• facebook
  • whatsapp
  • telegram

కోడింగ్ - డీకోడింగ్

1. ఒక కోడ్ భాషలో MADRAS అనే దాన్ని NBESBT గా రాస్తే BOMBAY ని ఏవిధంగా రాస్తారు?
జ:  CPNCBZ
వివరణ :  ఈ ప్రశ్నలో MADRASను NBESBT అంటే ప్రతి అక్షరం ముందు అక్షరం అవుతుంది.
M    A  D   R   A   S          B  O  M   B   A   Y
+1 +1  +1 +1 +1 +1       +1 +1 +1 +1 +1 +1
N    B   E    S    B  T          C  P   N   C   B    Z

 

2. ఒక పరిభాషలో ALTERED ను ZOGVIVW గా రాస్తే అదే భాషలో RELATED ను ఎలా రాస్తారు?
జ:  IVOZGVW 
వివరణ :  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం ALTERED ను ZOGVIVW గా రాశారు. మామూలుగా చూస్తే దీనికి సంబంధం కనుక్కోవడం కష్టం. కాబట్టి A కు వ్యతిరేకంగా Z, L కు O. ఈ విధంగా చూస్తే.
A  L  T   E  R  E  D             R  E  L  A  T  E  D
Z  O  G   V  I  V  W            I  V  O  Z  G  V  W

 

3. ఒక కోడ్ భాషలో CONTRIBUTOR ను RTNOCIROTUB గా రాస్తే అదే భాషలో PROHIBITION ను ఏవిధంగా రాస్తారు?

జ: IHORPBNOITI

వివరణ :  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదానికి కోడ్‌కు సంబంధం ఎలా ఉందంటే ఇచ్చిన పదంలో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి. అందులో మొదటి 5 అక్షరాలను, చివరి 5 అక్షరాలను తిప్పి రాశారు. మధ్యలో ఉన్న ఒక అక్షరాన్ని అదే విధంగా రాశారు. కాబట్టి మనం కనుక్కోవలసిన పదంలో కూడా 11 అక్షరాలు ఉన్నాయి. దీన్ని కూడా పై విధంగా భావించాలి.


 

4. ఒక పరిభాషలో CORNER ను GSVRIV గా రాస్తే CENTRAL ను ఎలా రాస్తారు?
జ:  GIRXVEP
వివరణ : 
 ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం CORNER ను GSVRIV గా రాయాలి. అంటే C కు +4 అక్షరాలను కలపాలి. ఇలా
O + 4 S, R + 4 V
 C   O    R    N   E   R           C   E   N   T   R   A   L
+4 +4 +4 +4 +4 +4               +4 +4 +4 +4 +4 +4 +4
  G    S   V   R   I   V            G   I    R    X   V   E   P

5. ఒక పరిభాషలో BOMBAY ను MYMYMY గా రాస్తే TAMILNADU ను ఏ విధంగా రాస్తారు?
జ:   MNUMNUMNU 
వివరణ :  ఈ ప్రశ్నలో BOMBAY ను MYMYMY గా ఎలా రాశారంటే, రెండు అక్షరాలను వదిలి M ను తీసుకున్నారు. తర్వాత రెండు అక్షరాలను వదిలి Y ను తీసుకుని రెండింటిని అంటే MY ని BOMBAY లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు రాశారు. ఈ విధంగా TAMILNADU లో మొదటి రెండు అక్షరాలు వదిలి M ను, తర్వాత రెండు అక్షరాలు వదిలి N ను, మిగతా రెండు అక్షరాలు వదిలి U ను తీసుకుంటే అప్పుడు MNUఅవుతుంది. TAMILNADU లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు MNU వచ్చేలా రాయాలి. TAMILNADU లో 9 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు MNU ను 3 సార్లు రాయాలి. కాబట్టి MNUMNUMNU అవుతుంది.

 

6. ఒక పరిభాషలో HANGER ను TDIMCG గా రాస్తే అదే భాషలో KURESH ను ఏ విధంగా రాస్తారు?
జ:  JRGEQWJ
వివరణ :  ఈ ప్రశ్నలో HANGER ను TDIMCG గా రాయాలి. అంటే HANGER లో చివరి అక్షరం అంటే R కు బదులు +2 అక్షరం ఉపయోగిస్తే T అవుతుంది. E కి -1 అక్షరం ఉపయోగిస్తే D అవుతుంది. అంటే వెనుక నుంచి +2, -1 అనే విధంగా చేయాలి.


7. ఒక పరిభాషలో PAINT ను 74128, EXCEL ను 93596 గా రాస్తే ACCEPT ను ఏ విధంగా రాస్తారు?

జ:  455978 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన కోడ్‌లు.
P  A  I  N  T       E  X  C  E  L       కావాల్సిన కోడ్   A  C  C  E  P  T   
7   4  1  2  8      9   3  5  9  6                                4  5   5  9   7  8

 

8. Z = 52, ACT = 48 అయితే BAT ఎంత?
జ: 46
వివరణ:  ఈ ప్రశ్నలో Z = 52 కావాలంటే Z = 26 దాన్ని 2 తో గుణించారు. అంటే ప్రతి అక్షరం విలువను 2 తో గుణించాలి. Z = 2, B = 4 ... Z = 52 కానీ ఇప్పుడు కావాల్సింది
A +  C+ T =  2 + 6 + 40 =  48
B + A + T =  4 + 2 + 40  =  46

 

9. MAN = 30, CELL = 34 అయితే BANK ఎంత?
జ:   30 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన పదాల సంబంధాలు MAN  =  (13 + 1 + 14)  + 2  =  30
A మొదటి అక్షరం 1
CELL = (3+5+12+12) +2 = 34

BANK = (2+1+14+11) +2 = 30
 

10. BRANCH ను 2-18-1-14-3 గా రాస్తే అదే భాషలో BOMBAY ను ఏ విధంగా రాస్తారు?
జ:  2-15-13-2-1-25 
వివరణ: 
 ఈ ప్రశ్నలో BRANCH ను 2-18-1-14-3-8 గా రాశారు అంటే B విలువ 2 R విలువ 18 ఈ విధంగా రాశారు.         BOMBAY- 2-15-13-2-1-25

 

11. PRATAP ను 1618120116 గా రాస్తే అదే భాషలో NAVIN ను ఎలా రాస్తారు?
జ:  14122914 
వివరణ:  ఈ ప్రశ్నలో A=1, B=2, C=3... Z=26 అయితే PRATAP = 1618120116 అవుతుంది.
NAVIN = 14122914.

 

12. MOBILITY ని 46293927 గా రాస్తే అదే భాషలో EXAMINATION ను ఎలా రాస్తారు?
జ:   56149512965 
వివరణ:  ఈ ప్రశ్నలో A = 1, B = 2,.... Z = 26 అయితే MOBILITY లో ఉన్న అక్షరాలను వరుసగా M = 13 = 1 + 3 = 4, O = 15 = 1 + 5 = 6, B = 2, I = 9, L = 12 = 1 + 2 = 3, I = 9, T = 20 = 2 + 0 = 2, Y = 25 = 2 + 5 = 7 అన్నింటిని ఒకే దగ్గర రాస్తే MOBILITY = 46293927 ఈ విధంగా EXAMINATION రాయాలి. E = 5, X = 24 = 2 + 4 = 6, A = 1, M = 13 = 1 + 3 = 4, I = 9, N = 14 = 1 + 4 = 5, A = 1, T = 20 = 2 + 0 = 2, I = 9, O = 15 = 1 + 5 = 6, N = 14 = 1 + 4 = 5, అంటే 9 కంటే ఎక్కువ విలువలు ఉన్న వాటిని కలపాలి.
EXAMINATION = 56149512965 అవుతుంది.

13. X ను 7 గా కోడ్ చేసి; P ని 9గా కోడ్ చేసి; Z ను 6గా కోడ్ చేసి; M ను 5గా కోడ్ చేసి; L ను 3గా కోడ్ చేసి, D ని 2గా కోడ్ చేస్తే PLDXMZ కోడ్ రూపం ఏమిటి?
జ:  932756 
వివరణ:  ఈ ప్రశ్నలో ఇచ్చిన ప్రకారం కోడ్ రాస్తే సమాధానం సులువుగా వస్తుంది.
 P  L  D  X   M  Z
9  3   2   7   5   6

 

14. NTR ను MOSUQS గా రాస్తే DEVI ని ఏ విధంగా రాస్తారు?
జ:  CEDFUWHJ 
వివరణ:  ఈ ప్రశ్నలో NTR ను MOSUQS గా రాస్తే, అంటే NTR లో 3 అక్షరాలు ఉంటే డీకోడ్‌లో 6 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి N అక్షరానికి ముందు, వెనక ఉన్న అక్షరం MOT కి SUR కి QS అలాగే DEVI లో D కి ముందు, వెనుక అక్షరాలు CE, Eకి DF V కి UW , I కి HJ కాబట్టి DEVI డీకోడింగ్ CEDFUWHJ అవుతుంది.

 

15. ఒక పరిభాషలో TAP ను SZO గా రాస్తే అదే భాషలో FREEZE ని ఏ విధంగా రాస్తారు?
జ:  EQDDYD

 

16. JULY ను 9-20-11-24 గా రాస్తే అదే భాషలో AUGUST ను ఏ విధంగా రాస్తారు?
జ:  0-20-6-20-18-19 

17. GO = 32, SHE = 49 అయితే SOME ఎంత?
జ:   56

 

18. PALAM ను 43 గా రాస్తే అదే భాషలో SANTACRUZ ఎంత?
జ:   123

 

19. A = 1, B = 2, ... Z = 26 అయితే BIDDIC కోడ్ ఎంత?
జ:   294493 

 

20. ఒక పరిభాషలో NEOMAN ను OGRQFJ గా రాస్తే అదే భాషలో ఏ పదం కోడ్ ZKCLUP గా రాస్తారు?
జ:   YIZHPJ 

 

21. ఒక పరిభాషలో MUNICIPALITY ను INMUAPCIYTLI గా రాస్తే అదే భాషలో JUDICIAL ను ఏ విధంగా రాస్తారు?
జ:   IDJULACI

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌