• facebook
  • whatsapp
  • telegram

మూలకాలు

1. రెండు సజాతి (ఒకే రకమైన) పరమాణువుల కలయికతో ఏర్పడేది?
జ: మూలకం
 

2. సల్ఫర్ స్థిరమైన రూపమేది?
జ: S8
 

3. హీలియం స్థిరమైన రూపం ఏది?
జ: He
 

4. కిందివాటిలో సమ్మేళనం కానిదేది?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ (CO)                   బి) కోబాల్ట్ (Co)
సి) అమ్మోనియా (NH3)                        డి) ఇసుక (SiO2)
జ: బి) కోబాల్ట్ (Co)
 

5. కిందివాటిలో వాయుస్థితిలో ఉండి, మూలకం కానిది
ఎ) ఆక్సిజన్                                         బి) హైడ్రోజన్
సి) ఆర్గాన్                                           డి) ఓజోన్
జ: డి) ఓజోన్
 

6. ద్రవస్థితిలో ఉండే మూలకాలకు ఉదాహరణ
జ: బ్రోమిన్, మెర్క్యురీ
 

7. సిలికాన్ ఒక -
జ: అలోహం
 

8. కిందివాటిలో అర్ధలోహం ఏది?
ఎ) జెర్మేనియం                                      బి) యాంటిమొని
సి) ఆర్సెనిక్                                         డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
 

9. భూపటలంలో అత్యధికంగా లభించే మూలకాల్లో ఆక్సిజన్ తర్వాత రెండో మూలకం ఏది?
జ: సిలికాన్
 

10. భూమిలో అత్యధికంగా లభించే లోహం ఏది?
జ: అల్యూమినియం
 

11. వాతావరణంలో అత్యధికంగా లభించే జడవాయువు -
జ: ఆర్గాన్
 

12. కిందివాటిలో రూపాంతరతను (Allotropy)ను ప్రదర్శించని మూలకమేది?
కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్
జ: క్లోరిన్
 

13. కార్బన్ స్ఫటిక రూపాంతరాలేవి?
జ: డైమండ్ , గ్రాఫైట్
 

14. అతి పరిశుద్ధమైన నేలబొగ్గు (Coal) ఏది?
జ: ఆంత్రసైట్
 

15. లెడ్ పెన్సిల్‌లో ఉండేది-
జ: లెడ్, బంకమన్ను
 

16. వెల్లుల్లి వాసన ఉండే ఫాస్ఫరస్ -
జ: తెల్ల ఫాస్ఫరస్
 

17. ఫాస్ఫరస్‌ను ఎందులో నిల్వ చేస్తారు?
జ: నీరు
 

18. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ఉపయోగించే ఫాస్ఫరస్-
జ: ఎర్ర ఫాస్ఫరస్
 

19. తెల్ల ఫాస్ఫరస్ విషపూరితమైంది. దీని వల్ల శరీరంలో ఏ అవయవాలు దెబ్బతింటాయి?
జ: దవడలు
 

20. యాంటీసెప్టిక్‌గా ఉపయోగించే ఆయింట్‌మెంట్‌లు, ఔషధాలు, కీటకనాశనకారుల (Insecticide) తయారీలో ప్రధాన పాత్ర వహించే మూలకం ఏది?
జ: సల్ఫర్
 

21. రబ్బరు పరిశ్రమల్లో రబ్బరు గట్టిపడటానికి సల్ఫర్ పొడిని కలిపి వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
జ: వల్కనైజేషన్
 

22. వెల్లుల్లి, ఉల్లిలో ప్రధానంగా ఉండే మూలకం ఏది?
జ: సల్ఫర్
 

23. కిందివాటిలో సల్ఫర్ రూపాంతరం ఏది?
ఎ) రాంబిక్ సల్ఫర్                                బి) మోనోక్లినిక్ సల్ఫర్
సి) ప్లాస్టిక్ సల్ఫర్                                 డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
 

24. ఫాస్ఫరస్ చీకట్లో గాలిలో మండుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
జ: ఫాస్ఫారిజెన్స్
 

25. ఎలుకలను చంపడానికి ఉపయోగించే ప్రధాన మూలకం-
జ: ఫాస్ఫరస్
 

26. మొక్కలు వాతావరణంలోని నత్రజనిని ఏ రూపంలో స్వీకరిస్తాయి?
జ: నైట్రేట్
 

27. పదార్థాలను వేడిచేసినప్పుడు ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారు?
జ: ఉత్పతనం
 

28. కిందివాటిలో ఉత్పతన చర్య లేనిది?
ఎ) ఘన అయోడిన్                            బి) ఘన అమ్మోనియం క్లోరైడ్
సి) మెగ్నీషియం తీగను మండించడం            డి) నాఫ్తలీన్ గోళీల పరిమాణం తగ్గడం
జ: సి) మెగ్నీషియం తీగను మండించడం
 

29. కిందివాటిలో రసాయనిక మార్పులకు ఉదాహరణ ఏది?
ఎ) నీటిని మంచుగా మార్చడం              బి) ఘన అయోడిన్‌ను వేడిచేయడం
సి) నీటిని మరిగించడం                    డి) ఇనుము తుప్పుపట్టడం
జ: డి) ఇనుము తుప్పుపట్టడం
 

30. నీటి మరిగే స్థానం ఎంత?
జ: 100oC
 

31. ఫ్లూటో గ్రహం పేరిట ఏ మూలకానికి పేరు పెట్టారు?
జ: ఫ్లూటోనియం
 

32. 'Ru' అనే సంకేతం ఉన్న మూలకం ఏది?
జ: రూధీనియం
 

33. అయోడైజ్డ్ లవణ (Iodized Salt) మిశ్రమంలో సోడియం క్లోరైడ్ లవణంతోపాటు ఉండే ఇతర పదార్థం-
జ: పొటాషియం అయోడైడ్

34. సున్నపురాయిలో ఉండే పరమాణువుల సంఖ్య-
జ: 5
 

35. రష్యా దేశం పేరిట ఏ మూలకానికి పేరుపెట్టారు?
జ: రూధీనియం
 

36. భారజలం రసాయన ఫార్ములా ఏది?
జ: D2O
 

37. కిందివాటిలో లోహం కాకపోయినా మంచి విద్యుత్ వాహకం ఏది?
ఎ) ఫాస్ఫరస్                                      బి) సల్ఫర్
సి) హైడ్రోజన్                                      డి) గ్రాఫైట్
జ: డి) గ్రాఫైట్
 

38. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) మెర్క్యురీ - (Hg)                          బి) ఐరన్ - (Fe)
సి) సోడియం - (Na)                          డి) పొటాషియం - (Ka)
జ: డి) పొటాషియం - (Ka)
 

39. అతి దృఢంగా, అతి మృదువుగా ఉండే మూలకం ఏది?
జ: కర్బనం 
 

40. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టడం-
జ: ఒక రసాయనిక మార్పు
 

41. అమ్మోనియాలో ఉండే మూలకాలేవి?
జ: నత్రజని, ఉదజని
 

42. వాయువులన్నింటిలో తేలికైంది ఏది?
జ: హైడ్రోజన్
 

43. కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చే వాయువు ఏది?
జ: హైడ్రోజన్ సల్ఫైడ్
 

44. 'O2' కు ఆక్సిజన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: లెవోయిజర్
 

45. హైడ్రోజన్ మోనాక్సైడ్ అనే రసాయనిక నామం ఉన్న పదార్థం-
జ: జలం
 

46. కిందివాటిలో పేలుడు స్వభావం ఉన్న పదార్థం ఏది?
ఎ) అమ్మోనియం నైట్రేట్                        బి) నైట్రో గ్లిజరిన్
సి) ట్రై నైట్రో టోలిన్ (TNT)                      డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
 

47. గన్‌పౌడర్ (Gun Powder)లోని మిశ్రమం
జ: పొటాషియం నైట్రేట్ + బొగ్గుపొడి + సల్ఫర్
 

48. కృత్రిమ సిల్క్ అనేది-
జ: ఒక సెల్యులోజ్ నైట్రేట్
 

49. పొడిసున్నం నీటితో కలిస్తే తడిసున్నం ఏర్పడుతుంది. ఇది ఒక-
జ: రసాయన సంయోగచర్య
 

50. సున్నపురాయిని వేడి చేస్తే ఏర్పడేది-
జ: CaO + CO2

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌