• facebook
  • whatsapp
  • telegram

వృత్తం

ఒక స్థిరబిందువుకు సమాన దూరంలో ఉన్న బిందువులను కలిపితే ఏర్పడే సంవృతపటాన్ని వృత్తం అంటారు. ఆ స్థిరబిందువును వృత్తకేంద్రం అంటారు.


వృత్తవ్యాసార్ధం (r) : వృత్తకేంద్రం నుంచి వృత్తంపై ఉన్న బిందువుల మధ్య దూరాన్ని ఆ వృత్తవ్యాసార్ధం అంటారు. దీన్ని r తో సూచిస్తారు.

జ్యా(Chord): వృత్తంపై ఏవైనా బిందువులను కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని జ్యా అంటారు.

ఒక వృత్తానికి అనేక జ్యాలను గీయొచ్చు. జ్యాలన్నీ అసమానాలే.


1. రెండు వృత్తాల వ్యాసార్ధాల నిష్పత్తి 4 : 7 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత?

1)4 : 7        2) 7 : 4       3) 16 : 49       4) 49 : 16

సాధన: రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి వాటి వ్యాసార్ధాల వర్గాల నిష్పత్తికి సమానం.

A1 : A2 = r12 : r2

= 42 : 72 = 16 : 49

సమాధానం: 16 : 49

2. వృత్త వ్యాసార్ధాన్ని 12% పెంచితే, దాని పరిధిలో పెరుగుదల శాతం ఎంత?

1) 6%    2) 12%     3) 18%    4) 24% 

సాధన: వృత్తవ్యాసార్ధంలో పెరుగుదల x% ఉంటే, దాని పరిధిలో పెరుగుదల కూడా x% ఉంటుంది.

లెక్క ప్రకారం, వ్యాసార్ధంలో పెరుగుదల = 12% 

పరిధిలో పెరుగుదల = 12%

సమాధానం: 12%

3. ఒక వృత్తవ్యాసార్ధాన్ని 15% పెంచితే, దాని వైశాల్యంలో పెరుగుదల శాతం?

1) 32 1/4 %    2) 30%       3) 321/2 %     4)  32 3/4 % 

సాధన: వృత్తవ్యాసార్ధంలో పెరుగుదల(x %) = 15%

ఆ వృత్త వైశాల్యంలో పెరుగుదల 

సమాధానం: 32 1/4 %

4. ఒక వృత్తవ్యాసార్ధాన్ని 20% తగ్గిస్తే, దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత?

1) 20%     2) 40%    3) 44%     4) 36%


సాధన: వృత్తవ్యాసార్ధంలో తగ్గుదల( x %) = 20%

ఆ వృత్త వైశాల్యంలో తగ్గుదల

సమాధానం: 36%

5. ఒక గడియారంలో సెకన్ల ముల్లు పొడవు 10.5 సెం.మీ. ఆ సెకన్ల ముల్లు కొన గంట వ్యవధిలో ప్రయాణించే దూరం ఎంత? (మీ.లలో)

1) 45.6      2) 43.8     3) 39.6      4) 36.8

సాధన: ఒక గడియారంలో సెకన్ల ముల్లు పొడవు (r) = 10.5 సెం.మీ.

సెకన్ల ముల్లు కొన ఒక నిమిషంలో  ప్రయాణించే దూరం = వృత్తపరిధి = 2πr


     

గంట వ్యవధిలో సెకన్ల ముల్లు కొన ప్రయాణించే దూరం = 60 X 66 సెం.మీ.  = 3960 సెం.మీ.

సమాధానం: 39.6

6. ఒక వాహన చక్రం 28 సెం.మీ. వ్యాసంతో ఉంది. 22 కి.మీ. దూరం ప్రయాణించడానికి ఆ చక్రం చేయాల్సిన భ్రమణాల సంఖ్య ....

1) 15000    2) 25000    3) 30000     4) 35000

సాధన: వాహన చక్ర వ్యాసం (d) = 28 సెం.మీ.

వాహన చక్రం 1 భ్రమణంలో ప్రయాణించే దూరం = 2πr


22 కి.మీ. దూరం ప్రయాణించడానికి ఆ వాహన చక్రం చేసే భ్రమణాల సంఖ్య 

= 25000 

సమాధానం: 25000


7. చేతి గాజును నేలపై దొర్లించినప్పుడు, 10 భ్రమణాల్లో అది ప్రయాణించిన దూరం 5.5 మీ. అయితే ఆ గాజు వ్యాసం ఎంత? (సెం.మీ.లలో)

సాధన: 10 భ్రమణాల్లో చేతి గాజు ప్రయాణించిన దూరం = 5.5 మీ.

1 భ్రమణంలో గాజు ప్రయాణించిన దూరం

 = 55 సెం.మీ.

సమాధానం: 1


 

8. వృత్త వ్యాసార్ధాన్ని 1 సెం.మీ. పెంచితే, దాని వైశాల్యం 22 చ.సెం.మీ. పెరిగింది. అయితే ఆ వృత్త వ్యాసార్ధం ఎంత? (సెం.మీ.లలో)

1) 2    2) 3    3) 4    4) 6

సాధన: వృత్త వ్యాసార్ధం = r అనుకోండి

π (r + 1)2 − πr 2 = 22

⇒ π [(r + 1)2 − r 2 ] = 22 

⇒ π [r 2 + 2r + 1 − r 2 ] = 22 

⇒ π (2r + 1) = 22

సమాధానం: 2 (3)

9. రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 4 : 5 అయితే వాటి వ్యాసార్ధాల నిష్పత్తి ఎంత?

సాధన: రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 

  = A1 : A2 = 4 : 5

ఆ రెండు వృత్తాల వ్యాసార్ధాల నిష్పత్తి 

సమాధానం: 2

10. ఒక వృత్తాకార పార్క్‌ వైశాల్యం 2464 చ.మీ. హరి పార్క్‌ వ్యాసం వెంట 10 సార్లు నడిచాడు. అయితే హరి నడిచిన మొత్తం దూరం ఎంత? (మీ.లలో)

1) 280     2) 360     3) 480     4) 560

సాధన: పార్క్‌ వైశాల్యం = 2464 చ.మీ.

⇒ πr 2 = 2464

వ్యాసం (d) = 2r = 2 × 28 = 56 మీ.

హరి పార్క్‌లో వ్యాసం వెంట ఒకసారి నడిచిన దూరం = 56 మీ.

10 సార్లు నడిచిన దూరం = 10 X 56 = 560 మీ.

సమాధానం: 560

11. A ఒక వృత్తవైశాల్యం, r ఆ వృత్త వ్యాసార్ధం C దాని పరిధి. అయితే కిందివాటిలో ఏది సత్యం?


        

సాధన: వృత్త వ్యాసార్ధం = r అనుకోండి.

వృత్తపరిధి: C = 2πr

వృత్త వైశాల్యం: A = πr 2

rC = r × 2πr = 2πr2

                      = 2A

∴ rC = 2A

సమాధానం: rC = 2A

12. ఒక వృత్త పరిధి30/π యూ. అయితే ఆ వృత్త వ్యాసం ఎంత?

​​​​​​​


సాధన: వృత్త వ్యాసార్ధం = r అనుకోండి.

వ్యాసం (d) = 2r

వృత్త పరిధి (C) = 2πr

సమాధానం: 4

13. ఒక వృత్తవ్యాసార్ధం 1.75 సెం.మీ. అయితే ఆ వృత్త పరిధి ఎంత? (సెం.మీ.లలో)

1) 10.75      2) 11       3) 11.25     4) 11.5

సాధన: r = 1.75 సెం.మీ.

 


= 11 సెం.మీ.     

సమాధానం: 11

14. ఒక క్రీడా మైదానం 35 మీ. వ్యాసార్ధంతో వృత్తాకారంలో ఉంది. అయితే ఆ క్రీడా మైదానం వైశాల్యం ఎంత? (చ.మీ.లలో)

1) 3850    2) 3450    3) 4250    4) 4050

సాధన: r = 35 మీ.

క్రీడా మైదాన వైశాల్యం (A) = πr 2

సమాధానం: 3850 

15. ఒక వృత్తపరిధి 44 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)

1) 124    2) 134      3) 144       4) 154

సమాధానం: 154

16. రెండు వృత్తాల వ్యాసార్ధాల నిష్పత్తి 7 : 8. అయితే వాటి పరిధుల నిష్పత్తి ఎంత?

 1) 7 : 8    2) 8 : 7      3) 3 : 4      4) 4 : 3

సాధన: రెండు వృత్త పరిధుల నిష్పత్తి వాటి వ్యాసార్ధాల నిష్పత్తికి సమానం.

C1 : C2 = r1 : r2

 = 7 : 8  

సమాధానం: 7 : 8

Posted Date : 28-04-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు