వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి మెంటల్ ఎబిలిటీ విభాగంలో 'ప్రతిబింబాలు' అనే అంశంపై ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ విభాగానికి చెందిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు అభ్యర్థికి సునిశిత పరిశీలన అవసరం. రోజూ సాధన చేయడం వల్ల ఇలాంటి ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు.
ప్రతిబింబాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవి:
1) అద్దంలో ప్రతిబింబాలు (Mirror Images),
2) నీటిలో ప్రతిబింబాలు (Water Images).
అద్దంలో ప్రతిబింబాలు: ఏదైనా ఒక అక్షరాన్ని లేదా చిత్రాన్ని అద్దంలో చూసినప్పుడు కుడి, ఎడమలు మార్పు చెందిన ప్రతిబింబం ఏర్పడుతుంది.
నీటిలో ప్రతిబింబాలు: ఏదైనా ఒక అక్షరాన్ని లేదా చిత్రాన్ని అద్దంలో చూసినప్పుడు తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది.
అద్దం, నీటిలో ప్రతిబింబాలను పోల్చడం