాలున్నాయి. తలను 2 సార్లు పూర్తి భ్రమణం చేయించినప్పుడు మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం కనీసపు కొలత ఎంత?
జ: 0.02 మి.మీ.

 

20. ఒక స్క్రూగేజి తలస్కేలు మీద 50 విభాగాలున్నాయి. తలను 2 సార్లు పూర్తి భ్రమణం చేయిస్తే మరసీల 2 మి.మీ. దూరం కదిలింది. అయితే పరికరం మరభ్రమణాంతరం -
జ: 1 మి.మీ.

 

21. ఒక స్క్రూగేజి ధనశూన్యాంశ దోషం 5 విభాగాలు. దాని తలస్కేలు కొలత 67 అయితే సవరించిన తలస్కేలు కొలత ఎంత?
జ: 62 విభాగాలు

 

22. ఒక స్క్రూగేజి రుణశూన్యాంశదోషం 5 విభాగాలు. దాని తలస్కేలు కొలత 76 అయితే సవరించిన తలస్కేలు కొలత ఎంత?
జ: 81

 

23. ఒక స్క్రూగేజి పిచ్‌స్కేలు మీద ఒక సెం.మీ. దూరంలో 10 విభాగాలున్నాయి. తలస్కేలుపై 100 విభాగాలున్నాయి. అయితే మరభ్రమణాంతరం
జ: 1 మి.మీ.

Posted Date : 04-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌