1. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) ద్రావణంలో సాపేక్షంగా తక్కువ పరిమాణంలో ఉండే అనుఘటకాన్ని ద్రావితం అంటారు.
బి) ద్రావణంలో సాపేక్షంగా అధిక పరిమాణంలో ఉండే అనుఘటకాన్ని ద్రావణి అంటారు.
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4) పైవేవీకావు
2. కింది వాటిలో ద్రావణం కానిదేది?
1) చక్కెర ద్రావణం 2) సహజ వాయువు 3) శీతల పానీయం 4) స్వచ్ఛమైన నీరు
3. ఒక ద్రావణంలో గరిష్ఠంగా కరిగే ద్రావితం పరిమాణం కంటే తక్కువ ద్రావితం కలిగి ఉన్న ద్రావణాన్ని ఏమంటారు?
1) అతిసంతృప్త ద్రావణం 2)అసంతృప్త ద్రావణం 3) సంతృప్త ద్రావణం 4) పైవేవీకావు
4. కొల్లాయిడ్ ద్రావణాల్లో ద్రావిత కణాల పరిమాణం ఎంత ఉంటుంది?
1) < 1 nm 2) 4000 nm 3) 1 − 1000 nm 4) > 3000 nm
5. విక్షిప్త ప్రావస్థ ్ఘ విక్షేపణ యానకం = .....
1) నిజ ద్రావణం 2) కొల్లాయిడ్ ద్రావణం 3) అవలంబనం 4) పైవన్నీ
6. కింది వాటిలో సజాతీయ స్వభావమున్న ద్రావణం ఏది?
1) నిజ ద్రావణం 2) కొల్లాయిడ్ ద్రావణం 3) అవలంబనం 4) పైవేవీకావు
7. కింది ఏ ద్రావణంలోని ద్రావిత కణాలు కంటికి కనిపిస్తాయి?
1) నిజ ద్రావణం 2)కొల్లాయిడ్ ద్రావణం 3) అవలంబనం 4) పైవేవీకావు
8. ఏ నియమం ప్రకారం పీడనాన్ని పెంచితే ద్రావణంలో ఉన్న వాయువు ద్రావణీయత పెరుగుతుంది?
1) హెన్రీ నియమం 2) చార్లెస్ నియమం 3) అవగ్రాడో నియమం 4) బాయిల్ నియమం
9. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) ధృవ ద్రావణి - నీరు, ఆల్కహాల్
2) అధృవ ద్రావణి - క్లోరోఫాం, హెక్సేన్
3)సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేయడం - ఆవిరిపరచడం
4) సార్వత్రిక ద్రావణి - ఆల్కహాల్
10. కింది వాటిలో సరైంది?
ఎ) ద్రావణిలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉండే ద్రావణాన్ని విలీన ద్రావణం అంటారు.
బి) గాఢ ద్రావణానికి నీళ్లు కలిపితే అది విలీన ద్రావణం అవుతుంది.
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4)పైవేవీకావు
11. ముడిచమురు నుంచి పెట్రోల్‌ను వేరుచేసే పద్ధతి.......
1) వడపోత 2) స్వేదనం 3) ఆవిరిపరచడం 4)అంశిక స్వేదనం
12. ఆమ్ల జలద్రావణంలో ద్రావితం, ద్రావణి ఏది?
ద్రావితం | ద్రావణి | |
1) | ఆమ్లం | నీరు |
2) | నీరు | ఆమ్లం |
3) | ఆమ్లం | ఆల్కహాల్ |
4) | ఆమ్లం | ఆమ్లం |
13. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒకే ద్రవాభిసరణ పీడనం ఉన్న ద్రావణాలను ఏమంటారు?
1) ఐసోటోపిక్ 2) ఐసోటోనిక్ 3) హైపర్టోనిక్ 4) హైపోటోనిక్
14. ద్రావణం బాష్పీభవన రేటు కింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది?
1) ఉష్ణోగ్రత 2) ఉపరితల వైశాల్యం 3) ఉత్ప్రేరకం 4) 1, 2
15. పొగలో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం ఏది?
విక్షిప్త ప్రావస్థ | విక్షేపణ యానకం | |
1) | కార్బన్ కణాలు | గాలి |
2) | గాలి | కార్బన్ కణాలు |
3) | గాలి | ధూళి కణాలు |
4) | నీటి బిందువులు | గాలి |
16. కింది వాటిలో కొల్లాయిడ్ వ్యవస్థ కానిదేది?
1) ద్రవంలో ద్రవం 2)వాయువులో వాయువు
3) ఘనంలో ద్రవం 4) ద్రవంలో వాయువు
17. సోల్ (sol) ఏ రకానికి చెందిన కొల్లాయిడ్ ద్రావణం?
1) ద్రవంలో వాయువు 2) ద్రవంలో ఘనం
3) ఘనంలో వాయువు 4) ద్రవంలో ద్రవం
18. కింది వాటిలో సోల్ రకానికి చెందిన కొల్లాయిడ్ ద్రావణం ఏది?
1) ఇంక్ 2) రక్తం 3) పెయింట్ 4) పైవన్నీ
19. కింది వాటిలో నీటిలో సులభంగా కరిగే వాయువు ఏది?
1) CO2 2) NH3 3) 1, 2 4) He
20. కింది వాటిలో సరైంది?
ఎ) పర్వత ప్రాంత ప్రజల రక్తంలో ఆక్సిజన్ గాఢత తక్కువగా ఉంటుంది.
బి) రక్తంలో ఆక్సిజన్ గాఢత తక్కువగా ఉంటే అనాక్సియా బారిన పడతారు.
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4)పైవేవీకావు
21. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ద్రవాల్లో వాయువుల ద్రావణీయత.....
1) పెరుగుతుంది 2)తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) కచ్చితంగా చెప్పలేం
22. కింది ఏ పద్ధతుల్లో ద్రావణాల గాఢతను వ్యక్తపరుస్తారు?
1) మొలారిటీ 2) నార్మాలిటీ 3) భారశాతం 4) పైవన్నీ
23. 100 గ్రాముల చక్కెర ద్రావణంలో 10 గ్రాముల చక్కెర కరిగి ఉన్నట్లయితే ద్రావిత భారశాతం ఎంత?
1) 5% 2)10% 3) 50% 4) 1%
24. ఎమల్షన్ (Emulsion) అనేది ఏ రకానికి చెందిన కొల్లాయిడ్ ద్రావణం?
1) ఘన పదార్థంలో ద్రవ పదార్థం 2) ద్రవ పదార్థంలో ఘన పదార్థం
3) ద్రవ పదార్థంలో వాయు పదార్థం 4) ద్రవ పదార్థంలో ద్రవ పదార్థం
25. ‘జెల్’ కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ?
1) మేఘం 2) జున్ను 3) జెల్లీ 4) 2, 3
26. పాలలో విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం ఏది?
విక్షిప్త ప్రావస్థ | విక్షేపణ యానకం | |
1) | నీరు | ద్రవ కొవ్వు |
2) | ద్రవ కొవ్వు | నీరు |
3) | నీరు | స్టార్చ్ కణాలు |
4) | స్టార్చ్ కణాలు | నీరు |
27. ఏరోసోల్ కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ?
1) మేఘం 2) పొగ 3) 1, 2 4) సబ్బు నురగ
28. ద్రవప్రియ కొల్లాయిడ్కు ఉదాహరణ?
1) స్టార్చ్ ద్రావణం 2) లోహ కొల్లాయిడ్ ద్రావణం 3) జిగురు 4) 1, 2
29. ద్రవప్రియ కొల్లాయిడ్ల పరిరక్షణ సామర్థ్యాన్ని పరిమాణాత్మకంగా దేనితో కొలుస్తారు?
1) అవగాడ్రో సంఖ్య 2) గోల్డ్ సంఖ్య 3) రెనాల్డ్స్ సంఖ్య 4)పైవేవీకావు
30. కొల్లాయిడ్ గోల్డ్ సంఖ్య పరిమాణం పెరిగితే దాని పరిరక్షక సామర్థ్యం ......
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) తగ్గి, పెరుగుతుంది
31. స్కందనం అంటే ఏమిటి?
1) కొల్లాయిడ్ ద్రావణాలు అవక్షేపణం చెందడం
2) అవలంబనాలు కొల్లాయిడ్ ద్రావణాలుగా మారడం
3) కొల్లాయిడ్ ద్రావణాలు నిజ ద్రావణాలుగా మారడం
4)నిజ ద్రావణాలు కొల్లాయిడ్ ద్రావణాలుగా మారడం
32. పెప్టీకరణం అంటే.....
1)కొల్లాయిడ్ ద్రావణం అవక్షేపంగా మారే ప్రక్రియ.
2) అవక్షేపం కొల్లాయిడ్ ద్రావణంగా మారే ప్రక్రియ.
3) కొల్లాయిడ్ ద్రావణం నిజ ద్రావణంగా మారే ప్రక్రియ.
4) నిజ ద్రావణం అవక్షేపంగా మారే ప్రక్రియ
33. కింది వాటిలో సరికానిది ఏది?
సమాధానాలు
1-3, 2-4, 3-2, 4-3, 5-2, 6-1, 7-3, 8-1, 9-4, 10-3, 11-4, 12-1, 13-2, 14-4, 15-1, 16-2, 17-2, 18-4, 19-3, 20-3, 21-4,
22-4, 23-2, 24-4, 25-4, 26-2, 27-3, 28-4, 29-2, 30-2, 31-1, 32-2, 33-4.
మరికొన్ని...
1. ఏరోసోల్ అనే కొల్లాయిడ్ ద్రావణంలో విక్షేపణ యానకం ఏది?
1) ద్రవ పదార్థం 2) ఘన పదార్థం 3) వాయు పదార్థం 4) 2, 3
2. ఒక లీటర్ ద్రావణంలోని ద్రావిత మోల్ సంఖ్యను ఏమంటారు?
1) నార్మాలిటీ 2) మొలారిటీ 3) ఫార్మాలిటీ 4) మొలాలిటీ
3. ద్రావిత మోల్ సంఖ్య = ..........
4. మొలాలిటీ అంటే .....
1) ఒక కిలోగ్రామ్ ద్రావణిలోని ద్రావిత మోల్ సంఖ్య
2) ఒక లీటర్ ద్రావణిలోని ద్రావిత మోల్ సంఖ్య
3) ఒక కిలోగ్రామ్ ద్రావణంలోని ద్రావిత మోల్ సంఖ్య
4) ఒక లీటర్ ద్రావణంలోని ద్రావిత మోల్ సంఖ్య
5. కింది వాటిలో మొలారిటీ ప్రమాణం ఏది?
1) మోల్/లీటర్ 2) మోల్/కి.గ్రా 3) మోల్/కి.మీ 4) ప్రమాణం లేదు
6. ద్రావితం మోల్ భాగం+ద్రావణి మోల్ భాగం = ......
1) 1 2) 100 3) 1/2 4) 50
7. కింది వాటిలో ఆదర్శ ద్రావణానికి ఉదాహరణ ఏమిటి?
1) హెక్సేన్ + మిథైల్ ఆల్కహల్ 2) నీరు + బెంజీన్
3) నీరు +మిథైల్ ఆల్కహల్ 4) బెంజీన్ + టోలీన్
8. 1 ppm= ..........

సమాధానాలు
1-3 2-2 3-2 4-1 5-1 6-1 7-4 8-1.