• facebook
  • whatsapp
  • telegram

రసాయనిక ఇంధనాలు

1. కింది వాటిలో సరైంది?

ఎ) తరిగిపోయే శక్తి వనరులను ఒకసారి వినియోగించిన తర్వాత తిరిగి భర్తీ చేయలేం.

బి) తరగని శక్తి వనరులను ఎన్నిసార్లు వినియోగించినా సహజంగానే తిరిగి భర్తీ అవుతాయి.

1) ఎ  మాత్రమే     2) బి మాత్రమే    3) ఎ, బి        4) పైవేవీ కావు

జ: ఎ, బి

2. కింది వాటిలో తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ?

1) బొగ్గు        2) పవన శక్తి    3) సౌరశక్తి    4) పైవన్నీ

జ:బొగ్గు 

3. తరగని శక్తి వనరులకు ఉదాహరణ?

1) పవన శక్తి      2) సౌరశక్తి    3) జలవిద్యుచ్ఛక్తి     4) పైవన్నీ

జ: పైవన్నీ


4. కింది వాటిలో సరికాని జత?

1) కలప - తరిగిపోయే శక్తి వనరు    2) పెట్రోలియం - తరగని శక్తి వనరు

3) సముద్ర అలల శక్తి - తరగని శక్తి వనరు     4) సహజవాయువు - తరిగిపోయే శక్తి వనరు

జ: పెట్రోలియం - తరగని శక్తి వనరు


5. కింది వాటిలో హరిత ఇంధనాలు ఏవి?

1) కలప        2) పవన శక్తి     3) సౌరశక్తి       4) 2, 3

జ: 2, 3


6. కింది అంశాల్లో సరైంది?

ఎ) శక్తిని  అందించే పదార్థాలను శక్తి వనరులు లేదా ఇంధన వనరులు అంటారు

బి) తరిగిపోయే శక్తి వనరుల వినియోగం కాలుష్యానికి దారి తీస్తుంది.

సి) తరగని శక్తి వనరుల వినియోగంతో ఎలాంటి కాలుష్యం ఏర్పడదు.

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, సి        4) పైవన్నీ

జ: పైవన్నీ

7. వంట చెరుకును కాల్చగా వచ్చే బొగ్గును ఏమంటారు?

1) నేలబొగ్గు    2) కట్టెబొగ్గు    3) 1, 2         4) కోక్‌

జ: కట్టెబొగ్గు


8. నల్లబంగారం అని దేన్ని పిలుస్తారు?

1) నీరు        2) నేలబొగ్గు    3) సహజవాయువు    4) పైవేవీ కావు

జ:నేలబొగ్గు

9. కింది వాటిలో నేల బొగ్గులోని రకం?

1) లిగ్నైట్‌    2) బిట్యుమినస్‌    3) ఆంథ్రసైట్‌    4) పైవన్నీ

జ: పైవన్నీ


10. కింది ప్రశ్నలో ? స్థానాన్ని భర్తీ చేయండి.

పీట్‌ → లిగ్నైట్‌ → బిట్యుమినస్‌ → ?

1) ఆంథ్రసైట్‌      2) కోక్‌        3) గ్రాఫైట్‌     4) గ్రాఫిన్‌

జ:ఆంథ్రసైట్‌

11. 60 - 70 శాతం వరకు కార్బన్‌ కలిగిన నేలబొగ్గు రకం?

1) పీట్‌        2) ఆంథ్రసైట్‌ బొగ్గు    3) లిగ్నైట్‌ బొగ్గు     4) బిట్యుమినస్‌ బొగ్గు

జ: లిగ్నైట్‌ బొగ్గు 

12. కింది వాటిలో రెండో అత్యధిక నాణ్యత కలిగిన బొగ్గు రకం?

1) లిగ్నైట్‌    2) బిట్యుమినస్‌     3) ఆంథ్రసైట్‌      4) పీట్‌

జ: బిట్యుమినస్‌


13. అత్యధిక శక్తిని విడుదల చేసే బొగ్గు రకం?

1) ఆంథ్రసైట్‌       2) బిట్యుమినస్‌     3) లిగ్నైట్‌     4) పైవన్నీ

జ: ఆంథ్రసైట్‌ 


14. కింది వాటిలో అత్యధిక నాణ్యత కలిగిన నల్లబొగ్గు?

1) బిట్యుమినస్‌    2) పీట్‌        3) లిగ్నైట్‌    4) ఆంథ్రసైట్‌

జ: ఆంథ్రసైట్‌


15. బొగ్గును నిర్వాత స్వేదనం చేయగా వచ్చే ఫలితం?

1) సహజవాయువు      2) కోక్‌       3) వంటగ్యాస్‌    4) పైవేవీ కావు

జ:  కోక్‌ 


16. కింది వాటిలో అత్యధిక కెలోరిఫిక్‌ విలువ కలిగిన ఇంధనం?

1) పెట్రోల్‌      2) హైడ్రోజన్‌     3) సహజవాయువు      4) బొగ్గు

జ: హైడ్రోజన్‌ 


17. కోక్‌ వల్ల ఉపయోగం ఏమిటి?

1) ఇంధనంగా ఉపయోగపడుతుంది.     2) క్షయకరణిగా పనిచేస్తుంది    

3) ఆక్సీకరణిగా పనిచేస్తుంది       4) 1, 2

జ: 1, 2

18. కింది వాటిలో సంప్రదాయ ఇంధన వనరుకు ఉదాహరణ?

1) బొగ్గు        2) పెట్రోల్‌     3) కలప        4) పైవన్నీ

జ: పైవన్నీ

19. అసంప్రదాయ ఇంధన వనరుకు ఉదాహరణ?

1) వాయుశక్తి    2) సౌరశక్తి     3) భూగర్భోష్ణ శక్తి    4) పైవన్నీ

జ: పైవన్నీ


20. కింది అంశాల్లో సరైంది?

ఎ) వృక్ష, జంతుజలాలు అధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద గాలి లేనిచోట బొగ్గుగా మారే ప్రక్రియను ‘కార్బోనిఫికేషన్‌’ అని అంటారు.

బి) నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను ‘శిలాజ ఇంధనాలు’ అంటారు.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే     3) 1, 2     4) పైవేవీ కావు

జ: 1, 2


21. ముడిచమురులోని (పెట్రోలియం) వివిధ అనుఘటకాలను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు?

1) అంశిక స్వేదనం      2) స్వేదనం     3) పెప్టీకరణం      4) ఉత్పతనం

జ:  అంశిక స్వేదనం


22. ముడిచమురు నుంచి ఏ ఉత్పన్నాలను పొందవచ్చు?

1) పెట్రోల్, కిరోసిన్‌     2) డీజిల్, పెట్రోలియం గ్యాస్, తారు    3) కందెనలు, పారాఫిన్‌ మైనం    4) పైవన్నీ

జ: పైవన్నీ


23. సహజవాయువులోని ప్రధాన హైడ్రోకార్బన్‌?

1) మీథేన్‌     2) బ్యూటేన్‌        3) ప్రోపేన్‌    4) హెక్సేన్‌

జ: మీథేన్‌ 

24. కింది వాటిలో సరైంది?

ఎ) సంపీడిత  సహజవాయువును (CNG) వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు.

బి) ద్రవీకృత పెట్రోలియం వాయువును (Liquified Petroleum Gas, LPG) వంటగ్యాస్‌గా ఉపయోగిస్తారు.

1) ఎ మాత్రమే      2) బి మాత్రమే    3) 1, 2     4) పైవేవీ కావు

జ:  1, 2


25. LPG లోని ప్రధాన హైడ్రోకార్బన్‌?

1) బ్యూటేన్‌    2) ప్రోపేన్‌    3) 1, 2        4) హెక్సేన్‌

జ: 1, 2 

26. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా పొందే ఉపయుక్తమైన పదార్థాలు ఏవి?

1) కోక్‌        2) కోల్‌గ్యాస్‌    3) కోల్‌తారు      4) పైవన్నీ

జ: పైవన్నీ


27. కోల్‌తారుకు సంబంధించి సరైంది?

ఎ) కోల్‌తారు దుర్వాసనతో కూడిన నల్లటి చిక్కటి ద్రవం.

బి) ఇది దాదాపు 200 రకాల కర్బన పదార్థాల మిశ్రమం.

సి) దీని ఉత్పత్తులను పరిమళ ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ప్లాస్టిక్, పెయింట్‌ తయారీలో ముడిపదార్థాలుగా వాడతారు

డి) పైవన్నీ

1) ఎ, బి        2) బి, సి    3) ఎ, సి        4) పైవన్నీ

జ: పైవన్నీ


28. కింది వాటిలో LPG కి సంబంధించి సరైంది?

ఎ) LPGలోని  హైడ్రోకార్బన్‌ వాయువుల మిశ్రమం వాసన లేనిది.

బి) LPG లీకేజీని గుర్తించేందుకు వాసన కలిగిన ఇథైల్‌ మెర్కాప్టాన్‌ అనే ద్రవ రసాయన పదార్థాన్ని కలుపుతారు.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే    3) 1, 2     4) పైవేవీ కావు

జ: 1, 2


29. బొగ్గు వాయువు (కోల్‌గ్యాస్‌) ఏ వాయువుల మిశ్రమం?

1) హైడ్రోజన్‌ + మీథేన్‌ + కార్బన్‌మోనాక్సైడ్‌     2) ఆక్సిజన్‌ ్ఘ మీథేన్‌ + నైట్రోజన్‌

3) హైడ్రోజన్‌ + కార్బన్‌డైఆక్సైడ్‌ + ఆక్సిజన్‌     4) నైట్రోజన్‌ + కార్బన్‌మోనాక్సైడ్‌ + మీథేన్‌

జ: హైడ్రోజన్‌ + మీథేన్‌ + కార్బన్‌మోనాక్సైడ్‌


30. కింది వాటిలో గోబర్‌గ్యాస్‌లోని ప్రధాన వాయువు?

1) హెక్సేన్‌      2) మీథేన్‌     3) హైడ్రోజన్‌     4) పెంటేన్‌

జ:హెక్సేన్‌


31. ఏ పద్ధతిలో సూర్యకాంతిని విద్యుచ్ఛక్తిగా మార్చవచ్చు?

1) సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ పద్ధతి    2) సోలార్‌ థర్మల్‌ పద్ధతి

3) ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ పద్ధతి        4) పైవేవీ కావు

జ: సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ పద్ధతి 

32. ఒక కిలోగ్రామ్‌ ఇంధనం పూర్తిగా దహనం చెందినప్పుడు వెలువరించే ఉష్ణశక్తి పరిమాణాన్ని ఏమంటారు?

1) కెలోరిఫిక్‌ విలువ   2) కార్బన్‌ క్రెడిట్‌      3) దక్షత విలువ        4) PH - విలువ

జ: కెలోరిఫిక్‌ విలువ


మరికొన్ని...

1. సౌరపలకలను ఏ అర్ధవాహకపు పదార్థాలతో నిర్మిస్తారు?

1) బోరాన్‌     2) సిలికాన్‌     3) టిన్‌         4) అల్యూమినియం

జ: సిలికాన్‌

2. ఏ పద్ధతి ద్వారా సౌరశక్తిలోని ఉష్ణశక్తిని ఒక బిందువు వద్ద కేంద్రకరించి సోలార్‌ వాటర్‌ హీటర్‌తో నీటిని వేడి చేస్తారు?

1) సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ పద్ధతి     2) సోలార్‌ థర్మల్‌ పద్ధతి     3) ద్రవాభిసరణ పద్ధతి     4) పైవేవీ కావు

జ: సోలార్‌ థర్మల్‌ పద్ధతి 


3. చిత్తడి నేలల నుంచి ప్రధానంగా విడుదలయ్యే ఇంధన వాయువు?

1) హెక్సేన్‌     2) మీథేన్‌     3) గ్యాసోలిన్‌    4) పెంటేన్‌

జ: మీథేన్‌

4. గాలిమరలు గాలిలోని గతిశక్తిని ఏ శక్తిగా మారుస్తాయి?

1) యాంత్రికశక్తి     2) విద్యుచ్ఛక్తి    3) ఉష్ణశక్తి      4) అణుశక్తి

జ: యాంత్రికశక్తి


5. జనరేటర్‌ యాంత్రిక శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది?

1) విద్యుచ్ఛక్తి    2) పవనశక్తి    3) గతిశక్తి      4) ధ్వనిశక్తి

జ: విద్యుచ్ఛక్తి


6. ట్రాన్స్‌-ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా నూనెల నుంచి తయారు చేసే ఇంధనాన్ని ఏమంటారు?

1) బయోడీజిల్‌      2) వెనిగర్‌     3) వనస్పతి       4) పైవేవీ కావు

జ: బయోడీజిల్‌


7. తీపి మొక్కజొన్న, గడ్డి, చెరకు నుంచి సేకరించిన గ్లూకోజ్‌ను కిణ్వ ప్రక్రియకు గురిచేసి తయారుచేసే ఆల్కహాల్‌ను ఏమంటారు?

1) బయో డీజిల్‌     2) బయో ఇథనాల్‌      3) గ్యాసోలిన్‌      4) పైవేవీ కావు

జ: బయో ఇథనాల్‌


8. కింది వాటిలో గ్యాసోహాల్‌ (Gasohol) వేటి మిశ్రమం?

1) పెట్రోల్‌ + డీజిల్‌       2) పెట్రోలియం డీజిల్‌ + ఇథనాల్‌ 

3) పెట్రోల్‌ + ఇథనాల్‌     4) మీథేన్‌ + పెట్రోల్‌

జ: పెట్రోల్‌ + ఇథనాల్‌


9. 90% పెట్రోల్, 10% ఇథనాల్‌ మిశ్రమాన్ని దేనితో సూచిస్తారు?

1) B10       2) E10       3) D10       4) G10

జ: E10

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌