• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నగరీకరణ

* 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణం లేదా పట్టణ ప్రాంతం అంటే...
    1) మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా కంటోన్మెంట్ లేదా నోటిఫైడ్ ప్రదేశం.
    2) జనాభా రీత్యా కనీసం 5000 మంది ఉన్న ప్రదేశం.
    3) కనీసం 75% పురుషులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేయడం.
    4) జనసాంద్రత కనీసం చ.కి.మీ.కి 400 ఉండటం.
   
గమనిక:
రామ్‌చంద్రన్ అభిప్రాయం ప్రకారం 50% లేదా అంత కంటే ఎక్కువ శాతం జనాభా వ్యవసాయేతర
              కార్యకలాపాల్లో ఉండే ప్రాంతం.

 

నగరీకరణ పరిణామ దశలు

* లూయిస్ మమ్‌ఫోర్డ్ ప్రకారం నగరీకరణలో కింది దశలు ఉంటాయి.

1. ఇయోపొలిస్: ఇది గ్రామస్థాయి ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించింది.

2. పొలిస్: ఇది పట్టణదశ. ఇక్కడ మార్కెట్ లావాదేవీలు జరుగుతాయి.

3. మెట్రోపొలిస్: ఇది ఒక పెద్ద నగరం. అధిక జనాభా, నానా జాతీయత, సంక్లిష్ట శ్రమ విభజన కలిగి ఉంటుంది.

4. టైరనోపొలిస్: జీవితం ఆడంబరాలతో నిండి, వృథా ఖర్చులు ఎక్కువై, నగరం ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతుంది.

5. మెగాపొలిస్: ఇది నియంత్రణ లేకుండా పెరుగుతున్న నగరం, యంత్రీకరణకు ప్రాధాన్యం ఎక్కువ.

6. నెక్రోపొలిస్: దీన్ని ''మరణించిన వారి పట్టణం'' అంటారు. నగరం యుద్ధం, కరవు, వ్యాధులు లాంటి పరిస్థితిని ఎదుర్కోలేక ఉనికిని కోల్పోతుంది.
 

2013లో ఖండాలవారీ పట్టణ జనాభా:
 

   1. ఉత్తర అమెరికా - 81%

   2. దక్షిణ అమెరికా - 82%

   3. ఆసియా - 40%

  4. ఆఫ్రికా - 40%

SOWP నివేదిక - 2007


* స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్టు - 2007 (SOWP), ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 50 శాతం పట్టణాల్లో నివసిస్తోంది. ఇది 2030 నాటికి 60 శాతానికి పెరగనుంది.


* ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం 2000 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 2.96 మిలియన్లు కాగా, 2010 నాటికి 3.77 మిలియన్లకు పెరగనుంది.

* 2030 నాటికి పట్టణ జనాభా 5 బిలియన్లకు పెరగనుంది.

* 1980 దశకంలో 39 శాతం ఉన్న పట్టణ జనాభా 2000 నాటికి 48 శాతానికి పెరిగింది.

* ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పట్టణీకరణ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది.

 

తెలంగాణ - పట్టణ జనాభా

* 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా 13.61 మిలియన్లు. వీరు మొత్తం జనాభాలో 38.67 శాతం.

హైదరాబాద్ నూరు శాతం పట్టణ జిల్లా కానీ, హైదరాబాద్ నగరం జిల్లా సరిహద్దులను దాటి, పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోకి కూడా వ్యాపించింది.

* హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పట్టణీకరణ చెందిన జిల్లా రంగారెడ్డి.

భారత పట్టణీకరణ - భావనలు

 

(Urbanisation in India - Concepts)

* 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాలను 6 రకాలుగా వర్గీకరించారు.

   టైర్ I -  ఒక లక్ష లేదా అంత కంటే ఎక్కువ జనాభా

   టైర్ II - 50,000 - 99,999

  టైర్ III - 20,000 - 49,999

  టైర్ IV - 10,000 - 19,999

  టైర్ V - 5,000 - 9,999

 టైర్ VI - 5000 కంటే తక్కువ జనాభా

1. చట్టబద్ధ పట్టణాలు (Statutory Towns)

* ఇవి మొదటి తరగతి పట్టణాలు.

* ఇవి సంబంధిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల చట్టరీత్యా నోటిఫై అయి ఉంటాయి.

వీటి కిందికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు లాంటివి వస్తాయి.

 ఉదా: వడోదర మున్సిపల్ కార్పొరేషన్, సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్.

2. జనాభా పట్టణం (Census Town)

* ఇవి రెండో తరగతి పట్టణాలు.

వీటిని 2001 జనాభా లెక్కల ప్రకారం గుర్తించారు.
 

3. మెట్రోపాలిటన్ పట్టణాలు

   * వీటికి మరో పేరు మిలియన్ ప్లస్ సిటీస్.

   * జనాభా ఒక మిలియన్ (10 లక్షలు) లేదా అంత కంటే ఎక్కువ ఉన్న పట్టణాలు.

   * 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 53.

   * 2001 జనాభా లెక్కల ప్రకారం వీటి సంఖ్య 35.

   * దేశంలో మొదటి మెట్రోపాలిటన్ పట్టణం కోల్‌కతా (1901).

   * దేశంలో రెండో మెట్రోపాలిటన్ పట్టణం ముంబయి (1911).

  * 1951 జనాభా లెక్కల ఆధారంగా హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా గుర్తించారు.

ఐరాస తాజా అధ్యయనం (2016)

* 2030 నాటికి ప్రపంచంలో పట్టణ జనాభా 60% ఉండబోతోంది.

*  ప్రపంచంలో ప్రస్తుత మెగా నగరాల సంఖ్య 31.

*  ప్రస్తుతం (2016) భారత్‌లో మెగా సిటీల సంఖ్య - 5 (దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు)

*  2030 నాటికి ప్రపంచంలో మెగాసిటీల సంఖ్య 41కి చేరుతుందని అంచనా. ఇండియాలో 7 (హైదరాబాద్, అహ్మదాబాద్ అదనం).

4. మెగాసిటీస్


* ఒక కోటి లేదా 10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణం

* ప్రస్తుతం దేశంలోని మెగా సిటీల సంఖ్య 3.
 

అవి: 

1) ముంబయి (18.4 మిలియన్లు) అతి పెద్ద మెగా సిటీ

2) దిల్లీ (16.3 మిలియన్లు) రెండో మెగా సిటీ

3) కోల్‌కతా (14.1 మిలియన్లు) మూడో మెగా సిటీ

* మెగా సిటీల జనాభా పెరుగుదల తగ్గుముఖం పడుతోంది.

5. అర్బన్ అగ్లోమరేషన్ లేదా పట్టణ సముదాయాలు (UA)

* ఒక చట్టబద్ధ పట్టణంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే రెండు లేదా ఎక్కువ పట్టణాలతో కలిపి విస్తరిస్తున్నదే UA.

ఉదా: గ్రేటర్ ముంబయి UA, దిల్లీ UA, చెన్నై UA.

* UA అనే భావనను మొదటిసారిగా 1971 జనాభా లెక్కల్లో ఉపయోగించారు.

6. అర్బన్ క్లస్టర్

* కేంద్రస్థంగా మెట్రోపాలిటన్ నగరం లేకుండా ఏర్పడే పట్టణమే అర్బన్ క్లస్టర్.

ఉదా: ధన్‌బాద్ ఇది 8 టైర్ I పట్టణాలతో ఏర్పడింది.
 

7. అర్బన్ షాడో

* పెద్ద పట్టణానికి 75 కి.మీ వ్యాసార్ధం వరకు ఎలాంటి పట్టణం లేకపోవడం.

ఉదా: హైదరాబాద్, నాగ్‌పుర్, జయపుర (జైపూర్)

Note: Statutory Towns 242 పెరగగా, Census towns 2532 పెరిగాయి.

 

8. UNO మెగా నగరం


* కోటి జనాభా ఉన్న నగరాలు ఉదా: ముంబయి, దిల్లీ, కోల్‌కతా

* మొదటి జనాభా లెక్కల సేకరణలో (1872) పట్టణ జనాభా: 8.7%

* మొదటి జనాభా లెక్కల సేకరణలో (1872) పట్టణాల సంఖ్య: 16

* దేశంలో పట్టణ జనాభా 2 సందర్భాల్లో తగ్గింది (స్వాతంత్య్రం రాకముందు) అవి:

1) 1911 జనాభా సేకరణకు ముందు దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు

2) 1931 - 41, 1941 - 51 మధ్యకాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన సందర్భంలో
 

9. పట్టణ జనాభా పెరుగుదల - ధోరణులు

* ఒక అంచనా ప్రకారం 2030 నాటికి పట్టణ జనాభా: ''59 కోట్లు'' (590 మిలియన్లు)

* పట్టణీకరణ అధికంగా జరుగుతున్న ప్రాంతాలు:

1) మైదానాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు

2) తీర ప్రాంతాలు

3) వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలు

* పట్టణీకరణ అల్పంగా జరుగుతున్న ప్రాంతాలు: కొండ, గిరిజన ప్రాంతాలు.

* దేశంలో అధిక పట్టణీకరణ జరుగుతున్న కేంద్రపాలిత ప్రాంతాలు: న్యూదిల్లీ (97.5%), చండీగఢ్

* దేశంలో అల్ప పట్టణీకరణ నమోదవుతున్న కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్, నికోబార్‌దీవులు, దాద్రానగర్ హవేలీ

* మొత్తం పట్టణ జనాభాలో 42% మంది ముంబయి, దిల్లీ, కోల్‌కతాలోనే ఉన్నారు.

* అత్యధిక పట్టణ జనాభా శాతం నమోదైంది: 1981 (46.12%)

* ప్రపంచంలో వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లో పట్టణీకరణ తక్కువగా ఉంది.

* దేశంలో అధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు:

 1. మహారాష్ట్ర (13.5%)

2. ఉత్తర్ ప్రదేశ్ (11.8%)

3. తమిళనాడు (9.3%)

* దేశంలో అల్ప పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలు:

1. సిక్కిం (0.1%)

2. అరుణాచల్ ప్రదేశ్ (0.1%)

3. మిజోరాం (0.1%)

* అధిక పట్టణ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం: న్యూదిల్లీ

* అల్ప పట్టణ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం: లక్షద్వీప్.

* అధిక పట్టణ జనాభా శాతం ఉన్న రాష్ట్రాలు:

1. గోవా (62.2%)

2. మిజోరాం (52.1%)

3. తమిళనాడు (48.4%)

4. కేరళ (47.7%)

* అల్ప పట్టణ జనాభా శాతం నమోదైన రాష్ట్రాలు:

1. హిమాచల్ ప్రదేశ్ (10%)

2. బిహార్ (11.3%)

3. అసోం (14.2%)

* అధిక పట్టణ జనాభా పెరుగుదల రేటు

(2001 - 2011) నమోదైన రాష్ట్రాలు:

1. సిక్కిం (153%) 2. కేరళ (93%)

*  దక్షిణాది రాష్ట్రాల్లో పట్టణ జనాభా:

1. తమిళనాడు (48.4%)

2. కేరళ (47.7%)

3. కర్ణాటక (38.6%)

10. అక్షరాస్యత

* 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ అక్షరాస్యత: 84.88% (2001లో 79.92%)

పురుష అక్షరాస్యత: 89.67%

స్త్రీల అక్షరాస్యత: 79.92%

* పట్టణ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.

* పట్టణంలో సామాజిక అవగాహన, రాజకీయ చైతన్యం ఎక్కువ.
 

11. అధిక పట్టణీకరణ (Over Urbanisation)

* ఒక పట్టణం శక్తి, సామర్థ్యాల కంటే అధికంగా పట్టణీకరణ జరగడం.

ఉదా: న్యూదిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా
 

12. ఉప-పట్టణీకరణ (Sub- Urbanisation):

* ఒక పట్టణ పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాలు కూడా పట్టణీకరణలో భాగస్వాములు కావడం.

ఉదా: దిల్లీ, హైదరాబాద్. 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌