మానవ శరీరానికి రక్షణ నిచ్చే ఎముకలగూడును అస్థిపంజరం అంటారు. ఇది రక్షణతోపాటు గుండె, మెదడు, ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఎముకలు కాల్షియం, ఫాస్పరస్లతో నిర్మితమవుతాయి. పొడవైన ఎముక మధ్యభాగంలో ఉన్న ఎముకమజ్జ నుంచి రక్తకణాలు తయారవుతాయి. యవ్వనదశలో మానవశరీరంలో 206 ఎముకలు ఉంటాయి. వీటిలో తలలో 29, ఒక్కొక్క కాలు, చేతిలో 30, వెన్నుపూసలో 26 ఉంటాయి. మానవశరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడు కపాలంలో అమరి ఉంటుంది. తలలో మొత్తం 29 ఎముకలుంటాయి. దవడ ఎముకల్లో దంతాలు అమరి ఉంటాయి. వెన్నెముక మధ్య నుండే కాలువలాంటి భాగం నుంచి వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నెముక శరీరానికి ఆధారంలా పనిచేస్తుంది. వెన్నెముక 12 జతల పక్కటెముకలు కలిసి ఉరఃపంజరం ఏర్పడుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది. బాహ్య చెవి, ముక్కు చివరల్లో మెత్తటి ఎముకయిన మృదులాస్థి ఉంటుంది.
ఎముకలు ఒకదానితో ఒకటి అతికి ఉండే భాగాన్ని కీలు అంటారు. ఇవి రెండు రకాలు. అవి: 1) కదలని కీళ్లు, 2) కదిలే కీళ్లు. కపాలం లేదా తలలోని కీళ్లు కదలని కీళ్లకు ఉదాహరణ. తలలో కదిలే ఎముక కింది దవడ. కదిలే కీళ్లు మిగతా శరీర భాగాల్లో ఉంటాయి. ఇవి తిరిగి బంతిగిన్నెకీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడికీలు అనే రకాలుగా ఉంటాయి. భుజవలయం, కటివలయంలో బంతిగిన్నె కీలు ఉంటుంది. దీనివల్ల మనం చేతులను దాదాపు గుండ్రంగా తిప్పగలం. మోకాలు, మోచేతుల్లో మడతబందు కీళ్లు ఉంటాయి. ఇవి ఒకేవైపు కదులుతాయి.
మెడలో బొంగరపు కీలు ఉంటుంది. దీనివల్ల మనం తలను అటూ ఇటూ తిప్పగలం. వెన్నెముకలో జారెడు కీళ్లు ఉంటాయి. దీనివల్ల వెన్నెముక వంగుతుంది. మన శరీరంలో 600 వరకు కండరాలుంటాయి. ఎముకలు కండరాల వల్ల కదులుతాయి.
మానవ అస్థిపంజర వ్యవస్థ
Posted Date : 13-02-2021
ఎస్ఐ : ప్రిలిమ్స్
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష-2022
విద్యా ఉద్యోగ సమాచారం
- AP EAPCET Hall Ticket: 7న ఏపీ ఈఏపీసెట్ హాల్టికెట్లు విడుదల
- Latest Current Affairs: 03-05-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 03-05-2024 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
- RGUKT AP Admission: వచ్చే వారంలో ట్రిపుల్ఐటీ ప్రవేశాల ప్రకటన!
- Admissions: ఒకేసారి ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని వినతి
- Medical Colleges: వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్సై మోడల్ పేపర్ 1 - 2023
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 1 2023
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 3 2016
- ఎస్సై మోడల్ పేపర్ - 5 2016
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 6 2016