• facebook
  • whatsapp
  • telegram

ప్రిపరేషన్‌ మెలకువలు

గత సంవత్స రాల్లో జ‌రిగిన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్ష ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఏయే విభాగాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముందో తెలుస్తుంది.
రీజనింగ్‌: స్కేల్‌- I ఆఫీసర్‌ గత ఏడాది ప్రిలిమ్స్‌ పరీక్షలో సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌ టెస్ట్‌ నుంచి దాదాపు 18 ప్రశ్నలు, స్టేట్‌మెంట్‌- కంక్లూజన్‌- 10 ప్రశ్నలు, కోడింగ్‌- డీకోడింగ్‌- 5, డేటా సఫిషియన్సీ- 5 , డైరెక్షన్స్‌- 2 ప్రశ్నలు ఉన్నాయి. మెయిన్స్‌ పరీక్షలో పైవాటికి అదనంగా కాజ్‌-ఎఫెక్ట్, స్టేట్‌మెంట్‌-ఇన్‌ఫరెన్స్, ఆర్గ్యుమెంట్, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, బ్లడ్‌ రిలేషన్స్‌ల నుంచి ప్రశ్నలను గమనించవచ్చు. ఇంచుమించు ఇవే టాపిక్స్‌పై ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలోనూ ప్రశ్నలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో 15-20 ప్రశ్నలు సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌ టెస్ట్‌ల నుంచి ఉంటున్నాయి. ఇతర టాపిక్స్‌ కూడా బాగా ప్రిపేర్‌ అవాలి.

 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి అన్ని పరీక్షలలోనూ ప్రశ్నల సంఖ్యలో తప్ప ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌లో పెద్దగా మార్పు ఉండదు. సింప్లిఫికేషన్స్‌ (అసిస్టెంట్స్‌ పరీక్షలో దాదాపు 15 ప్రశ్నలు దీని నుంచి ఉంటాయి) నంబర్‌ సిరీస్‌ (5), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (5), డేటా సఫిషియన్సీ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (10-15), అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు (10) తప్పనిసరి. ఇవి బాగా సాధించగలగాలి. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వేగంగా సాధించేలా షార్ట్‌కట్‌ పద్ధతులు, సింప్లిఫికేషన్స్‌ వేగంగా చేయడానికి స్పీడ్‌మేథ్స్‌/ వేదగణితం పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటికి చాలా ఎక్కువ సాధన అవసరం.
ఇంగ్లిష్‌: గత ఏడాది స్కేల్‌- I ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (10 ప్రశ్నలు), క్ల్లోజ్‌ టెస్ట్‌ (10), ఫైండింగ్‌ గ్రమాటికల్లీ కరెక్ట్‌ స్టేట్‌మెంట్‌ (5), కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ (5), ఫిల్లిన్‌ ది బ్లాంక్స్‌ (5), రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ (5) ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు ఇదే విధంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలోని ప్రశ్నలు ఉన్నాయి. వీటిని గమనించి సిద్ధమవ్వాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, ఆర్థికాంశాలకు ప్రాధాన్యమిస్తూ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటిపై ప్రిపేర్‌ అవ్వాలి. ముఖ్యాంశాలన్నీ నోట్‌ చేసుకోవాలి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్, జాతీయ/ అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు చూసుకోవాలి.

 

కంప్యూటర్‌ నాలెడ్జ్జ్‌: బ్యాంక్‌ ఉద్యోగులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. దానిని తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి ఎవల్యూషన్‌ ఆఫ్‌ కంప్యూటర్స్, హార్డ్‌వేర్, ఎం.ఎస్‌. ఆఫీస్‌ వర్డ్, ఎక్సెల్, లితివి, జూతివి, వైరస్, యాంటీవైరస్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ రంగంలో వర్తమానాంశాలపై ప్రశ్నలు వస్తాయి. 

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌