• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం

మాదిరి ప్రశ్నలు

1. వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏది?
1) ఒక ప్రదేశం ఎత్తు      2) నీటి ఆవిరి       3) వాయుప్రవాహాలు       4) ఇవన్నీ
జ: ఇవన్నీ

 

2. ఎత్తయిన ప్రదేశానికి వెళ్లేకొద్ది అక్కడ వాతావరణ పీడనం స్థితి ఏ విధంగా ఉంటుంది?
జ: తగ్గుతుంది

 

3. ప్రపంచంలో ఇప్పటివరకు సముద్రమట్టం వద్ద నమోదైన అత్యధిక వాతావరణ పీడనం ఎంత?
జ: 1083.3 మిల్లీబార్లు

 

4. సముద్ర మట్టం నుంచి ప్రతి 10 మీటర్ల ఎత్తుకు పోయేకొద్ది వాతావరణ పీడనం ఎన్ని మిల్లీబార్ల చొప్పున తగ్గుతుంది?
జ: 13333.2

 

5. భూ ఉపరితలంపై ఏదైనా ఒక విశాల ప్రాంతంలో చాలా ఎక్కువ కాలానికి సంబంధించిన వాతావరణ స్థితుల సరాసరిని ఆ ప్రాంతంలోని ఏ అంశంగా పిలుస్తారు?
జ: శీతోష్ణస్థితి

 

6. అత్యధిక వాతావరణ పీడనం నమోదైన ప్రాంతం ఏది?
జ: సైబీరియాలోని అగాటా

 

7. భూమి ఉపరితలంపై ఎన్ని పీడన మేఖలు ఉన్నాయి?
జ: 7

 

8. సముద్రమట్టం వద్ద టిప్ అనే ప్రాంతంలో నమోదైన అత్యల్ప వాతావరణ పీడనం ఎంత?
జ: 870 మిల్లీబార్లు

 

9. సముద్ర మట్టం వద్ద సామాన్య వాతావరణ పీడనం ఎంత?
జ: 760 మి.మీ.

 

10. వాతావరణంలో ఎక్కువ సాంద్రత ఉన్న పొర ఏది?
జ: ట్రోపో

11. జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువైన స్థితిగతులు ఉన్న పొర ఏది?
జ: స్ట్రాటో

 

12. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసేది?
జ: ఐనో

 

13. భూమి ఉపరితలం నుంచి పైకిపోయేకొద్ది ఉష్ణోగ్రత, వాయుపీడనం....
జ: తగ్గుతాయి

 

14. మనకు ఏమాత్రం తెలియకుండానే మనపై / మానవ శరీరంపై వాతావరణం ఎన్నిటన్నుల బరువును మోపుతుంది?
జ: 20 టన్నులు

 

15. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కి, వ్యాకోచించి తేలికై, పైకిపోయి చల్లబడటం అనే ప్రక్రియను ఏమంటారు?
జ: సంవహన క్రియ

 

16. ట్రోపో ఆవరణంలో ఎత్తు - ఉష్ణోగ్రత మధ్య సంబంధం..?
జ: విలోమానుపాతం

 

17. స్ట్రాటో ఆవరణంలో ఎత్తు - ఉష్ణోగ్రత మధ్య సంబంధం..?
జ: అనులోమానుపాతం

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌