• facebook
  • whatsapp
  • telegram

మొక్కలు, జంతువుల్లో సూక్ష్మజీవ సంబంధ వ్యాధులు

వ్యాధిని కలుగజేసే జీవులను వ్యాధి జనకాలు అంటారు.

ఉదా: బ్యాక్టీరియాలు, వైరస్‌లు, శిలీంద్రాలు, ప్రోటోజోవన్‌లు.

వ్యాధి వ్యాప్తి: ఒక వ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాధి సంక్రమించడం.

వాహకాలు: వ్యాధి కారకాలను వ్యాప్తిజేసే వాటిని 'వాహకాలు అంటారు.

ఆశ్రయాలు (రిజర్వాయర్‌లు): వ్యాధి జనకాలను చాలాకాలం మోసుకుని పోతున్నప్పటికీ వాటి ప్రభావానికి గురికాని జంతువులను 'ఆశ్రయాలు అంటారు.

ఉదా: మలేరియా వ్యాధిలో - దోమ: మెదడువాపు వ్యాధిలో - పందులు

వ్యాధి శాస్త్రం (పాథాలజీ): వ్యాధి పరిస్థితులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.

వృక్షవ్యాధి శాస్త్రం (ఫైటో పాథాలజీ): మొక్కల్లో వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.

మొక్కల్లో వచ్చే వ్యాధులు 

I. వరి - బ్లైట్ తెగులు
వ్యాధి జనకం: ఇది ఒకరకం 'బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది.

*¤ జులై నుంచి అక్టోబరు నెలల మధ్య అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల్లో ఈ తెగులు కనిపిస్తుంది.

వ్యాధి లక్షణం: వ్యాధిసోకిన పత్రాలలో పొడవైన 'పసుపు లేదా గడ్డి రంగు గీతలు అంచుల దగ్గర వంకరగా ఏర్పడతాయి. వ్యాధి తీవ్రతలో పత్రాల కొన నుంచి కిందివైపునకు ఎండిపోయిన పంట కాలినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎండు తెగులు అంటారు.

వ్యాధి వ్యాప్తి: వ్యాధిసోకిన పత్రాల నుంచి ఆరోగ్యకరమైన పత్రాలకు నీటి బిందువులు, ప్రత్యక్ష తాకిడి, వ్యాధిగ్రస్తమైన విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది.

నివారణ: వ్యాధిసోకిన విత్తనాలను పొలంలో నాటే ముందు రసాయనాలు లేదా వేడినీటితో శుద్ధిచేయాలి. 

      * వ్యాధి నిరోధక వరి వంగడాలను లేదా తెగులు తట్టుకునే రకాలను ఉపయోగించాలి.
 

II. అగ్గితెగులు: వరి పంటలో కనిపిస్తుంది.

     వ్యాధిజనకం: శిలీంద్రం

వ్యాధిలక్షణాలు: పత్రాలపై 'అండాకార మచ్చలు (మధ్యలో లేతపసుపు వర్ణం దానిచుట్టూ గోధుమ రంగు అంచు) కాండం, పత్రాలు, గింజలపై శిలీంద్రపు తెల్లటి బూజు కనిపిస్తుంది. వ్యాధిసోకిన భాగంలోని కణాలు నశించి గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. వ్యాధిసోకిన పత్రాలు, గింజల కిందిభాగం రాలిపోవడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది.

వ్యాధి వ్యాప్తి: ఈ శిలీంద్రం 'కొనిడియా అనే స్పోరులను ఉత్పత్తిచేసి గాలిద్వారా వ్యాప్తిచెందుతుంది.

నివారణ: పొలాల పరిశుభ్రత, విత్తనశుద్ధి, శిలీంద్రనాశకాల పిచికారి, వ్యాధి నిరోధక వంగడాలను వాడటం లాంటి చర్యలు చేపట్టాలి.

III. కుంకుమ తెగులు: ఇది గోధుమ పంటలో కనిపిస్తుంది.

వ్యాధి జనకం: శిలీంద్రం

వ్యాధి లక్షణం: పత్రాలు, కాండంమీద గోధుమ రంగుగాని తుప్పురంగు మచ్చలుగాని ఏర్పడతాయి.

నివారణ: కుంకుమ తెగులును తట్టుకునే గోధుమ వంగడాలను వాడి దీన్ని నివారించవచ్చు.
 

IV. ఎర్రకుళ్లు తెగులు: ఇది చెరకు పంటలో కనిపించే వ్యాధి.

వ్యాధి జనకం: శిలీంద్రం.

వ్యాధి లక్షణం: వ్యాధి లక్షణాలు పత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చెరకుగడ లోపలి భాగం ఎర్రగా మారుతుంది.

నివారణ: వ్యాధి సోకిన మొక్కలను తర్వాత పంటకు ఉపయోగించకపోవడం. వ్యాధి సోకిన వాటిని పంట పొలాలకు దూరంగా తీసుకుపోయి కాల్చివేయాలి.

* వ్యాధి నిరోధక వంగడాలను ఉపయోగించడం.
 

టిక్కా తెగులు: వేరుశెనగ పంటలో సామాన్యంగా వచ్చే వ్యాధి. దీన్నే 'ఆకుమచ్చ తెగులు అని కూడా అంటారు వ్యాధి

లక్షణం: వ్యాధి సోకిన పత్రాలపై గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి.

వ్యాధి వ్యాప్తి: ఈ శిలీంద్రం 'కొనిడియాలు అనే నిర్మాణాల వల్ల వ్యాప్తి చెందుతుంది. మొక్కల్లో వ్యాధుల నియంత్రణకు ఉత్తమ పద్ధతి వ్యాధి నిరోధక వంగడాలను వాడటం.

మొక్కల్లో వైరస్‌ల వల్ల కలిగే వ్యాధుల లక్షణాలు

*¤ వైరస్‌ల వల్ల పంట మొక్కల్లో కలిగేవన్నీ అంటువ్యాధులే.

*¤ వైరస్‌ల వల్ల మొక్కల పెరుగుదల లోపించి, పంట దిగుబడి తగ్గుతుంది.

*¤ పత్రాల్లోని పత్రహరితంలో ఏకరీతి అమరిక ఉండదు.

*¤ ఆకుల మీద ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగు మచ్చలు ఒక క్రమం లేకుండా 'మొజాయిక్ నేల మాదిరిగా కనిపిస్తాయి.

*¤ వ్యాధి సోకిన పత్రాలు వంకర తిరిగి, ముడుచుకుపోతాయి.

*¤ వైరస్ సోకిన ట్యులిప్ పుష్పాల్లో అందమైన రంగులు కనిపిస్తాయి

¤* వ్యాధి సోకిన పత్రాలు, ఫలాల కణజాలం మరణించి మచ్చలుగా కనిపిస్తుంది. దీన్ని 'క్షయకణజాలం లేదా నెక్రోసిస్' అంటారు.
 

చిన్నపిల్లల్లో కనిపించే వైరస్ వ్యాధులు

అంటువ్యాధి: ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే వ్యాధి.
 

మహమ్మారి వ్యాధి: ఒక ప్రదేశంలో వేగంగా వ్యాప్తిచెందే వ్యాధి
 

పొదిగే కాలం (ఇంక్యుబేషన్): వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించి, వ్యాధి లక్షణాలు కనిపించే వరకు మధ్య ఉన్న కాలాన్ని 'పొదిగే కాలం అంటారు. ఈ కాలంలో వ్యాధి జనకాల సంఖ్య అధికం. అవి ప్రత్యేకించిన కణజాలంలోకి చేరతాయి.

6. మెదడువాపు వ్యాధి/ ఎన్సెఫలైటిస్ : 'ఆర్బోవైరస్ వల్ల కలుగుతుంది 'క్యూలెక్స్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి ఈ వ్యాధి వల్ల 'కేంద్ర నాడీ మండలం (మెదడు) దెబ్బతిని ఫిట్స్ వస్తుంది. పశువులు, పందులు, కోళ్లు ఈ వ్యాధికి ప్రధాన సకశేరుక ఆతిథేయులు
 

7. మశూచి (స్మాల్ పాక్స్) - వరియొల వైరస్: వ్యాధి లక్షణం: శరీరం మీద చిన్నచిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారడం.
 

8. ఎయిడ్స్ - హెచ్ఐవీ వైరస్: - మానవుడి రోగ నిరోధక వ్యవస్థ నశిస్తుంది.
 

9. డెంగ్యూ: ఆర్బోవైరస్ - ఇది 'ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వల్ల రక్తంలో 'రక్త ఫలకికల/ ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
 

10. రేబిస్/ హైడ్రోఫోబియా: రాబ్డో వైరస్ - కుక్కకాటు వల్ల వస్తుంది
 

11. చికున్ గున్యా: అల్ఫావైరస్ - ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది. చికున్ గున్యా అంటే స్వాహిలి భాషలో 'వంగి నడవడం అని అర్థం.
వైరస్ వ్యాధులు కొబ్బరి - వేరువిల్టు చీని/బత్తాయి - ట్రిస్టిజ వేరుశెనగ - మొవ్వకుళ్లు తెగులు మిరప - వెర్రితల తెగులు పొగాకు - మొజాయిక్ తెగులు బ్యాక్టీరియా వ్యాధులు వరి - ఎండుతెగులు నిమ్మ - గజ్జితెగులు మిరప - ఆకుమచ్చ తెగులు క్యాబేజి - నల్లకుళ్లు తెగులు శిలీంద్ర వ్యాధులు వరి - అగ్గితెగులు గోధుమ - కుంకుమ తెగులు చెరకు - ఎర్రకుళ్లు తెగులు వేరుశెనగ - తిక్కా తెగులు

1. తట్టు (పొంగు/ మీజిల్స్): ఈ వ్యాధిని 'రూబియోలా అని కూడా అంటారు. ఈ వ్యాధి 'పారామిక్సో వైరస్ వల్ల వ్యాపిస్తుంది.
 

వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన పిల్లల శరీరంపై తట్టు, జ్వరం, వెలుతురు చూడలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
 

వ్యాధి వ్యాప్తి: ప్రత్యక్ష తాకిడి (స్పర్శ) ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కిక్కిరిసిన తరగతి గదుల్లో త్వరగా వ్యాపిస్తుంది.
 

2. ఆటలమ్మ (చికెన్ పాక్స్): ఇది 'వరిసెల్లా వైరస్ వల్ల కలుగుతుంది. ఇది పది సంవత్సరాల్లోపు పిల్లలకు సోకే సామాన్యమైన అంటువ్యాధి.
 

వ్యాధి లక్షణాలు: శరీరంపై దద్దుర్లు, పొక్కులు ఏర్పడి జ్వరం రావడం.
 

వ్యాధి వ్యాప్తి: ప్రత్యక్ష తాకిడి ద్వారా ఇది వ్యాపిస్తుంది.
 

నివారణ : రోగి శరీరంపై బొబ్బలు/ పొక్కులు తగ్గేవరకు వేరే గదిలో ఉంచడం.
* వ్యాధి సోకినవారు వాడిన వస్త్రాలు, వస్తువులను ఎవరూ వాడకపోవడం.
*¤ పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడం లాంటి చర్యల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.

 

3. గవద బిళ్లలు (మంప్స్): ఇది '5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు సోకుతుంది.
* ఈ వ్యాధి 'మిక్సోవైరస్ పెరోటైడిస్ అనే ళివితి వైరస్ వల్ల కలుగుతుంది.

వ్యాధి లక్షణాలు: దవడలకు రెండు పక్కలా (చెవి యందు) ఉండే 'లాలాజల గ్రంథులు (ఉమ్మినీటి/ పెరోటిడ్) వాపు వల్ల నొప్పి రావడం. నోరు తెరచినప్పుడు నొప్పి, చెవినొప్పి, జ్వరం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధి వ్యాప్తి: ప్రత్యక్ష తాకిడి ద్వారా,
* రోగి ఉమ్మినీటి బిందువుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి వ్యాప్తిని అరికట్టడం/ నివారణ: ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు. కానీ టీకా మందు తీసుకోవడం, రోగ లక్షణాలు తగ్గే వరకు రోగిని ప్రత్యేకంగా ఉంచడం, రోగి వాడే వస్తువులను రోగక్రిములు లేకుండా చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.

4. పోలియో: ఈ వ్యాధిని 'శిశు పక్షవాతం అని కూడా అంటారు.
*¤ ఇది 'ఎంటిరోవైరస్/ పోలియో వైరస్ (చిన్నపిల్లల్లో రోటావైరస్) వల్ల కలుగుతుంది.
*¤ ఇది 'నాడీ మండలంపై ప్రభావం చూపుతుంది - అవయవాల్లోని కండరాల సైజు తగ్గి 'కండరాల పక్షవాతం వస్తుంది

 

వ్యాధి వ్యాప్తి: కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
*¤ వ్యాధి సంక్రమించిన పిల్లలు ఆధారం లేకుండా సరిగా నడవలేరు.
* వ్యాధికి గురైన అవయవాల పరిమాణం తగ్గి సన్నగా మారి సరిగా పనిచేయవు.
నివారణ: చిన్న వయసులోనే నోటి ద్వారా పోలియో చుక్కల మందు ఇవ్వడంవల్ల ఈ వ్యాధి రాకుండా అదుపు చేయవచ్చు.

 

5. జలుబు/ రొంప/ సర్ఫి: ఇది 'రినో వైరస్ వల్ల కలుగుతుంది. 'గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది
వ్యాధి లక్షణాలు: ముక్కు, కంటి నుంచి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం.

మరికొన్ని వైరస్ వ్యాధులు

6. మెదడువాపు వ్యాధి/ ఎనసెఫలైటిస్ : 'ఆర్బోవైరస్ వల్ల కలుగుతుంది 'క్యూలెక్స్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి ఈ వ్యాధి వల్ల 'కేంద్ర నాడీ మండలం (మెదడు) దెబ్బతిని ఫిట్స్ వస్తాయి. పశువులు, పందులు, కోళ్లు ఈ వ్యాధికి ప్రధాన సకశేరుక ఆతిథేయులు

7. మశూచి (స్మాల్ పాక్స్) - వరియొల వైరస్: వ్యాధి లక్షణం: శరీరం మీద చిన్నచిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారడం.
 

8. ఎయిడ్స్ - హెచ్ఐవీ వైరస్: - మానవుడి రోగ నిరోధక వ్యవస్థ నశిస్తుంది.
 

9. డెంగ్యూ: ఆర్బోవైరస్ - ఇది 'ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వల్ల రక్తంలో 'రక్త ఫలకికలు/ ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
 

10. రేబిస్/ హైడ్రోఫోబియా: రాబ్డో వైరస్ - కుక్కకాటు వల్ల వస్తుంది
 

11. చికున్ గున్యా: అల్ఫావైరస్ - ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది. చికున్ గున్యా అంటే స్వాహిలి భాషలో 'వంగి నడవడం అని అర్థం.
వైరస్ వ్యాధులు కొబ్బరి - వేరువిల్టు చీని/బత్తాయి - ట్రిస్టిజ వేరుశెనగ - మొవ్వకుళ్లు తెగులు మిరప - వెర్రితల తెగులు పొగాకు - మొజాయిక్ తెగులు బ్యాక్టీరియా వ్యాధులు వరి - ఎండుతెగులు నిమ్మ - గజ్జితెగులు మిరప - ఆకుమచ్చ తెగులు క్యాబేజి - నల్లకుళ్లు తెగులు శిలీంద్ర వ్యాధులు వరి - అగ్గితెగులు గోధుమ - కుంకుమ తెగులు చెరకు - ఎర్రకుళ్లు తెగులు వేరుశెనగ - తిక్కా తెగులు

Posted Date : 06-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌