• facebook
  • whatsapp
  • telegram

మూడు నెలల్లో బ్యాంక్‌ ఆఫీసర్‌!

బ్యాంకులు ప్రత్యేకమైన విధుల కోసం స్పెషలిస్టు ఆఫీసర్లను తీసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతికతను బ్యాంకింగ్‌ను అనుసంధానం చేయడానికి ఐటీ నిపుణులు; గ్రామీణ వినియోగదారుల కోసం అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌; న్యాయపరమైన అంశాలకు లా అధికారి; వర్కింగ్‌ విధానాలు, జీతభత్యాలు, నియామకాలను చూసేందుకు మానవవనరుల సిబ్బంది; ఉత్పత్తులు, పథకాలను వివిధ మార్గాల్లో ప్రచారం చేసేందుకు మార్కెటింగ్‌ టీమ్‌.. ఇలా ప్రతి విభాగానికి తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.

రోజు రోజుకీ పెరుగుతున్న పోటీని తట్టుకొని సమర్థంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి బ్యాంకులు స్పెషలిస్ట్‌ ఆఫీసర్లను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి.  వీటిలో ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్‌, పర్సనల్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. రెండు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో ఇంగ్లిష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ /జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. లా ఆఫీసర్‌, రాజ్యభాష అధికారి ఉద్యోగ పరీక్షలకు జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటుంది. మిగతా వాటికి క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు ఇస్తారు. మెయిన్స్‌ పరీక్షలో రాజ్యభాష అధికారి మినహా మిగతా వారికి ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ సంవత్సరం అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఎక్కువ ఉన్నాయి.


- డాక్టర్‌ జి.ఎస్‌. గిరిధర్‌

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌