• facebook
  • whatsapp
  • telegram

 ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ - ప్రిప‌రేష‌న్‌

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సీ) నిర్వహించే ప‌రీక్షల్లో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఒక‌టి. దీనిద్వారా అట‌వీ శాఖ‌లో ఉన్నతోద్యోగానికి బాట‌లు వేసుకోవ‌చ్చు. సివిల్స్ మాదిరి ఈ ప‌రీక్షను ఏటా నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ స‌ర్వీస్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమిన‌రీ ప‌రీక్షను రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు

ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో:


ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి. వీటికి 400 మార్కులు కేటాయించారు. మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో స‌రైన స‌మాధానం గుర్తించాలి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ మూడో వంతు మార్కు త‌గ్గిస్తారు. ప్రిలిమ్స్ పేప‌ర్‌-2లో క‌నీసం 33 శాతం మార్కులు సాధించాలి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల‌ పేప‌ర్‌-1 జ‌వాబుల‌ను మూల్యాంక‌నం చేస్తారు. మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న మొత్తం ఖాళీల‌కు 12 లేదా 13 రెట్లలో అభ్యర్థుల‌ను మెయిన్స్‌కు ఎంపిక‌చేస్తారు. ప్రిలిమ్స్‌ కేవలం స్క్రీనింగ్ ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

మెయిన్స్ ఇలా...


ఇందులో మొత్తం 6 పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 300 మార్కుల‌కు, పేప‌ర్‌-2 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ 300 మార్కుల‌కు ఉంటాయి. పేప‌ర్‌-3,4,5,6 అభ్యర్థి ఎంచుకున్న ఆప్షన‌ల్ స‌బ్జెక్టుల‌పై ఉంటాయి. ప్రతి అభ్యర్థి రెండు ఆప్షన‌ల్ స‌బ్జెక్టుల‌ను తీసుకోవాలి. ఒక్కో స‌బ్జెక్టు నుంచి 2 పేప‌ర్లు ఉంటాయి. ఒక్కో పేప‌ర్‌కీ 200 మార్కులు. అన్ని ప్రశ్నప‌త్రాలూ ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటాయి. జ‌వాబులు కూడా ఆంగ్లంలోనే రాయాలి. ఇత‌ర భాష‌ల్లో రాయ‌డానికి అవ‌కాశం లేదు. ప్రతి పేప‌ర్‌కు వ్యవ‌ధి 2 గంట‌లు.


ఆప్షన‌ల్ స‌బ్జెక్టులు: 

అగ్రిక‌ల్చర్‌, అగ్రిక‌ల్చర‌ల్ ఇంజినీరింగ్‌, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ అండ్ వెట‌ర్నరీ సైన్స్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, ఫారెస్ట్రీ, జియాల‌జీ, మ్యాథ్స్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాల‌జీ (వీటిలో కొన్ని స‌బ్జెక్టుల‌ను కాంబినేష‌న్‌గా తీసుకోవ‌డం వీలుప‌డ‌దు)

ఇంట‌ర్వ్యూ..


మెయిన్స్‌లో అర్హత సాధించిన‌వారిని ఇంట‌ర్వ్యూకి ఎంపిక‌చేస్తారు. సాధార‌ణంగా ఖాళీల‌కు ఆయా కేట‌గిరీల‌వారీ రెండు లేదా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. మౌఖిక ప‌రీక్షకు 300 మార్కులు కేటాయించారు.

తుది ఎంపిక‌:


మెయిన్స్‌+ ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ముఖ్య వివరాలు...


అర్హ‌త‌యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ అండ్‌ వెట‌ర్నరీ సైన్స్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, జియాల‌జీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాల‌జీ వీటిలో ఏదైనా స‌బ్జెక్టును డిగ్రీలో చ‌దివుండాలి. లేదా అగ్రిక‌ల్చర‌ల్‌, ఫారెస్ట్రీ, ఇంజినీరింగ్‌ల్లో ఏదైనా డిగ్రీ ఉండాలి. . ప్ర‌స్తుతం ఆఖ‌రు సంవ‌త్స‌రం కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
 

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌