• facebook
  • whatsapp
  • telegram

లెటర్ సిరీస్

లెటర్ సిరీస్‌లో ప్రశ్నలు అక్షరాలు, అంకెలపై ఉంటాయి. ప్రతి ప్రశ్న ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటుంది. దాన్ని కనుక్కుని తర్వాత వచ్చే శ్రేణిని కనిపెట్టాలి.

1. Z, X, V, T, R (-), (-) శ్రేణిలో ఖాళీ స్థలంలో ఉండాల్సిన అక్షరాలను కనుక్కోండి.

జ:   P, N
వివరణ:   ఈ ప్రశ్నలో Z నుంచి X వరకు రావడానికి 1 అక్షరం వదిలి వెనక్కు వచ్చారు. ఇలా మిగిలిన అక్షరాలను కనుక్కోవచ్చు.
Z - 1 Let = X           T - 1 L = R
X - 1 Let = V           R - 1 L = P
V - 1 L = T               P - 1 L = N

2. KP, LO, MN, --
జ:    NM
వివరణ:   ఈ ప్రశ్నలో K కు వ్యతిరేకంగా P ఉంటుంది. ఆ రెండింటిని ఒక జతగా రాశారు. L కు వ్యతిరేకంగా O, M కు వ్యతిరేకంగా N ఉంటుంది. M తర్వాత వచ్చే అక్షరం N అవుతుంది. N కు వ్యతిరేకంగా M ఉంటుంది. ఆ రెండింటిని జతగా రాస్తే NM అవుతుంది.

 

3. A, C, F, H, ? , M
జ:  K
వివరణ:   ఈ ప్రశ్నలో A కు రెండు స్టెప్పులు ముందుకు వెళితే C, తర్వాత 3 స్టెప్పులు ముందుకు వెళితే F వస్తుంది. ఇలా
A + 2 Steps = C           H + 3 Steps = K
C + 3 Steps = F           K + 2 Steps = M
F + 2 Steps = H

 

4. M, T, W, T, F, S, ?
జ:   S
వివరణ:     ఈ ప్రశ్నలో ఇచ్చిన అక్షరాలకు, తర్వాతి అక్షరాలకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి Monday లో మొదటి అక్షరం M. ఈ విధంగా

Monday   Tuesday   Wednesday   Thursday    Friday    Saturday    Sunday
M, T, W, T, F, S, (S)  అవుతుంది.

 

5. W, V, T, S, Q, P, N, M, ?, ?
జ:  K, J
వివరణ:    ఈ ప్రశ్నలో ఇచ్చిన అక్షరాలు ఒకదాని తర్వాత మరోటి తగ్గుతున్నాయి.
W - 1 Letter = V         Q - 1 L = P
V - 2  L= T                   P - 2 L = N
T - 1 L = S                    N - 1 L = M
S - 2 L = Q                   M - 2 L = K
                                       K - 1 L = J

 

6. AZ, CX, FU, JQ
జ: JQ
వివరణ:    ఈ ప్రశ్నలో A నుంచి C కి రావడానికి రెండు స్టెప్పులు, C నుంచి F కు రావడానికి మూడు స్టెప్పులు ముందుకు జరిగి తర్వాత A కు వ్యతిరేకంగా ఉన్న అక్షరాన్ని రాశారు. ఈ విధంగా A కు వ్యతిరేకంగా Z ఉంటుంది. కాబట్టి AZ, CX, FU, JQ
A + 2 = C; C + 3 = F; F + 4 = J

7. P3C, R5F, T8I, V12L, ?
జ:  X17O
వివరణ:   ఈ ప్రశ్నలో మూడు శ్రేణులు ఉన్నాయి.
మొదటి శ్రేణి P, R, T, V, _
రెండో శ్రేణి 3, 5, 8, 12, _
మూడో శ్రేణి C, F, I, L, _
P - R మధ్యలో 1 అక్షరాన్ని వదిలి ముందుకు వెళ్లారు. అదే విధంగా P, R, T, V, X
రెండో శ్రేణిలో 3 + 2 = 5          8 + 4 = 12 
                   5 + 3 = 8         12 + 5 = 17
మూడో శ్రేణిలో C కి F కు మధ్యలో రెండు అక్షరాలను వదిలి ముందుకు వెళ్లారు. అదే విధంగా C, F, I, L, O కాబట్టి మనకు కావాల్సింది X17O అవుతుంది.

 

8. C_BCCD_CCDB_ _DBC
జ:  DBCC
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన శ్రేణిలోని అక్షరాలు పునరావృతమయ్యాయి. అంటే ఉన్న అక్షరాలు మళ్లీమళ్లీ వచ్చాయి.

9. U, O, I, ?, A
జ:   E
వివరణ:   ఈ ప్రశ్నలోని శ్రేణిలో ముందు అక్షరానికి తర్వాతి అక్షరానికి సంబంధాలు లేవు. కాబట్టి ఇంగ్లిష్‌లోని Vowels (అచ్చులను) వెనక నుంచి (reverse order) రాస్తే U, O, I, E, A అవుతుంది.

 

10. AB, BA, ABC, CBA, ABCD, ?
జ:  DCBA
వివరణ:   ఈ ప్రశ్నలో ఇచ్చిన శ్రేణిని జాగ్రత్తగా పరిశీలిస్తే AB ని reverse order లో BA గా రాశారు. తర్వాత ఒక అక్షరాన్ని ఎక్కువగా తీసుకుని దాన్ని reverse order లో రాశారు.
AB, BA, ABC, CBA, ABCD, DCBA అవుతుంది.

 

11.  పటంలో ? ఉన్న అక్షరాలు ఏవి?

జ:  EM

వివరణ:   ఈ ప్రశ్నలో ఇచ్చిన పటం వృత్తాన్ని గడియారం తిరిగే దిశలో (Clockwise direction) తీసుకుంటే GERMAN ఉంటుంది. అందులో తప్పిపోయిన అక్షరాలు E, M అవుతాయి.
 

12. AB, DEF, HIJK, ?, STUVWX
జ:  MNOPQ
వివరణ:    ఈ ప్రశ్నలోని శ్రేణిలో మొదట 2 అక్షరాలు ఇచ్చి తర్వాత 1 అక్షరాన్ని వదిలేసి తర్వాత 3 అక్షరాలు రాశారు. అంటే మొదటిదానికి రెండో దానికి 1 అక్షరాన్ని ఎక్కువగా రాశారు. 

 13. ​​​​​​

జ:   V

వివరణ:   ఈ ప్రశ్నలో ఇచ్చిన మాత్రికను పరిశీలిస్తే.. మొదటి అడ్డు వరుసలో A, M, B, N లు ఉన్నాయి.

U తర్వాత వచ్చే అక్షరం V అవుతుంది.

14. D-4, F-6, H-8, J-10, ?-?
జ:   L-12, N-14
వివరణ:  ఈ ప్రశ్నలో D గణిత విలువ 4. అదే విధంగా మిగిలిన వాటిని రాయాలి. D కు F కు 1 అక్షరం వదిలేశారు.

కావాల్సింది L - 12, N - 14

 

15. C, M, B, N, A, O, -
జ:  Z
వివరణ:   ఈ ప్రశ్నలో రెండు శ్రేణులున్నాయి.
మొదటి శ్రేణి C, B, A, -
రెండో శ్రేణి M, N, O,
అంటే మొదటి శ్రేణి క్రమంగా తగ్గుతుంది. రెండో శ్రేణి క్రమంగా పెరుగుతుంది. A కు 1 తగ్గితే Z అవుతుంది.

 

16. Q1F, S2E, U6D, W21C, ?
జ:   Y88B

వివరణ:   ఈ ప్రశ్నలో మూడు శ్రేణులున్నాయి.
మొదటి శ్రేణి Q, S, U, W, -
రెండో శ్రేణి 1, 2, 6, 21, -
మూడో శ్రేణి F, E, D, C, -
మొదటి శ్రేణిలో Q కి S కు మధ్యలో 1 అక్షరం వదిలి ముందుకు వెళ్లారు. Q, S, U, W, Y
రెండో శ్రేణిలో 1 × 1 + 1  =  2
2 × 2 + 2  =  4 + 2  =  6
6 × 3 + 3 = 18 + 3  =  21
21 × 4 + 4  =  84 + 4  =  88
మూడో శ్రేణిలో F కి E కి మధ్యలో 1 అక్షరం వదిలి వెనక్కు వెళ్లారు. F, E, D , C, B
మనకు కావాల్సింది  

 

17
జ:  

వివరణ:   ఈ ప్రశ్నలో ఇచ్చిన బాక్సులను జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి బాక్సులో సంఖ్య లవంలో, అక్షరం హారంలో ఉందని తెలుస్తుంది. రెండో బాక్సులో అక్షరం లవంలో, సంఖ్య హారంలో ఉంది. ఈ విధంగా చూస్తే నాలుగో బాక్సులో అక్షరం పైన సంఖ్య కింద ఉండాలి అంటే
A+6, G+7, N+8, V ... అక్షరాలు
15+6, 21+7, 28+8, 36 ... సంఖ్యలు

 

18. BF, CH, ?, HO, LT
జ:  EK
వివరణ:  ఈ ప్రశ్నలో రెండు శ్రేణులున్నాయి.
మొదటి శ్రేణి B, C, - , H, L
రెండో శ్రేణి F, H, - , O, T
మొదటి శ్రేణిలో B నుంచి C 1 స్టెప్, C నుంచి తర్వాత అక్షరానికి 2 స్టెప్పులు ముందుకు వెళ్లారు.
రెండో శ్రేణిలో F నుంచి H కు 2 స్టెప్పులు, H నుంచి K కు 3 స్టెప్పులు ముందు వెళ్లారు.
మొదటి శ్రేణి       రెండో శ్రేణి
B+1L = C         F+2L = H
C+2L = E         H+3L = K
E+3L = H         K+4L = O
H+4L = L         O+5L = T

19. A, AB, ? , ABCD, ABCDE
జ:   ABC

 

20. CAT, FDW, IGZ, ?
జ:  LJC

 

21. AZ, GT, MN, ? , YB
జ:  SH

 

22. abc-d-bc-d-b-cda
జ:   dacab 

 

23. ba-b-aab-a-b
జ:   abba

 

24. mnonopqopqrs-----
జ:    pqrst 

 

25. BDF, CFI, DHL, ?
జ:   EJO 

26. I9J, K11L, ?, O15P, Q17R
జ:   M13N

 

27. Z, S, W, O, T, K, Q, G, ?, ?
జ:    N, C 

 

28.     
జ:  A

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌