• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన రసాయన పదార్థాలు

హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (Hydrofluoric Acid)

హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం అనేది హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌ వాయువు జలద్రావణం.

దీని రసాయన ఫార్ములా: HF

హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం గాజుని కరిగిస్తుంది. దీన్ని గాజు వస్తువులపై చిత్రాలు గీసేందుకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను ‘ఎచ్చింగ్‌’ (Etching) అంటారు. గాజులో ఉన్న సిలికా  (SlO2)తో బీనీ చర్య జరిపి, నీటిలో కరిగే హైడ్రోఫ్లోరోసిలిసిక్‌ ఆమ్లాన్ని (H2FIS6) ఇస్తుంది.

టెఫ్లాన్‌ (Teflon)

టెఫ్లాన్‌ రసాయన నామం: పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్‌ ్బశిగినీన్శి.

దీన్ని విద్యుత్‌ పరికరాల్లో ఇన్సులేటర్‌గా ఉపయోగిస్తారు.

టెఫ్లాన్‌ ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బేరింగ్‌లు, గేర్లు, సీల్స్, గ్యాస్కెట్లు మొదలైన వాటిలో దీన్ని వాడతారు.

నాన్‌-స్టిక్‌ వంటపాత్రల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు.

క్లోరిన్‌ (Chlorine)

క్లోరిన్‌ నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీన్ని ఉపయోగించి నీటిని శద్ధి చేసే ప్రక్రియను ‘క్లోరినేషన్‌’ అంటారు.

 క్లోరోఫామ్, దీదీగి లాంటి క్రిమిసంహారకాలు, ప్లాస్టిక్, రబ్బర్‌ తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.

ఫాస్‌జీన్‌ (COCl2), బాష్పవాయువు [CCl3(NO2)] మస్టర్డ్‌ వాయువు (Cl-CH2-CH2-S-CH2-CH2-Cl)  లాంటి విషవాయువుల తయారీలో క్లోరిన్‌ను వాడతారు.

క్లోరిన్‌ (Cl2) బలమైన విరంజనకారి (Bleaching agent). కొయ్యగుజ్జు, నూలు, రేయాన్‌ మొదలైన వాటిని ఆక్సీకరణం ద్వారా విరంజనం చేయడానికి క్లోరిన్‌ను వాడతారు. దీని విరంజన ప్రభావం శాశ్వతంగా ఉంటుంది.

బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీలోనూ క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.

బ్లీచింగ్‌ పౌడర్‌

స్లేక్‌డ్‌ లైమ్‌తో క్లోరిన్‌ చర్య జరిపి బ్లీచింగ్‌ పౌడర్‌ను ఇస్తుంది.

బ్లీచింగ్‌ పౌడర్‌ రసాయన నామం: కాల్షియం హైపోక్లోరైట్‌. దీన్ని ‘క్లోరైడ్‌  ఆఫ్‌ లైమ్‌’ అని కూడా అంటారు.

ఇది పసుపు పచ్చ - తెలుపు రంగుల మిశ్రమంలో ఉండి, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది.

బ్లీచింగ్‌ పౌడర్‌ అధిక విలీన ఆమ్లాలతో లేదా కార్బన్‌ డైఆక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు క్లోరిన్‌ వాయువు విడుదల అవుతుంది. దీన్ని ‘అందుబాటు క్లోరిన్‌’ ్బ్చ్ర్చiః్చ్జః’ ‘్తః్న౯i-’్శ అంటారు.

బ్లీచింగ్‌ పౌడర్‌ను ఎక్కువ సమయం గాలిలో ఉంచితే స్వయం ఆక్సీకరణం, స్వయం క్షయకరణం జరిగి ‘అందుబాటు క్లోరిన్‌’ తగ్గుతుంది.

ఒక మంచి బ్లీచింగ్‌ పౌడర్‌ నమూనా సుమారు 35  38% ‘అందుబాటు క్లోరిన్‌’ను విడుదల చేస్తుంది.

బ్లీచింగ్‌ పౌడర్‌ను నీటిని శుద్ధి చేసే క్రిమిసంహారిణిగా వాడతారు.

నూలు, కాగితం గుజ్జును విరంజనం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

బ్లీచింగ్‌ పౌడర్‌ను ఆక్సీకరణి, క్లోరినేటింగ్‌ కారకంగా ఉపయోగిస్తారు.

పొటాషియం పర్మాంగనేట్‌ 

దీని రసాయన ఫార్ములా: రీలీ-వీ4

ఇది ఊదా రంగు కలిగిన స్పటిక పదార్థం.

దీన్ని రసాయన పరిశ్రమల్లో, ప్రయోగశాలల్లో బలమైన ఆక్సీకరణ కారకంగా ఉపయోగిస్తారు.

పొటాషియం పర్మాంగనేట్‌ను చర్మవ్యాధికి, గాయాలను శుభ్రం చేయడానికి, పాదాల్లో ఏర్పడే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగిస్తారు.

ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన ఔషదాల జాబితాలో ఉంది.

రీలీ-వీ4ను నీటిని శుద్ధి చేయడంలో విస్తృతంగా వాడతారు.

కర్బన సమ్మేళనాల్లో అసంతృప్తతను  గుర్తించడానికి రీలీ-వీ4 ద్రావణాన్ని  ఉపయోగిస్తారు.

బెంజీన్‌

ఇది ద్రవ రూపంలోని అరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌. దీనికి రంగు లేదు, మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది.

ఇది ప్రాథమిక పెట్రో రసాయనాల్లో ఒకటి. దీన్ని ముడి చమురు నుంచి సంగ్రహిస్తారు.

దీన్ని పెయింట్లు, వార్నిష్‌లు, అనేక పారిశ్రామిక రసాయనాల తయారీలో వాడతారు.

హైడ్రోజన్‌ క్లోరైడ్‌ (HCl)

ఇది రంగులేని ఘాటైన వాసన కలిగిన వాయువు.

హైడ్రోజన్‌ క్లోరైడ్‌ జల ద్రావణాన్ని ‘హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం’ అంటారు.

మూడు భాగాల గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, ఒక భాగం గాఢ నత్రికామ్ల మిశ్రమాన్ని ‘ద్రవరాజం’ లేదా ‘ఆక్వారీజియా’ అంటారు. ద్రవరాజాన్ని బంగారం, ప్లాటినం లాంటి ఉత్కృష్ట లోహాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

ఎముకల నుంచి జిగురును సంగ్రహించడానికి, ఎముకల బొగ్గును శుద్ధి చేయడానికి హైడ్రోజన్‌ క్లోరైడ్‌ను ఉపయోగిస్తారు.

ఔషధాల తయారీ, ప్రయోగశాలల్లో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని కారకంగా వాడతారు.

మొక్కజొన్న పిండి నుంచి గ్లూకోజ్‌ను తయారుచేయడానికి, సాధారణ ఉప్పును శుద్ధి చేయడానికి, ద్రావణాల ్పబీ విలువను (ఆమ్లత్వాన్ని) నియంత్రించడానికి బీదిః ను ఉపయోగిస్తారు.

పరివర్తన మూలకాల ఉత్ప్రేరక ధర్మాలు

పరివర్తన మూలకాలు, వాటి సమ్మేళనాలను పరిశ్రమల్లో, జీవ వ్యవస్థల్లో ప్రధాన ఉత్ప్రేరకాలుగా ఉపయోగిస్తారు.

హేబర్‌ పద్ధతి ద్వారా అమ్మోనియా (NH3)ను తయారు చేయడానికి ఐరన్‌ (Fe), మాలిబ్డినం (Mo) ను ఉత్ప్రేరకంగా వాడతారు.

స్పర్శా విధానంలో తయారుచేయడంలో సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని వెనాడియం పెంటాక్సైడ్‌ (V2O5) ను ఉత్ప్రేరకంగా ఉపయోగించి, సల్ఫర్‌ డైఆక్సైడ్‌ (SO2)ను సల్ఫర్‌ ట్రైఆక్సైడ్‌ (SO3)గా ఆక్సీకరణం చేస్తారు.

నూనెలను హైడ్రోజనీకరణం చేసి డాల్డా/ వనస్పతిని తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ‘నికెల్‌’ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.

రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్రటి పదార్థం అయిన హిమోగ్లోబిన్‌లో కేంద్ర లోహ అయాన్‌: ఐరన్‌ (Fe+2).

కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడే ఆకుపచ్చ పదార్థం క్లోరోఫిల్‌లో కేంద్ర లోహ అయాన్‌: మెగ్నీషియం (Mg+2).

విటమిన్‌ తీ12 లో కేంద్ర లోహ అయాన్‌: కోబాల్ట్‌ (Co+3).

ఉత్కృష్ట వాయువులు (Inert gases)

 హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్‌ వాయువులను ఉత్కృష్ట వాయువులు అంటారు.

హీలియం:

​​​​​​​ హీలియం మండే స్వభావం లేని, అతి తేలికైన వాయువు. దీన్ని వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్లలో నింపుతారు.

​​​​​​​ ఇది గాలి కంటే తేలికైంది, కాబట్టి  దీన్ని విమానాల టైర్లలో, ఎయిర్‌షిప్‌లలో నింపుతారు.

​​​​​​​ అధిక చర్యాశీలత ఉన్న లోహాల సంగ్రహణంలో, జడవాతావరణాన్ని కల్పించడానికి హీలియం వాయువును ఉపయోగిస్తారు. 

​​​​​​​ గజ ఈతగాళ్లు కృత్రిమ శ్వాస కోసం హీలియం - ఆక్సిజన్‌ వాయువుల మిశ్రమమైన హీలియోక్స్‌ను ఉపయోగిస్తారు.

​​​​​​​ అల్ప ఉష్ణోగ్రతల వద్ద ప్రయోగాలు చేయడానికి, అల్ప ఉష్ణోగ్రతలను సాధించే క్రయోజెనిక్‌ కారకంగా ద్రవ హీలియంను వాడతారు.

​​​​​​​ MRI స్కానింగ్‌ వ్యవస్థలో బలమైన అతివాహక అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేయడానికి ద్రవ హీలియంను ఉపయోగిస్తారు.

ద్రవ హీలియంను అణురియాక్టర్లలో  శీతలీకరణిగా వాడతారు.

నియాన్‌: ఇది ఆరెంజ్‌ - రెడ్‌ కలిసిన రంగులో ఉంటుంది. దీన్ని బల్బుల తయారీలో ఉపయోగిస్తారు. నియాన్‌ బల్బులను సిగ్నల్‌ లైట్లలో, ఓడరేవుల్లో, విమానాశ్రయాల్లో దారి సూచించే దీపాలుగా ఉపయోగిస్తారు.

ఆర్గాన్‌: సాధారణ టంగ్‌స్టన్‌ ఫిలమెంట్‌ బల్బుల్లో జడవాతావరణాన్ని కల్పించడానికి ఆర్గాన్‌ను ఉపయోగిస్తారు. 

క్రిప్టాన్‌: వాణిజ్య ప్రకటనలకు ఉపయోగించే వివిధ రంగులు కలిగిన లైట్లలో మెర్క్యూరీ బాష్పంతో పాటు నియాన్, క్రిప్టాన్‌ను ఉపయోగిస్తారు. గనుల్లో  పనిచేసే కార్మికుల టోపీ లైట్లలో క్రిప్టాన్‌ను వాడతారు.

Posted Date : 24-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌