• facebook
  • whatsapp
  • telegram

తొలిసారి రాసేవారు...

బ్యాంకు పరీక్షలకు 2 నెలల సమయం ఉంటే ఒక ప్రణాళికతో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ డిసెంబరు 5, 12, 13 తేదీల్లో; మెయిన్స్‌ పరీక్ష జనవరి 24న జరగనున్నాయి. అంటే ప్రిలిమ్స్‌కు కనీసం 3 నెలల సమయం ఉంది. మెయిన్స్‌కు దాదాపుగా 5  నెలల సమయముంది. అందువల్ల మొదటిసారి పరీక్ష రాసేవారూ విజయం సాధించే అవకాశం ఎక్కువే!

ఉమ్మడి సన్నద్ధత
రాత పరీక్ష పట్ల అసలు అవగాహన లేనివారు ముందుగా పరీక్ష విధానం, దానిలోని సబ్జెక్టుల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. అలాగే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రిలిమ్స్‌లోని మూడు సబ్జెక్టులు, మెయిన్స్‌లోనూ ఉంటాయి. వాటికి అదనంగా జనరల్‌/ ఫైనాన్స్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టులుంటాయి. కాబట్టి, ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు కలిపి ఉమ్మడి సన్నద్ధత ఉండాలి. అంశాలపరంగా ఉండే సబ్జెక్టులు అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లే కాబట్టి, వాటిలోని టాపిక్స్‌ అన్నింటినీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఏయే టాపిక్స్‌లో ఎన్నెన్ని ప్రశ్నలు వచ్చాయో వేటిలో ఎక్కువ/ తక్కువ ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది.

దేన్నుంచి ఎన్ని?
రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌/ పజిల్స్‌ నుంచి దాదాపు 15-20 ప్రశ్నలు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో  వస్తున్నాయి. ఇంగ్లిష్‌లో రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌టెస్ట్‌ల నుంచి ఒక్కోదానిలో 5-7 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 10-15, సింప్లిఫికేషన్‌ 5-10, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, నంబర్‌  సిరీస్‌ల నుంచి అయిదేసి ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. ఇలాంటి టాపిక్స్‌ అన్నింటినీ ముందుగా పూర్తి చేసుకోవాలి. ఆపై 1, 2 ప్రశ్నలు వచ్చే టాపిక్‌లను చూసుకోవాలి. దాదాపుగా మొదటి 30-45 రోజుల్లో అన్ని సబ్జెక్టుల్లోని అన్ని అంశాలపట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి. వాటిలోని వివిధ రకాలైన ప్రశ్నలు సాధన చేయాలి.

ఆ మూడూ ఉంటే..
బ్యాంకు పరీక్షల్లో వేగం, కచ్చితత్వం, నిలకడతనం.. విజయానికి సోపానాలు. పరీక్షల్లో విజయం సాధించడానికి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించడం ముఖ్యం. కాబట్టి, ప్రశ్నలను వేగంగా సాధించేలా ఉండాలి. ఈ క్రమంలో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. ఈ నిలకడతనాన్ని కొనసాగించాలి. పోటీపరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించాల్సి రావడం కనిపిస్తుంటుంది. వీటిల్లో సాధించకుండానే గుర్తించగల ప్రశ్నలుంటుంటాయి. బాగా సాధన చేయడం ద్వారానే ఈ నైపుణ్యం సాధ్యమవుతుంది. అలాగే వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులూ తెలుస్తాయి. ఇవన్నీ పరీక్షలో విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఏమేరకు అలవరచుకున్నారో మోడల్‌ పేపర్స్‌ సాధనలో తెలుసుకోవచ్చు. వీలైనంతవరకూ మోడల్‌ పేపర్స్‌ను అసలు పరీక్ష మాదిరిగానే ఆన్‌లైన్‌లో ప్రయత్నించాలి. పరీక్ష సమయానికి నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగేలా సాధన చేయాలి. ప్రిలిమ్స్‌ వరకూ దాని తరహాలోనే, ఆపై మెయిన్స్‌ను దాని తరహాలోనే మాదిరి పరీక్షలు రాయాలి. సమయాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుని, నిబద్ధతతో సన్నద్ధమైతేనే విజయం సాధ్యమవుతుంది.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌