• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ జనాభా

2011 జనగణన

2011 సెన్సస్‌ కమిషనర్‌ డాక్టర్‌ చంద్రమౌళి.

 2011 జనాభా లెక్కల సేకరణ పదిహేనోది, స్వాతంత్య్రం వచ్చాక ఏడోది.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121,05,69,573 (121 కోట్లు).

పురుషులు 62,31,21,843; స్త్రీలు 58,74,47,730.

దేశంలో పురుష జనాభా 51.5% కాగా స్త్రీ జనాభా 48.5 శాతంగా ఉంది.

భారతదేశ జనాభా లెక్కల సేకరణలో 1921వ సెన్సస్‌ను ‘మహా విభాజక సంవత్సరంగా’ పేర్కొంటారు. ఆ గణనలో అంతకుముందు దశాబ్దం కంటే తక్కువ జనాభా నమోదుకావడమే దీనికి కారణం.

ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5 శాతంగా ఉంది. జనాభా పరంగా చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది.

2011 జనాభా లెక్కల నినాదం - మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు.


శ్రామిక జనాభా విభజన 

15 నుంచి 59 ఏళ్ల వయసు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు.

వీరు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంతభాగం పనిచేస్తారు.

గృహిణులు చేసే ఇంటిపని ఇందులో భాగం కాదు.

భారతదేశ జనాభా గణనలో వీరిని 4 భాగాలుగా వర్గీకరించారు. వారు:

i) రైతులు - 25%   

ii) వ్యవసాయ కూలీలు - 30%

iii) పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు - 04%

iv) ఇతర పనులు చేసేవారు - 41%


 

ఉపాంత కార్మికులు: 

* ప్రతిపాదిత సంవత్సరంలో ఎవరైతే 6 నెలల కంటే తక్కువ పని కలిగి ఉంటారో వారిని ఉపాంత కార్మికులు అంటారు.

* 2011 లెక్కల ప్రకారం, మొత్తం కార్మికుల్లో ఉపాంత కార్మికుల వాటా 24.8%గా నమోదైంది.


 

జనసాంద్రత

       చ.కి.మీ.లలో  

                                      

* ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్కిస్తారు.

* 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382.

* జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - బిహార్‌ (1106), పశ్చిమ్‌ బంగా (1028)

జనసాంద్రత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ (11,320) , చండీగఢ్‌ (9258).

* జన సాంద్రత తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్‌ నికోబార్‌ దీవులు (46 మంది)

* జనసాంద్రత తక్కువ ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ (17 మంది).


 

జననాల రేటు 

* ఒక సంవత్సరంలో వెయ్యిమంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో దాన్ని జననాల రేటుగా పేర్కొంటారు.

* 1992లో భారతదేశంలో జననాల రేటు 29, మరణాల రేటు 19.

* 1981 నుంచి భారతదేశంలో జననాల శాతం క్రమేణా తగ్గుతోంది.


 

ప్రస్తుతం దేశ జనాభా 

ఐక్యరాజ్యసమితి, వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకారం 2022 చివరి నాటికి భారతదేశ జనాభా 141.7 కోట్లకి చేరింది. 

* ఇది 2023, జనవరి 18 నాటికి 142.3 కోట్లుగా నమోదైది. 

* ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం చైనా జనాభా 141.18 కోట్లు. 

* 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు కాగా 48 సంవత్సరాల వ్యవధిలో అంటే, 2022 నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది.


రాష్ట్రాలవారీ జనాభా

* మనదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌. దేశ జనాభాలో 16.49% ఈ రాష్ట్రంలోనే ఉంది.

* అధిక జనాభా ఉన్న రెండో రాష్ట్రం మహారాష్ట్ర కాగా, మూడో స్థానంలో బిహార్‌ ఉంది.

* అధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - దిల్లీ, పుదుచ్చేరి.

* అత్యల్ప జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు - లక్షద్వీప్, డామన్‌ డయ్యూ.

* అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు - సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌.

* జనాభా వృద్ధిరేటు ఎక్కువగా మేఘాలయ (28%), తక్కువగా నాగాలాండ్‌ (0.6%) లో నమోదైంది.

* ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - పంజాబ్‌ (31.9%), హిమాచల్‌ప్రదేశ్‌ (25%).

* ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు - మిజోరం (0.1%), మేఘాలయ (0.6%).

* సంఖ్యాపరంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం - ఉత్తర్‌ ప్రదేశ్, తక్కువ కలిగిన రాష్ట్రం - మిజోరం.

* నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎస్సీలు లేరు.

* సంఖ్యాపరంగా ఎస్టీ జనాభా ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో, తక్కువగా గోవాలో ఉంది.

* ఎస్టీ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరం, తక్కువ ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌.

* ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు - పంజాబ్, హరియాణా.వయసుల వివరణ దేశంలో వయసుల వారీగా ఉన్న స్త్రీ, పురుషుల సంఖ్యను ఇది తెలుపుతుంది.

* జనాభాకి సంబంధించి ఇది అత్యంత మౌలిక లక్షణం.

* ఒక దేశ జనాభాను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు. అవి:

1. పిల్లలు    2. పనిచేసే వయసులో ఉన్నవారు      3. వృద్ధులు


పిల్లలు: సాధారణంగా 14 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ జాబితాలోకి వస్తారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం వీరు మనదేశంలో 31% ఉన్నారు.

పనిచేసే వయసులో ఉన్నవారు: 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పరిధిలోకి వస్తారు. దీన్నే పునరుత్పత్తి వయసు అని కూడా అంటారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభాలో వీరు 64% ఉన్నారు.

వృద్ధులు: 59 ఏళ్ల వయసు దాటిన వారిని వృద్ధులుగా పేర్కొంటారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, దేశ జనాభాలో వీరి శాతం 5%. 

ఇతర  వయసుల వారితో పోలిస్తే వీరి వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


లింగ నిష్పత్తి 

ఒక సమాజంలో నిర్దిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక లింగనిష్పత్తి.

ఇది జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలుపుతుంది.

భారతదేశంలో ప్రతి వందమంది మగ పిల్లలకు 103 మంది ఆడపిల్లలు జన్మిస్తున్నారు. అయితే బాలుర కంటే ఎక్కువ సంఖ్యలో బాలికలు మరణిస్తున్నారు.

1951లో భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి 946 : 1000

2011లో భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి 943 : 1000

ఎక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం కేరళ  1083 : 1000

 తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం హరియాణా 879 : 1000

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తి 993 : 1000


అక్షరాస్యత

7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి, ఏ భాషలోనైనా చదివి, రాయగలిగే సామర్థ్యాన్ని అక్షరాస్యత అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత 74.04%. వీరిలో పురుషుల అక్షరాస్యత 82.14%, స్త్రీ అక్షరాస్యత 65.46%. 

* అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ (94%) , తక్కువ ఉన్న రాష్ట్రం బిహార్‌ (63%).

* అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ (91%), తక్కువగా ఉంది దాద్రానగర్‌ హవేలి (76%). 

సంవత్సరం దేశ అక్షరాస్యత
1947 12% 
1951 18% 
1961  28% 
1971 34%
1981  43%
1991 52.3%
2001 64.48%
2011 74.04% 

జనాభా మార్పు 

ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో వచ్చే తేడాను జనాభాలో మార్పు అంటారు.

* జనాభా మార్పును అంకెలు లేదా శాతంలో తెలుపుతారు.

* జనాభా మార్పు = (తర్వాతి కాలంనాటి జనాభా) - (ముందు కాలంనాటి జనాభా)

* ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు = (జననాల సంఖ్య + ప్రాంతంలోకి వలస వచ్చిన వారి సఖ్య) - (మరణాల సంఖ్య + ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్లిన వారి సంఖ్య).

* జనాభాలో మార్పును ప్రాథమికంగా జనన, మరణాల ఆధారంగా లెక్కిస్తారు.

ఫెర్టిలిటీ శాతం

*  ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి, ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే, పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అంటారు. 

*  1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ.

*  భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 2.7% కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.9 శాతంగా ఉంది.


భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు

సంవత్సరం  ఫెర్టిలిటీ
1961 5.9
1971 5.4
1981 4.6
1991 3.8
2001 3.1
2011 2.7

భారతదేశ జనాభా 

1951 361 మిలియన్లు
1961 439 మిలియన్లు
1971 

548 మిలియన్లు

1981 683 మిలియన్లు
1991  846 మిలియన్లు
2001 102 బిలియన్లు
2011  121 బిలియన్లు

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌