• facebook
  • whatsapp
  • telegram

క్షేత్రగణితం

1. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 400  చ.మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత?
1) 120 మీ.       2) 150 మీ.      3) 90 మీ.     4) 135 మీ.
సాధన: ఒక సమబాహు త్రిభుజ భుజం a అయితే
వైశాల్యం = కానీ, సమబాహు త్రిభుజ వైశాల్యం = 400 

చుట్టుకొలత = 3a = 3 × 40 = 120 మీ.
జవాబు: 1

 

2. రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 4 : 3, వాటి ఎత్తుల నిష్పత్తి 3 : 4 అయితే వాటి భూముల నిష్పత్తి ఎంత?
1) 16 : 9       2) 9 : 16       3) 9 : 12       4) 16 : 12                                                                                
సాధన: మొదటి త్రిభుజం భూమి, ఎత్తు, వైశాల్యాలు వరుసగా b1, h1, Aఅనుకుందాం.
A1 =  b1 × h1
రెండో త్రిభుజం భూమి, ఎత్తు, వైశాల్యాలు వరుసగా b2, h2, A2 అనుకుందాం. కా
A b2 × h2


సంక్షిప్త పద్ధతి: b: b2 =  = 16 : 9
జవాబు: 1
గమనిక: రెండు త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి a : b, వాటి ఎత్తుల నిష్పత్తి x : y అయితే వాటి భూముల
               నిష్పత్తి =  
 

3. ఒక త్రిభుజం మూడు భుజాల నిష్పత్తి 3 : 4 : 5, ఆ త్రిభుజ వైశాల్యం 216 సెం.మీ.2 అయితే ఆ త్రిభుజం చుట్టుకొలత ఎంత?
 1) 6 సెం.మీ.     2) 12 సెం.మీ.     3) 36 సెం.మీ.       4) 72 సెం.మీ.
సాధన: ఒక త్రిభుజ భుజాల నిష్పత్తి = 3 : 4 : 5
(త్రిభుజ భుజాలు 3 : 4 : 5 లో ఉంటే అది లంబకోణ త్రిభుజం అవుతుంది)
త్రిభుజ వైశాల్యం =  × 3x × 4x  = 216


x =  = 6 సెం. మీ.
ఆ త్రిభుజ భుజాలు = 3 × 6 సెం.మీ., 4 × 6 సెం.మీ., 5 × 6 సెం.మీ.
= 18 సెం.మీ., 24 సెం.మీ., 30 సెం.మీ.
త్రిభుజం చుట్టుకొలత = 18 + 24 + 30 = 72 సెం.మీ.
జవాబు: 4

 

4. ఒక చతురస్ర కర్ణం పొడవు 20 సెం.మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత?
1) 10  సెం.మీ.     2) 20

 సెం.మీ.     3) 40 సెం.మీ.   4) 80 సెం.మీ
సాధన: చతురస్ర భుజం s, దాని కర్ణం d అయితే 
            d =  s అవుతుంది.
           s = 20 సెం.మీ.
  
                 = 10 సెం. మీ.
∴ s = 10 సెం. మీ.
చతురస్రం చుట్టుకొలత = 4 × s = 4 × 10 = 40 సెం.మీ.
జవాబు: 3

5. ఒక చతురస్రం భుజాన్ని 10% పెంచితే, దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?
1) 10%    2) 20%      3) 21%     4) 16%
సాధన: చతురస్రం భుజాన్ని x% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం

వృత్త వ్యాసార్ధాన్ని 10% పెంచితే దాని వైశాల్యం కూడా 21% పెరుగుతుంది.
జవాబు: 3

 

6. 784 చ.సెం.మీ. ఉన్న ఒక చతురస్రాకారపు కాగితాన్ని నాలుగు వీలైనంత వృత్తాకారపు ముక్కలుగా కత్తిరిస్తే, ఒక వృత్తాకార ముక్క చుట్టుకొలత ఎంత?
1) 22 సెం.మీ     2) 44 సెం.మీ       3) 66 సెం.మీ    4) 88 సెం.మీ
సాధన: చతురస్ర వైశాల్యం = 784 చ.సెం.మీ
చతురస్ర భుజం =  = 28 సెం.మీ.
ఒక్కొక్క వృత్త వ్యాసార్ధం =   = 7 సెం.మీ.
ఒక్కొక్క వృత్తం చుట్టుకొలత  = 7 సెం.మీ. = 44 సెం.మీ.
జవాబు: 2

 

7. కిందివాటిలో లంబకోణ త్రిభుజ భుజాలు కాని వాటిని గుర్తించండి.
1) 3, 4, 5     2) 1, 1,       3) 1, 

 , 2        4) 
జ: 4 (

8. ఒక వృత్తవ్యాసం 20 మీ. ఆ వృత్త వ్యాసం నుంచి 16 సెం.మీ. పొడవున్న జ్యాకు ఉన్న దూరమెంత?
జ: 6 సెం.మీ.

 

9. ఒక చతురస్ర కర్ణం 4 సెం.మీ. ఈ చతురస్రం కంటే రెట్టింపు వైశాల్యం ఉన్న మరొక చతురస్ర కర్ణం పొడవు ఎంత?
: 8 సెం.మీ.

 

10. 5 చతురస్రాల చుట్టుకొలతలు వరుసగా 24 సెం.మీ., 32 సెం.మీ., 40 సెం.మీ., 76 సెం.మీ., 80 సెం.మీ. ఈ చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానమైన మరొక చతురస్రం చుట్టుకొలత ఎంత?
జ: 124 సెం.మీ.

 

11. ఒక దీర్ఘచతురస్రం పొడవును 30% పెంచారు. దాని వెడల్పును ఎంత శాతం తగ్గిస్తే వైశాల్యంలో మార్పు ఉండదు?
జ: 23 %

 

12. 6 సెం.మీ. భుజంగా ఉన్న సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత?
జ: 

 సెం.మీ.2

13. ఒక చతురస్రాకార పొలం వైశాల్యం 6050 చ.మీ. అయితే దాని కర్ణం పొడవు ఎంత?
జ: 110 మీ.

 

14. ఒక దీర్ఘచతురస్రం 14 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పు ఉంది. పొడవును K సెం.మీ. తగ్గించి, వెడల్పును K సెం.మీ. పెంచి, దాన్ని చతురస్రంగా మారిస్తే వైశాల్యంలో ఎంత మార్పు ఉంటుంది?
జ: 4 చ.సెం.మీ.

 

15. వృత్తం వ్యాసార్ధాన్ని 20% పెంచితే, వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?
జ: 44%

 

16. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 60 మీ. దాని పొడవు వెడల్పునకు రెట్టింపైతే దాని వైశాల్యం ఎంత?
జ: 200 మీ.2

 

17. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 4.5 చ.మీ. దాని చుట్టుకొలత ఎంత? (మీటర్లలో)
జ: 6 + 3

18. ఒక లంబకోణ త్రిభుజం భుజాలు మూడు వరుస సంఖ్యలను కలిగి అవి సెం.మీ.ల్లో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత?
జ: 6 సెం.మీ.2

 

19. ఒక త్రిభుజ భుజాలు వరుసగా 15 యూ., 25 యూ., x యూనిట్లు అయితే కిందివాటిలో ఏది సత్యం?
1) 10 < x < 40    2) 10  x  40    3) 10  x < 40    4) 10 < x  40
జ: 1 (10 < x < 40)

 

20. 144 సెం.మీ.2 వైశాల్యమున్న ఒక దీర్ఘ చతురస్రం పొడవు, వెడల్పులు 4 : 9 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత?
జ: 52 సెం.మీ.

 

21. 7 సెం.మీ., 24 సెం.మీ., 25 సెం.మీ. భుజాలున్న ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమాన వైశాల్యం కలిగిన వృత్తం ఉంది. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత?
జ: 84 సెం.మీ.2            

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌