• facebook
  • whatsapp
  • telegram

ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. ఇవి పాటించండి!

* అభ్య‌ర్థుల‌కు నిపుణుల జాగ్ర‌త్త‌లు

 

ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు ప్రాథమిక ప్రక్రియ. అప్లై చేయడం కూడా ఒక పనేనా అని కొంతమంది భావిస్తుంటారు. మరికొంతమంది సరైన ప్రిపరేషన్ లేకుండా దరఖాస్తు మొదలుపెట్టి మధ్యలో కంగారు పడుతుంటారు. ఉద్యోగం సాధించుకోడానికి దరఖాస్తు మొదటి అడుగు. అందుకే జాగ్రత్తగా వేయాలి. ఎలాంటి తప్పులు దొర్లినా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవచ్చు. లేదా ఏవైనా చిక్కులు ఎదురుకావచ్చు. అందుకే జాగ్రత్తగా దరఖాస్తు నింపాలి. 

 

 

ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క‌సారి ద‌ర‌ఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తే మ‌ళ్లీ ఎడిట్ చేసుకునే వీలు ఉండ‌దు. అందుకే దరఖాస్తు నింపేటప్పుడే అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. 

 

ముందే సిద్ధం చేసుకోవాలి

సాధారణంగా చాలా వరకు ఆన్ లైన్ దరఖాస్తులకు కొన్ని పత్రాల వంటివి అప్ లోడ్ చేయమని అడుగుతారు. బ్యాంకు ఉద్యోగాల్లో అలాంటివి తప్పనిసరిగా ఉంటాయి. అవేమిటో చూసి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అందులో ఫొటోలు, సంత‌కం, ఎడ‌మ చేతి బొట‌న‌వేలి ముద్రలు, అభ్యర్థి స్వ‌యంగా చేతితో రాసిన లెట‌ర్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ద‌ర‌ఖాస్తు చేసేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్క‌డ‌పోస్టుల వారీగా క‌నిపించే లింకుల్లో మీరు ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలి. కొన్ని స్వ‌ల్ప తేడాలు మిన‌హా అన్నింటికీ ఒకే త‌ర‌హా ద‌ర‌ఖాస్తు విధానం ఉంటుంది. 

 

కొత్త‌గా మొదటిసారి దరఖాస్తు చేసేవాళ్లు న్యూ రిజిస్ట్రేష‌న్‌పై అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌వారు లాగిన్ అవ్వాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌లో ముందుగా మ‌న ప్రాథమిక వివ‌రాలు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఫొటోలు, సంతకం, వ్య‌క్తిగ‌త వివ‌రాలు నింపాలి. తర్వాత ప‌రీక్ష రుసుం చెల్లించాలి. ద‌ర‌ఖాస్తులో  అభ్యర్థి పేరు ప‌దో త‌ర‌గ‌తి ధ్రువ‌ప‌త్రంలో ఉన్న‌ట్టే న‌మోదు చేయాలి. అలాగే ఫోన్ నంబ‌రు, ఈ-మెయిల్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. ఎందుకంటే రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన ఐడీ, పాస్‌వ‌ర్డ్ మీ ఫోన్ నంబ‌రుకు, ఈ-మెయిల్‌కు వ‌స్తాయి. అందుకే అభ్యర్థికి అందుబాటులో ఉన్న ఫోన్ నంబ‌రునే న‌మోదు చేయాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియలో భాగంగా ఉద్యోగం చేయాల‌నుకుంటున్న బ్యాంకును కూడా ఎంపిక చేసుకోవాలి.  అన్ని వివ‌రాల‌ను నింపిన తర్వాత చివ‌ర‌గా మరోసారి తప్పనిసరిగా చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి.  అది పూర్త‌యిన త‌ర్వాత ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష రుసుము చెల్లించాలి. దీంతో రిజిస్ట్రేష‌న్ పూర్త‌వుతుంది. చివ‌రిగా మీకు ఈ-రిసిట్‌వ‌స్తుంది. దాని ప్ర‌తిని తీసిపెట్టుకోండి. ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో ఈ-రిసిట్‌ను అభ్యర్థి తనతో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

- డా. జీఎస్ గిరిధ‌ర్‌

Posted Date : 15-06-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌