1. ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశ సూత్రాలలో చేర్చడంలో రాజ్యాంగ నిర్మాతల ఆశయం ఏమిటి?
జ: జాతీయ సమైక్యత, సమగ్రత
2. మాతా, శిశు సంరక్షణ రాజ్య కర్తవ్యం అని తెలిపే నిబంధన ఏది?
జ: నిబంధన 42
3. నిబంధన 39 (d) కిందివాటిలో ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
ఎ) సమాన పనికి అసమాన వేతనం
బి) శారీరక, మానసిక శ్రమకు సమాన వేతనం
సి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
డి) ఎ, బి సరైనవి
జ: సి (స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం)
4. ఆదేశ సూత్రాలు న్యాయార్హమైనవి కావు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ: నిబంధన 37
5. కిందివాటిలో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చని నిబంధన ఏది?
ఎ) 38 (2) బి) 39 (f) సి) 39 (e) డి) 39 (A)
జ: సి (39 (e))
6. గ్రామ పంచాయతీలను స్వయంపాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ: నిబంధన 40
7. కిందివాటిలో ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
ఎ) 40 వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 43 వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
జ: డి ( 42 వ రాజ్యాంగ సవరణ చట్టం)
8. కిందివాటిలో 43 వ రాజ్యాంగ నిబంధనలో లేని అంశం ఏది?
ఎ) కార్మికులకు కనీస వేతనం
బి) కార్మికుల జీవన ప్రమాణాలు
సి) కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య
డి) తగిన విరామం
జ: సి (కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య)
9. ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది?
జ: గోవా
10. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి చట్టాలు చేయాలని తెలిపే నిబంధన ఏది?
జ: నిబంధన 47
11. నిబంధన 49 ప్రకారం కింద పేర్కొన్న వాటిలో వేటిని సంరక్షించాలి?
ఎ) ప్రభుత్వ ఆస్తులు బి) చారిత్రక కట్టడాలు
సి) చారిత్రక స్థలాలు డి) చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి
జ: డి (చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి)
12. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపే నిబంధన ఏది?
జ: నిబంధన 51 (d)
13. ఆదేశ సూత్రాలను భారత ప్రభుత్వ చట్టం - 1935 లోని ''ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్"తో పోల్చిన రాజ్యాంగవేత్త ఎవరు?
జ: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
14. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ నిబంధన 45 ని సవరించారు?
జ: 86 వ రాజ్యాంగ సవరణ చట్టం
15. కిందివాటిలో ఆదేశ సూత్రాలలో లేని అంశం ఏది?
ఎ) ఉమ్మడి పౌరస్మృతి
బి) స్త్రీ, పురుషులకు జీవనోపాధి
సి) లౌకిక విధానం
డి) సంపద వికేంద్రీకరణ
జ: సి (లౌకిక విధానం)
16. ప్రాథమిక విధుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తున్నారు?
జ: జనవరి 3
17. రాజ్యాంగంలోని 51 (A) a నిబంధనలో లేని అంశం ఏది?
ఎ) రాజ్యాంగాన్ని గౌరవించాలి బి) జాతీయ గీతాన్ని గౌరవించాలి
సి) జాతీయ పతాకాన్ని గౌరవించాలి డి) తల్లిదండ్రులను గౌరవించాలి
జ: డి (తల్లిదండ్రులను గౌరవించాలి)
18. ప్రాథమిక విధులపై 1998 లో నియమించిన కమిటీ ఏది?
జ: జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ
19. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన మేధాశక్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశ క్షిపణి కార్యకలాపాలకు ఎనలేని కృషి చేశారు. ఇది ఏ ప్రాథమిక విధిని సూచిస్తుంది?
జ: 51 - (A)J
20. ప్రాథమిక విధులను మొదటిసారిగా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు?
జ: 1976