• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ సవరణ చట్టాలు - IV

1. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన కోసం 1991 జనాభా లెక్కలకు బదులు 2001 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవాలని ఏ రాజ్యంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించారు?

1) 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 

2) 85వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002

3) 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 

4) 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003

జ: 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003


2. 88వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్‌ 268 (A)ని కొత్తగా చేర్చారు.

బి) ఆర్టికల్‌ 270ని సవరించారు.

సి) సర్వీస్‌ టాక్స్‌ (Service Tax) ని కేంద్ర జాబితాలో 100వ అంశంగా చేర్చారు.

డి) పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఈ చట్టం కార్యరూపం దాల్చింది.

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి      3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ: ఎ, బి, సి


3. 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 338 (A) ని కొత్తగా చేర్చారు.

బి) ఆర్టికల్‌ 340 ప్రకారం నేషనల్‌ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

సి) ఆర్టికల్‌ 338 ప్రకారం నేషనల్‌ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

డి) ఆర్టికల్‌ 338 (A) ప్రకారం నేషనల్‌ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, డి      3) ఎ, సి, డి       4) పైవన్నీ

జ: ఎ, సి, డి
 

4. 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్స్‌ 75, 164లను సవరించారు.

బి) ఆర్టికల్స్‌ 75(1A) , 75(1B) లను కొత్తగా చేర్చారు.

సి) ఆర్టికల్స్‌ 164(1A), 164 (1 B), లను కొత్తగా చేర్చారు.

డి) అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో ఈ చట్టం కార్యరూపం దాల్చింది

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి      3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ:పైవన్నీ
 

5. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 

2) 92వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006

3) 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 

4) 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006

జ : 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 
 

6. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య శాసనసభ/ విధానసభ సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదని 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా నిర్దేశించారు?

1) 12%       2) 15%       3) 18%        4) 21% 

జ:15% 

7. 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ప్రకారం చిన్న రాష్ట్రాల్లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత మందికి తగ్గకూడదని నిర్దేశించారు?

1) 9      2) 10      3) 11      4) 12 

జ:12  
 

8. 92వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌కు చేర్చిన భాషలను గుర్తించండి.

1) బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి   

2) బోడో, డోగ్రి, ఉర్దూ, నేపాలీ

3) బోడో, డోగ్రి, కొంకణి, నేపాలీ    

4) నేపాలీ, సింధీ, డోగ్రి, మైథిలి

జ:బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి    

9. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగానికి ఆర్టికల్‌ 15(5)ను చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది సాధ్యమైంది?

1) 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003  

2) 90వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 

3) 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005  

4) 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006 

జ:93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005   

10. 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006 ప్రకారం ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ తెగల (Scheduled Tribes) సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రి ఉండాలనే నిబంధనను తొలగించారు?

1) బిహార్‌       2) పశ్చిమ్‌ బంగా     3) మధ్యప్రదేశ్‌      4) అరుణాచల్‌ ప్రదేశ్‌ 

జ:బిహార్‌

11. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మంత్రి మండలిలో షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 92వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003   

2) 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005  

3) 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006 

4) 95వ రాజ్యాంగ సవరణ చట్టం, 2009 

జ:94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006  
 

12. 96వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ను సవరించారు.

బి) 8వ షెడ్యూల్‌లోని 15వ ఎంట్రీ ‘ఒరియా’ అనే పదం స్థానంలో ‘ఒడియా’ను చేర్చారు.

సి) పశ్చిమ బెంగాల్‌ పేరును పశ్చిమ్‌ బంగా అని మార్చారు.

డి) ఈ సవరణ చట్టం 2011, సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది. 

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి      3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ: ఎ, బి, డి 


13. ‘సహకార సంఘాలకు’ (Co-operativesocieties) రాజ్యాంగబద్ధతను కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 95వ రాజ్యాంగ సవరణ చట్టం, 2009 

2) 96వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011

3) 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011  

4) 98వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012 

జ: 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
 

14. సహకార సంఘాల గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్‌ మధ్య వివరించారు?

1) ఆర్టికల్స్‌ 243ZH నుంచి 243ZT

2) ఆర్టికల్స్‌ 243ZG నుంచి 243ZS  

3) ఆర్టికల్స్‌ 243ZM నుంచి 243ZHA 

4) ఆర్టికల్స్‌ 234ZT నుంచి 243ZV

జ: ఆర్టికల్స్‌ 243ZH నుంచి 243ZT
 

15. 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్‌ 19(1)(C) లో“Co-operative societies” అనే పదాన్ని చేర్చారు.

బి) ఆర్టికల్‌43(B) ని కొత్తగా చేర్చారు.

సి) డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ కాలంలో ఈ చట్టం కార్యరూపం దాల్చింది.

డి) ఈ చట్టం 2012, జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి       3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ :పైవన్నీ 
 

16. 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 ద్వారా రాజ్యాంగానికి కొత్తగా కింది ఏ భాగాన్ని చేర్చారు?

1) PART-IX(A)        2) PART-IX(B)        3) PART-IX(C)         4) PART-IX(D)

జ :PART-IX(B) 
 

17. 98వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి ఆర్టికల్‌ 371J ని కొత్తగా చేర్చారు.

బి) కర్ణాటక రాష్ట్రంలోని 6 జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

సి) గుల్బర్గా, బీదర్, రాయచూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

డి) ఈ చట్టం డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ కాలంలో కార్యరూపం దాల్చింది.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి         3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ:పైవన్నీ
 

18. ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’ ఏర్పాటును కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 

2) 98వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012

3) 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014 

4) 100వ రాజ్యాంగ సవరణ చట్టం, 2015

జ:99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014 


19. 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని 121వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2014గా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

బి) దీన్ని 2014, ఆగస్టు 13న లోక్‌సభ ఆమోదించింది

సి) దీనికి 2014, ఆగస్టు 14న రాజ్యసభ ఆమోదం తెలిపింది.

డి) ఈ చట్టాన్ని దేశంలోని 17 రాష్ట్రాలు ఆమోదించాయి.

ఇ) దీనికి 2014, డిసెంబరు 31న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

1) ఎ, సి, డి, ఇ     2) ఎ, బి, డి, ఇ       3) ఎ, బి, సి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ 
 

20. 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఇది జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ ఏర్పాటు కోసం ఉద్దేశించింది.)

1) 2015, జనవరి 13     2) 2015,  ఫిబ్రవరి 15     3) 2015, ఏప్రిల్‌ 13   4) 2015, అక్టోబరు 2

జ:2015, ఏప్రిల్‌ 13 

 

మరికొన్ని..

1. ‘జాతీయ న్యాయనియామకాల కమిషన్‌’ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది?

1) 2015, మార్చి 16       2) 2015, అక్టోబరు 16      3) 2016, ఫిబ్రవరి 18      4) 2016, ఏప్రిల్‌ 3

జ:2015, అక్టోబరు 16 
 

2. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య భూభాగాల పరస్పర బదిలీ కోసం ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014     2) 100వ రాజ్యాంగ సవరణ చట్టం, 2015

3) 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016      4) 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018

జ:100వ రాజ్యాంగ సవరణ చట్టం, 2015
 

3. 100వ రాజ్యాంగ సవరణ చట్టం, 2015కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) భారత్‌ నియంత్రణలో ఉన్న 111 ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు బదిలీ చేయాలి.

బి) బంగ్లాదేశ్‌ నియంత్రణలోని 51 ప్రాంతాలను భారత్‌కు బదిలీ చేయాలి.

సి) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 2ను సవరించారు.

డి) ఈ సవరణ చట్టం నరేంద్రమోదీ ప్రభుత్వ కాలంలో కార్యరూపం దాల్చింది.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి       3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ:పైవన్నీ
 

4. కిందివాటిలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో సంబంధమున్న రాజ్యాంగ సవరణ చట్టం?

1) 100వ రాజ్యాంగ సవరణ చట్టం, 2015      2) 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016

3) 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018       4) 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014

జ:101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2016
 

5. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (Economically Backward Classes -EBC) వారికి విద్యా, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018       2) 103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019

3) 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019        4) 105వ రాజ్యాంగ సవరణ చట్టం, 2021

జ:103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌