• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషా బోధన - లక్ష్యాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. 'మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి యుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతంచేసే సాధనం విద్య' అని నిర్వచించిన వారెవరు?

జ: గాంధీజీ
 

2. ముందుగా నిర్ణయించి, విద్యార్థుల్లో బోధన ద్వారా తీసుకు రాగలిగే, పరిశీలించగలిగే, కొలవగలిగే ప్రవర్తనా పరివర్తన ఏది?

జ: విద్యా లక్ష్యం
 

3. 'స్పెసిమన్ ఆబ్జెక్టివ్ టెస్ట్' గ్రంథ రచయిత ఎవరు?

జ: గి బెరిచ్
 

4. భావావేశ రంగంపై విశేషంగా కృషిచేసిన వారెవరు?

జ: ఆర్. క్రాత్‌వాల్
 

5. సాహితీవేత్తల అభిప్రాయం ప్రకారం నాతి సులభం, నాతి కఠినం అయిన రచనలు దేనికి చెందుతాయి?

జ:  ద్రాక్ష పాకం
 

6. 'తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం బెన్న...' అనే పద్యంలోని ధ్వన్యర్థాన్ని విద్యార్థి వివరించి చెప్పాడు. ఇందులో ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: రసానుభూతి

7. ఒక పదానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది ఏది?

జ: వ్యుత్పత్యర్థం
 

8. వాక్యరూపంలోని సాధారణీకరణాలేవి?

జ: సామెతలు
 

9. విద్యా ప్రణాళికల రూపకల్పనకు ఉపకరించేవి-

జ: గమ్యాలు
 

10. మూర్త సన్నివేశంలో జరిగే 'గుర్తించడం' అనే భావన ఏ లక్ష్యానికి స్పష్టీకరణ?

 జ: జ్ఞానం
 

11. 'సంగీతమంతా సరిగమపదని స్వరాల్లో ఇమిడి ఉన్నట్టే, సాహిత్యం కూడా కొన్ని వర్ణాల సముదాయంలో ఇమిడి ఉంది' అని సాహిత్య స్వభావం గురించి పేర్కొన్న కవి ఎవరు?

జ: మాఘుడు
 

12. 'లక్ష్యాలు- సృష్టీకరణాలు' ఎవరికి సంబంధించినవి?

జ: ఉపాధ్యాయుడు, విద్యార్థి
 

13. 'విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన రేకెత్తించేది విద్య' అని నిర్వచించిందెవరు?

జ: జిడ్డు కృష్ణమూర్తి
 

14. బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్‌లో వివరించిన ప్రసిద్ధ విద్యావేత్త ఎవరు?

జ: బెంజిమన్ బ్లూమ్
 

15. విద్యార్థులకు ఉపాధ్యాయుడు కొన్ని పదాలను ఇచ్చి, వాటిని ఒకే లక్షణం ఉన్న సమూహాలుగా వర్గీకరించాలని చెప్పాడు. ఇది ఏ లక్ష్యం పరిధిలోకి వస్తుంది?

జ: అవగాహన
 

16. 'మనసును ఒకదానివైపు ఆకర్షింపజేసేది అభిరుచి'- అని నిర్వచించింది ఎవరు?

జ:  రాస్
 

17. విద్యార్థి 'మతిహీనుడు' పాఠం ద్వారా 'అయోగ్యుడికి అన్నీ ఇవ్వరాదు' అనే నీతిని గ్రహించాడు. అయితే విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: సంస్కృతీ సంప్రదాయాలు
 

18. 'ప్రౌఢి పరికింప సంస్కృత భాష యండ్రు, పలుకు నుడికారమున నాంధ్ర భాషయండ్రు' అన్న కవి ఎవరు?

జ: శ్రీనాథుడు
 

19. గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, సృష్టీకరణలను నిర్వచించిన 'మ్యాన్యువల్ ఫర్ స్కూల్ లెవల్ సెమినార్‌ను' ప్రచురించింది-

జ: ఎస్‌సీఈఆర్‌టీ
 

20. 'పూర్వ గాథా పరిచయం' జ్ఞాన లక్ష్యంలో ఏ విభాగానికి చెందింది?

జ: విషయ జ్ఞానం
 

21. 'సన్నిహిత సంబంధం ఉన్న అంశాల సామ్య భేదాలను కనుగొంటాడు' - అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?

జ: అవగాహన
 

22. ఏదైనా ఒకవిషయంపై 'ఒకే వ్యాఖ్య' చేయడానికి దోహదం చేసేవేవి?

జ: సంవృత లక్ష్యం
 

23. తెలుగు భాషలోని బోధనా లక్ష్యాలెన్ని?

జ: 10
 

24. గంభీర భావాలను వివేచించడం ఏ లక్ష్యానికి స్పష్టీకరణ?

జ: అవగాహన
 

25. హావభావాలను ప్రదర్శించడం ఏ రంగానికి చెందింది?

జ: మానసిక చలనాత్మక రంగం
 

26. శ్రీకృష్ణదేవరాయల 'ఆముక్తమాల్యద' దేనికి ఉదాహరణ?

జ: నారికేళపాకం
 

27. విద్యార్థి 'బొండు మల్లెలు' పాఠంలోని 'వంకాయలమ్మే మనిషి' పాత్ర ఔచిత్యాన్ని వివరించి చెప్పాడు. అయితే విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించాడు?

జ: రసానుభూతి
 

28. రసానుభూతి అనేది-

జ: హృదయగతమైంది
 

29. శ్రీకృష్ణలీలలు అనే పాఠాన్ని విద్యార్థి 'సంభాషణ' ప్రక్రియలోకి మార్చాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: సృజనాత్మకత

30. 'అవబోధం' అని ఏ లక్ష్యానికి పేరు?

జ: అవగాహన
 

31. విద్యార్థి సవర్ణదీర్ఘ సంధి, అత్వసంధి మధ్య ఉన్న పోలికలను చెప్పగలిగాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?

జ: అవగాహన
 

32. ఒక విద్యార్థి వేమన పద్యాలను సేకరించి చదివాడు ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: భాషాభిరుచి
 

33.  జ్ఞాన,  భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో సరైన మూల్యాంకన సాధనాలు లేని రంగం ఏది?

జ: భావావేశ రంగం
 

34. 'కొండంత భావనను ముత్యమంత పదంలో ఇమిడ్చి చెప్పే' స్వభావం ఉన్నవేవి?

జ: జాతీయాలు
 

35. 'రాజు మరణించె నొక తార రాలిపోయె కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు'- పద్యానికి విద్యార్థి 'రాజు-సుకవి' అనే శీర్షికను సూచించాడు. అయితే విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: సృజనాత్మకత
 

36. 'పిల్ల కాకికేం తెలుస్తుంది ఉండేలు దెబ్బ' అనేది-

జ: సామెత
 

37. 'విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు'. ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది?

జ: అవగాహన
 

38. 'నిదానమే ప్రదానం' అనే వాక్యంలోని దోషాన్ని గుర్తించి 'నిదానమే ప్రధానం' అని సరిచేశాడు. ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యం-

జ: అవగాహన

Posted Date : 01-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌