1. బహుకణ జీవులు సమన్వయం కోసం ఏర్పరచుకున్న వ్యవస్థలు:
జ: వినాళగ్రంథి, నాడీవ్యవస్థలు
2. జీవుల శరీరానికి వెలుపల, లోపల జరిగే మార్పులకు ప్రతిచర్యలను చూపే వ్యవస్థ?
జ: నాడీవ్యవస్థ
3. నాడీవ్యవస్థ శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించడానికి ఏర్పరచుకున్న ప్రత్యేక నిర్మాణాలు?
జ: గ్రాహకాలు
4. జంతువులన్నింటిలో క్లిష్టమైన నిర్మాణం ఉన్న నాడీ మండలం వేటిలో కనిపిస్తుంది?
జ: మానవుడు
5. కిందివాటిలో మానవ నాడీమండలంలో సమాచారాన్ని విశ్లేషించలేనిది, ప్రతిచర్యలను ఉత్పత్తి చేయలేనిది?
జ: మెదడు, వెన్నుపాము, నాడులు
6. ప్రతీకార చర్యలను సమన్వయపరిచే కేంద్రం?
జ: కశేరు నాడీదండం
7. నాడీ మండలంలో వార్తలను విశ్లేషించి, ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే నిర్మాణాలు?
జ: న్యూరాన్లు
8. నాడీకణంలో సంశ్లేషణ చర్యలు జరిగే భాగం?
జ: సైటాన్
9. ఆక్సాన్లోని 'అనాచ్చాదిత ప్రదేశాల'ను ఏమంటారు?
జ: రణ్వీర్ కణుపులు
రచయిత: బాబా ఫక్రుద్ధీన్