• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ సవరణ చట్టాలు - III

1. 53వ రాజ్యాంగ సవరణ చట్టం (1986) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) భారత్‌లో 23వ రాష్ట్రంగా మిజోరంను ఏర్పాటు చేశారు.   

బి) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 371(G) ను చేర్చారు.

సి) మిజోరానికి కొన్ని ప్రత్యేక రక్షణలను ఆర్టికల్‌ 371 (G)  ద్వారా కల్పించారు. 

డి) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను సవరించారు. 

1) ఎ, బి, సి  2) ఎ, బి, డి    3) ఎ, సి, డి    4) పైవన్నీ

జ: 1


2. 55వ రాజ్యాంగ సవరణ చట్టం (1986) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌కు రాష్ట్రహోదా కల్పించారు.

బి) భారత్‌లో 24వ రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అవతరించింది.

సి) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 371(H) ని చేర్చారు.

డి) ఆర్టికల్‌ 371 (H) ద్వారా అరుణాచల్‌ప్రదేశ్‌కి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి   3) ఎ, బి, సి     4) పైవన్నీ

జ: 4


3. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో 25వ రాష్ట్రంగా గోవా ఆవిర్భవించింది?

1) 56వ రాజ్యాంగ సవరణ చట్టం, 1987     2) 57వ రాజ్యాంగ సవరణ చట్టం, 1987

3) 58వ రాజ్యాంగ సవరణ చట్టం, 1987      4) 54వ రాజ్యాంగ సవరణ చట్టం, 1986 

జ: 1

4. 60వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ‘వృత్తి పన్ను’ సంవత్సరానికి ఎంత మొత్తం ఉండొచ్చని నిర్దేశించారు? 

1) రూ.250 నుంచి రూ.1250     2) రూ.250 నుంచి రూ.1500 

3) రూ.250 నుంచి రూ.2100     4) రూ.250 నుంచి రూ.2500 

జ: 4


5. 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్‌ 326 ని సవరించారు.

బి) వయోజన ఓటు హక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. 

సి) ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.

డి) లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దుచేశారు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి    3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ: 2


6. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా కల్పించారు?

1) 62వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988   2)  63వ రాజ్యాంగ సవరణ చట్టం, 1989 

3) 64వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990    4) 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

జ:4

 


7.  పంజాబ్‌లో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించిన ‘రాష్ట్రపతి పాలన’ కాల పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీనికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?

1) 64వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990      2) 66వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990 

3) 67వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990      4) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991 

జ: 2


8. 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి ఆర్టికల్స్‌ 239 AA, 239 AB లను చేర్చారు.

బి) కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీని ‘జాతీయ రాజధాని ప్రాంతం’గా పేర్కొన్నారు.

సి) దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక శాసనసభ, మంత్రిమండలి ఉంటాయి.

డి) ఈ రాజ్యాంగ సవరణ చట్టం 1992, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి      3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ: 4


9. రాష్ట్రపతిని ఎన్నుకునే  “Electoral College” లో  దిల్లీ, పాండిచ్చేరి శాసనసభ్యులు ఓటు  హక్కు వినియోగించుకునేందుకు వీలుగా   ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఆ చట్టం ఏది?

1) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991      2) 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991

3) 70వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992      4) 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992

జ: 3


10. 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగంలోని VIII వ షెడ్యూల్‌కి చేర్చిన భాషలను గుర్తించండి.

1) కొంకణి, మణిపురి, నేపాలీ    2) కొంకణి, త్రిపురి, నేపాలీ    3) సింధీ, నేపాలీ, కొంకణి   4) బోడో, కొంకణి, నేపాలీ

జ: 1


11. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదాను కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992     2) 72వ రాజ్యాంగ సవరణ చట్టం 1992

3) 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992      4) 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992

జ: 3


12. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది?

1) 62వ రాజ్యాంగ సవరణ బిల్లు     2) 63వ రాజ్యాంగ సవరణ బిల్లు 

3) 64వ రాజ్యాంగ సవరణ బిల్లు    4)  65వ రాజ్యాంగ సవరణ బిల్లు

జ: 3


13. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1992కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని 1991, సెప్టెంబరు 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

బి) దీన్ని 1992, డిసెంబరు 22న పార్లమెంట్‌ ఆమోదించింది.

సి) దీనికి 1993, ఏప్రిల్‌ 20న అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆమోద ముద్రవేశారు.

డి) పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఇది కార్యరూపం దాల్చింది.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 4


14. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1992, ఏప్రిల్‌ 24      2) 1993, ఏప్రిల్‌ 24      3) 1992, జూన్‌ 1    4) 1993, డిసెంబరు 24

జ: 2


15. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి 9వ భాగాన్ని చేర్చారు.  

బి) రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చారు.

సి) ఈ చట్టం గురించిన సమగ్ర వివరణ ఆర్టికల్స్‌ 243, 243(A)  నుంచి  243(O) మధ్య ఉంది.

డి) 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి    3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 4


16. పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రయత్నించి విఫలమైంది?

1) 65వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1989     2) 66వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1990

3) 67వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1989       4) 69వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1991

జ: 1

 


17. 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) 1991, సెప్టెంబరు 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

బి) 1992, డిసెంబరు 22న పార్లమెంట్‌ ఆమోదించింది.

సి) దీని ద్వారా పట్టణ, స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కృషి చేశారు.

డి) పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఇది కార్యరూపం దాల్చింది.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 4 


18. 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి 9(A) భాగాన్ని చేర్చారు.

బి) రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చారు.

సి) ఆర్టికల్స్‌ 243(P) నుంచి  243(ZG) మధ్య ఈ చట్టం గురించిన సమగ్ర వివరణ ఉంది.

డి) పట్టణ, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి      4) పైవన్నీ

జ: 4


19. 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1993, డిసెంబరు 22     2) 1992, డిసెంబరు 22    3) 1993, జూన్‌ 1     4) 1993, ఏప్రిల్‌ 24

జ: 3

మరికొన్ని..


1. 77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 16(4A) ని చేర్చారు.

బి) ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.

సి) పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఈ చట్టం రూపొందింది.

డి) ఈ చట్టాన్ని 1996, అక్టోబరు 16న సుప్రీంకోర్టు రద్దు చేసింది.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి   3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 1


2. 78వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లోని చట్టాల సంఖ్య ఎంతకు చేరింది? (ఈ షెడ్యూల్‌లోని చట్టాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉండదు.)

1) 189    2) 197    3) 284    4) 302

జ: 3


3. 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు కోసం రూపొందించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 78వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995    2) 79వ రాజ్యాంగ సవరణ చట్టం, 1999

3) 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000    4) 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000

జ:  3


4. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో లభించే స్థూల రాబడిలో 29% రాష్ట్రాలకు కేటాయించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1)  79వ రాజ్యాంగ సవరణ చట్టం, 1999     2) 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000

3) 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000    4) 82వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000

జ: 2


5. అరుణాచల్‌ ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) వారికి రిజర్వేషన్లు రద్దు చేస్తూ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించారు?

1) 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000    2) 82వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001

3) 83వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000      4) 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001

జ: 3


6. 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభ స్థానాల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదని నిర్ణయించారు?

1) 2026   2)  2031    3) 2035    4) 2033

జ: 1


7. 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా ఏర్పాటు చేసిన ‘నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌’ (డీలిమిటేషన్‌ కమిషన్‌)ను గుర్తించండి.

1)  2వ డీలిమిటేషన్‌ కమిషన్‌     2) 3వ డీలిమిటేషన్‌ కమిషన్‌  

3) 4వ డీలిమిటేషన్‌ కమిషన్‌    4) 5వ డీలిమిటేషన్‌ కమిషన్‌

జ:  3


8. 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 21(A) ని చేర్చారు.

బి) ఆర్టికల్‌ 21(A) ప్రకారం, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కుగా మారింది.

సి) ఆర్టికల్‌ 21(A) ప్రకారం, 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు లభిస్తుంది.

డి) అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి     3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ:  4

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌