• facebook
  • whatsapp
  • telegram

పద్య, గద్య బోధన

నమూనా ప్రశ్నలు

1. పద్య బోధన లక్ష్యం ఏమిటి?

జ: రసానుభూతి
 

2. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని 'ఏకాంశం'గా భావించి బోధించే పద్ధతి ఏది?

జ: పూర్ణ పద్ధతి
 

3. విద్యార్థికి 'భాషా జ్ఞానం' ఏ బోధన వల్ల కలుగుతుంది?

జ: గద్య బోధన
 

4. గద్య బోధనలో వ్యాకరణాంశాలను పరిచయం చేసే సందర్భం ఏది?

జ: విద్యార్థుల మౌన పఠనానికి ముందు
 

5. గద్య వాజ్ఞ్మయానికి ఆద్యునిగా ఎవరిని పేర్కొంటారు? (ఈయన 'సింహగిరి వచనములు' రచయిత).

జ: కృష్ణమాచార్యులు
 

6. పద్య బోధనలో తప్పనిసరై, గద్య బోధనలో అంతగా అవసరంలేని ఉప సోపానాలు ఏవి?

జ: స్థూలార్థ సంగ్రహణం, ఉపాధ్యాయుని పునఃపఠనం
 

7. పద్య బోధనలో విద్యార్థుల నుంచి రాబట్టడానికి వీల్లేని ధ్వని, రచనా చమత్కృతి, రసపోషణ, అలంకార వైశిష్ట్యం, ప్రతిభ, పదప్రయోగ ఔచిత్యం, నిగూఢ అంశాలను తెలియపరచి వారు అందులో లీనమయ్యేటట్లు చేసే పద్ధతిని ఏమంటారు?

జ: ప్రశంసా పద్ధతి
 

8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలే కవిత్వం - అన్న లాక్షణికుడు ఎవరు?

జ: జగన్నాథ పండితరాయలు
 

9. మనస్తత్వ శాస్త్రానికి విరుద్ధమైన గద్య బోధన పద్ధతి?

జ: ప్రవచన పద్ధతి
 

10. పద్య బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సింది?

జ: అన్వయక్రమం
 

11. గద్య పాఠ్య భేదాలు ఎన్ని?

జ: 14
 

12. పద్య బోధన ప్రధాన లక్ష్యం - ఈ లక్ష్యసాధనకు అనుసరణీయమైన బోధనా పద్ధతి?

1) భాషా జ్ఞానం - ప్రవచన పద్ధతి              2) సాహిత్యాభిరుచి - ఖండ పద్ధతి

3) రసానుభూతి - ప్రశంసా పద్ధతి             4) సృజనాత్మకత - పఠన పద్ధతి

జ: రసానుభూతి - ప్రశంసా పద్ధతి
 

13. పద్య బోధనలో వ్యాకరణాంశాల బోధన ఎలా జరిగితే ప్రయోజనకరం?

జ: పద్య స్వరూప స్పష్టత కోసం
 

14. గద్య పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి, సమాస, అర్థ సంగ్రహణ సోపానాల తర్వాత నిర్వహించే సోపానం?

జ: చర్చ
 

15. పాఠ్య బోధన సందర్భంలో సంధులు, సమాసాలు మొదలైన వ్యాకరణాంశాలను పరిచయం చేసే పద్ధతి?

జ: ఉదాహరణ పద్ధతి
 

16. ఉపాధ్యాయుడు ఏ పాఠ బోధన సందర్భంగా స్థూలార్థ సంగ్రహణం చేస్తాడు?

జ: పద్యం
 

17. పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది?

జ: పూర్ణ పద్ధతి
 

18. చర్చా పద్ధతి ఏయే దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది?

జ: మాధ్యమిక, ఉన్నత దశలు
 

19. 'పునఃపఠనం' చేయదగిన పాఠ బోధన సందర్భం?

జ: పద్య బోధన
 

20. గద్య బోధనలో 'చర్చ'ను ప్రవేశపెట్టదగిన సందర్భంఏది?

జ: విద్యార్థుల మౌన పఠనం తర్వాత

21. పద్యం కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగారో తెలుసుకునే సోపానం ఏది?

జ: స్థూలార్థ సంగ్రహణం
 

22. 'వాక్యం రసాత్మకం కావ్యం' అన్న లాక్షణికుడు ఎవరు?

జ: విశ్వనాథుడు
 

23. 'ఒక పద్యంలో ఉద్దిష్టాలయిన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితే గాని, ఆ భావానుభూతిని పొందితేగాని దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలు లేదు' - అని అభిప్రాయపడింది?

జ: ప్రొఫెసర్ ముర్రే
 

24. ఉపాధ్యాయుడు చర్చను ఆరంభించిన తర్వాత సాధారణీకరణం చేయాల్సిన సందర్భం?

జ: చర్చను ముగించే ముందు
 

25. కవుల పట్ల గౌరవ భావాలు ఏ పద్ధతిలో కలుగుతాయి?

జ: ప్రశంసనా పద్ధతి
 

26. కిందివాటిలో ఏది రాయడం కష్టం అంటారు?

1) పద్యం                  2) గద్యం                3) నాటకం                 4) కథ

జ: గద్యం

Posted Date : 29-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌