• facebook
  • whatsapp
  • telegram

ఆర్థికాభివృద్ధిలో విత్త మార్కెట్లు

1. కిందివాటిలో విత్త సంస్థలు ఏవి?

1) బ్యాంకింగ్‌ సంస్థలు     2) బ్యాంకేతర సంస్థలు     3) 1, 2      4) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

జ:  1, 2  


2. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి ఉపయోగపడే మార్కెట్లను ఏమంటారు?

1) విత్త మార్కెట్లు      2)  మూలధన మార్కెట్లు    3) సహకార మార్కెట్లు    4) ఏదీకాదు

జ:  విత్త మార్కెట్లు


3. కిందివాటిలో విత్త మార్కెట్లు ఏవి?

1) ద్రవ్య మార్కెట్లు    2) మూలధన మార్కెట్లు     3) 1, 2       4) జాతీయ మార్కెట్లు

జ:  1, 2 


4. స్వల్పకాలిక విత్తం సమకూర్చే మార్కెట్‌?

1) ద్రవ్య మార్కెట్‌       2) ట్రెజరీ మార్కెట్‌     3) సెక్యూరిటీలు    4) ఏదీకాదు

జ: ద్రవ్య మార్కెట్‌


5. దీర్ఘకాలిక విత్తం సమకూర్చే మార్కెట్‌?

1) బిల్‌ మార్కెట్‌      2) షేర్‌ మార్కెట్‌     3) మూలధన మార్కెట్‌     4) ద్రవ్య మార్కెట్‌

జ:  మూలధన మార్కెట్‌


6. బ్యాంకింగ్‌ రంగంలో కింది ఏ విత్త మార్కెట్‌ అంతర్భాగంగా ఉంటుంది?

1) మూలధన మార్కెట్‌       2) బిల్‌ మార్కెట్‌     3) కాల్‌మనీ మార్కెట్‌      4) ద్రవ్య మార్కెట్‌

జ: ద్రవ్య మార్కెట్‌


7. కిందివాటిలో బ్యాంకింగ్‌ రంగ విభాగం ఏది?

1) ఆర్‌బీఐ     2) వాణిజ్య బ్యాంకులు     3) అభివృద్ధి బ్యాంకులు, సహకార బ్యాంకులు    4) పైవన్నీ

జ: పైవన్నీ


8. సంఘటిత ద్రవ్య మార్కెట్, ఉప మార్కెట్లలో ఏది భాగంగా ఉంటుంది?

1) కాల్‌మనీ మార్కెట్‌     2) బిల్‌ మార్కెట్‌      3) 1, 2         4) ద్రవ్య మార్కెట్‌

జ: 1, 2 


9. కిందివాటిలో బిల్‌ మార్కెట్‌ విభాగం ఏది?

1) వాణిజ్య బ్యాంకులు     2) ట్రెజరీ బిల్లులు       3) 1, 2          4) ద్రవ్య మార్కెట్‌

జ:  1, 2 


10. చిట్‌ఫండ్‌ కంపెనీలు కింది దేని స్వభావాన్ని పోలి ఉంటాయి?

1) నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థలు      2) లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)

3) ఆర్‌బీఐ      4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

జ:  నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థలు


11. బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడినప్పుడు, ఆయా బ్యాంకుల మధ్య నిధుల బదిలీకి వీలు కల్పించే మార్కెట్‌?

1) ద్రవ్య మార్కెట్‌      2) మూలధన మార్కెట్‌    3) కాల్‌మనీ మార్కెట్‌      4) బిల్‌ మార్కెట్‌

జ:  ద్రవ్య మార్కెట్‌


12. తక్షణ ద్రవ్యం (Call Money)  కాలపరిమితి....

1) ఒకరోజు       2) 91 రోజులు     3) 14 రోజులు    4) 6 నెలలు

జ: ఒకరోజు


13. అల్ప వ్యవధి (Short Notice Loan) రుణపరిమితి....

1) 14 రోజులు    2) 15 రోజులు     3) 16 రోజులు      4) 17 రోజులు

జ:  14 రోజులు


14. ద్రవ్య మార్కెట్‌లో అత్యంత ప్రధానమైన ఉప మార్కెట్‌?

1) బిల్‌ మార్కెట్‌      2) కాల్‌మనీ మార్కెట్‌    3) మూలధన మార్కెట్‌    4) ద్రవ్య మార్కెట్‌

జ:  బిల్‌ మార్కెట్‌


15. ప్రభుత్వం స్వల్పకాలిక రుణాల కోసం విడుదల చేసే విత్తసాధనాలు ఏవి?

1) ద్రవ్య బిల్లులు        2) ట్రెజరీ బిల్లులు    3) వినిమయ బిల్లులు     4)వాణిజ్య బిల్లులు

జ:  ట్రెజరీ బిల్లులు


16. సాధారణ ట్రెజరీ బిల్లుల కాల పరిమితి....

1) 91 రోజులు      2) 92 రోజులు     3) 93 రోజులు      4) 94 రోజులు

జ:  91 రోజులు


17. ట్రెజరీ బిల్లుల కొనుగోలు ద్వారా బ్యాంకులు నిలుపుకునే నిష్పత్తి....

1) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి     2) నగదు నిల్వ నిష్పత్తి   

3) రెపోరేటు    4) రివర్స్‌ రెపోరేటు

జ:  చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి


18. రిజర్వ్‌ బ్యాంకు కల్పించే ద్రవ్యసర్దుబాటు సౌకర్యాన్ని ఏమంటారు?

1) రెపోరేటు         2) రివర్స్‌ రెపోరేటు           3) 1, 2        4) బ్యాంకు రేటు

జ:  1, 2


19. వ్యాపార సంస్థలు విడుదల చేసే విత్తసాధనాలు....

1) వ్యాపార బిల్లులు     2) ద్రవ్యరేటు      3) మూలధన మార్కెట్‌     4) బిల్‌ మార్కెట్‌

జ: వ్యాపార బిల్లులు 


20. కిందివాటిలో వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిపార్సు మేరకు ప్రవేశపెట్టిన ద్రవ్య మార్కెట్‌ సాధనాలు ఏవి?

1) Commercial papers (వాణిజ్యపత్రాలు)      2) Certificate of deposit (జమచేసిన ధ్రువీకరణ పత్రం)

3) 1, 2          4) ఆర్థిక బిల్లులు

జ:  1, 2   


21. సెక్యూరిటీ మార్కెట్లలో అంతర్భాగంగా ఉన్న విత్తమార్కెట్‌?

1) మూలధన మార్కెట్‌      2) కాల్‌మనీ మార్కెట్‌  

3) గిల్ట్‌-ఎడ్జెడ్‌ మార్కెట్‌      4) ఏదీకాదు

జ: మూలధన మార్కెట్‌ 


22. సెక్యూరిటీ మార్కెట్‌లో అంతర్భాగాలు ఏవి?

1) ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌     2) పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్‌

3) 1, 2         4) ఏదీకాదు

జ: 1, 2    


23. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కి ఉన్న మరో పేరు?

1) గిల్ట్‌-ఎడ్జెడ్‌ మార్కెట్‌      2) మూలధన మార్కెట్‌

3) సహకార మార్కెట్‌     4) విత్తమార్కెట్‌

జ: గిల్ట్‌-ఎడ్జెడ్‌ మార్కెట్‌


24. పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్‌ అని కింది వేటిని అంటారు?

1) ప్రాథమిక మార్కెట్‌      2) ద్వితీయ మార్కెట్‌ 

 3) 1, 2       4) కాల్‌మనీ మార్కెట్‌

జ: 1, 2 


25. ద్వితీయ సెక్యూరిటీ మార్కెట్‌లో కింది ఏది భాగంగా ఉంటుంది? 

1) సంఘటిత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌     2) ఓవర్‌ ది కౌంటర్‌ మార్కెట్‌ 

3) 1, 2        4) నిఫ్టీ

జ:  1, 2  


26. సెక్యూరిటీల క్రయ, విక్రయాలు జరిగే మార్కెట్‌?

1) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌      2)సెన్సెక్స్‌

3)లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌     4) సెబీ

జ: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌


27. దేశంలో ఆర్థిక వాతావరణానికి భారమితి?

1) స్టాక్‌ మార్కెట్‌    2) బుల్‌ మార్కెట్‌    3) వినిమయ మార్కెట్‌    4) ద్రవ్య మార్కెట్‌

జ: స్టాక్‌ మార్కెట్‌ 


28. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏర్పాటైన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌?

1) లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌     2) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 

3) న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌     4) ఏదీకాదు

జ: లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


29. భారతదేశంలో మొట్టమొదటి స్టాక్‌  ఎక్స్ఛేంజ్‌ ఏది?

1) సెబీ      2) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌     3) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌    4) ఏదీకాదు

జ: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


30. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1992     2) 1993     3) 1994     4) 1995

జ:  1992


31. సెబీ ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు? 

1) వై.కె. అలగ్‌       2) సి.రంగరాజన్‌     3) రఘురామ్‌ రాజన్‌    4) మాదాబి పూరి బుచ్‌

జ: మాదాబి పూరి బుచ్‌


32. ప్రస్తుత బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఛైర్మన్‌?

1) ఉర్జిత్‌ పటేల్‌     2) ఎస్‌.కె.సిన్హా     3) అమితాబ్‌కాంత్‌     4) ఎస్‌.ఎస్‌.ముంద్రా

 జ: ఎస్‌.కె.సిన్హా


మరికొన్ని..

1. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తన కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించిది?

1) 1992     2) 1993     3) 1994     4) 1955

 జ: 1994


2. అంచనా వ్యాపారం ఎక్కువగా జరిగే మార్కెట్‌?

1)  స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌    2) బుల్‌   3) బేర్‌     4) ద్రవ్య మార్కెట్‌

 జ: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


3. భవిష్యత్తులో సెక్యూరిటీ బాండ్ల ధరలు పెరుగుతాయని ఊహించే స్పెక్యులేటర్లు ఏవి?

1) బుల్‌       2) బేర్‌     3) సెన్సెక్స్‌     4) ఏదీకాదు

 జ:  బుల్‌ 


4. భవిష్యత్తులో సెక్యూరిటీ బాండ్ల ధరలు తగ్గుతాయని ఊహించే స్పెక్యులేటర్లు....

1) బేర్‌     2) వాటాదారులు      3) వ్యాపారులు     4) కొనుగోలుదారులు

 జ: బేర్‌


5. సెన్సెక్స్‌ వివరణ....

1) సెన్సిటివ్‌ ఇండెక్స్‌  2) నిఫ్టీ      3) డాలెక్స్‌         4) ఏదీకాదు

 జ: సెన్సిటివ్‌ ఇండెక్స్‌


6. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచిక....

1) సెన్సెక్స్‌    2)  నేషనల్‌ ఇండెక్స్‌     3) నిఫ్టీ      4) ఏదీకాదు

 జ: సెన్సెక్స్‌


7. సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1986     2) 1987     3) 1988   4) 1989

 జ: 1988  


8. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1875      2) 1876       3) 1877     4) 1878

 జ:  1875 


9. నిఫ్టీ ఫిఫ్టీ అంటే?

1) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచిక      2) NSE 50 

3) 1, 2     4) బుల్‌

 జ: 1, 2 


10. నిఫ్టీ ఫిఫ్టీ కొత్త పేరు?

1) S & P     2) S & P(N)      3) ఫిన్‌టెక్‌      4) ఏదీకాదు

 జ:  S & P(N)    


11. సెబీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి     2) చెన్నై     3) హైదరాబాద్‌     4) న్యూదిల్లీ 

 జ:  ముంబయి


12. సెబీ ఒక .....

1) చట్టబద్ధమైన సంస్థ     2) రాజ్యాంగేతర సంస్థ 

3) శాసనేతరసంస్థ         4) ఏదీకాదు

  జ: చట్టబద్ధమైన సంస్థ


13. సెబీ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ?

1) నరసింహం కమిటీ     2) పటేల్‌ కమిటీ

3) శివరామన్‌ కమిటీ      4) రంగరాజన్‌ కమిటీ

 జ:  పటేల్‌ కమిటీ  


14. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) న్యూదిల్లీ     3) చెన్నై     4) ముంబయి

జ:   ముంబయి


రచయిత


బండారి ధనుంజయ


విషయ నిపుణులు 

Posted Date : 25-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌