• facebook
  • whatsapp
  • telegram

భారతీయ రైల్వేలు

1. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి రైలు మార్గం ఏది?
జ: పుత్తూరు - రేణిగుంట

 

2. రైలుమార్గాల నిడివి ఎక్కువగా ఉన్న రైల్వేజోన్ ఏది?
జ: ఉత్తర రైల్వే

 

3. దేశంలోనే తొలిరైల్వే మండలంగా వాసికెక్కింది ఏది?
జ: దక్షిణ రైల్వే

 

4. దక్షిణమధ్య రైల్వేను ఏ రాష్ట్ర పరిధికి చెందిన రైల్వే జోన్‌గా పరిగణిస్తారు?
జ: తెలంగాణ

 

5. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు?
జ: హిమసాగర్ ఎక్స్‌ప్రెస్

 

6. రైలుపెట్టెల కర్మాగారం ఎక్కడ ఉంది?
జ: పెరంబూర్ (తమిళనాడు)

 

7. 1991-92 లో రైలుమార్గాల సాంద్రత సగటున ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు ఎంత చొప్పున ఉంది?
జ: 19 కి.మీ.

 

8. కిందివాటిలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఎక్కడ ఉంది?
1) విజయవాడ                2) బిలాస్‌పూర్           
3) హౌరా                         4) ఖరగ్‌పూర్
జ: 4 (ఖరగ్‌పూర్)

 

9. కొంకణ్ రైలు మార్గం లేని రాష్ట్రం ఏది?
1) కర్ణాటక      2) కేరళ      3) మహారాష్ట్ర      4) గోవా
జ: 2 (కేరళ)

 

10. భారతదేశంలో ఎవరికాలంలో మొదటిసారిగా రైలు మార్గం వేశారు?
జ: డల్హౌసీ

 

11. మెట్రోరైలు వ్యవస్థ ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది?
జ: దిల్లీ, కోల్‌కతా

 

12. కొంకణ్ రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో చేపట్టారు?
జ: 1998

 

13. అత్యంత పొడవైన రైలు కమ్ రోడ్ బ్రిడ్జి ఏ ప్రాంతాల మధ్య ఉంది?
జ: రాజమండ్రి - కొవ్వూరు

 

14. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే డీజిల్ ఇంజిన్ల బదులు వేటిని ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది?
జ: విద్యుత్ ఇంజిన్‌లు

 

15. ప్రపంచంలో అతి పొడవైన రైలుమార్గం (8640 కి.మీ.) ఎక్కడ ఉంది?
జ: వోల్గోగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ మధ్య

 

16. కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన రైలుమార్గం ఏది?
జ: నేరోగేజ్

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌