• facebook
  • whatsapp
  • telegram

స‌బ్జెక్టులపై ప‌ట్టు సాధిస్తే విజ‌యం  

రైల్వే పరీక్షలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సబ్జెక్టులు (అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్) నుంచి ప్రశ్నలుంటాయి. వీటిపై ప‌ట్టు సాధిస్తే విజ‌యం వ‌రిస్తుంది. కాబట్టి అభ్యర్థులు అన్నీ సబ్జెక్టుల మీద అవగాహన తప్పనిసరి. 

అన్ని విభాగాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ప్రతీ విభాగం మీద పట్టు సాధించాలి.
‣ టెక్నికల్ విభాగం నుంచి 50 నుంచి 60 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
‣ టెక్నికల్‌తో పాటు నాన్-టెక్నికల్ కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి.
‣ పరీక్ష జూన్ 15కాబట్టి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదివితే విజయం తథ్యం.
‣ మనకు అవగాహన లేని విభాగాన్ని చదివేటప్పుడు తెలిసిన వారితో బృంద చర్చలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
‣ రోజూ ప్రతీ సబ్జెక్ట్ మీద శ్రద్ధ చూపడం తప్పనిసరి.
‣ రుణాత్మక మార్కులు ఉన్నందున పరీక్ష రాసేటప్పుడు తెలిసిన దానిని మాత్రమే జవాబుగా గుర్తించాలి.
‣ పైన తెలిపిన సబ్జెక్టులన్నీ చదివిన తర్వాత ఎన్ని ఎక్కువ మాదిరి పేపర్లు ప్రాక్టీసు చేస్తే అంత మంచిది.
‣ ప్రాంతీయ భాషలో కూడా పరీక్ష పత్రం ఉంటుంది కాబట్టి తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు.
‣ పరీక్ష కేంద్రంలో ఓఎంఆర్ పత్రం నింపేటప్పుడు పర్యవేక్షకుని సలహా తీసుకుంటే తప్పులు పోయే అవకాశం ఉండదు.

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌