1. 100, 200 మధ్యగల సంఖ్యల్లో 3 గుణిజాల మొత్తం ఎంత?
1) 5000 2) 4950 3) 4980 4) 4900
సాధన: 100, 200 మధ్యగల 3 గుణిజాలు
= 102, 105, 108, ....., 198
102, 105, 108, ..., 198లు అంకశ్రేఢిలో ఉన్నాయి.
a = 102, d = 105 - 102 = 3
చివరి పదం (an ) = a + (n − 1)d
⇒ 198 = 102+(n − 1)3
⇒ 198 - 102 = (n − 1)3
సమాధానం: 2
2. ఒక భాగాహారంలో విభాజకం భాగఫలానికి 25 రెట్లు, శేషానికి 5 రెట్లు ఉంది. భాగఫలం 16 అయితే ఆ భాగాహారంలో విభాజ్యం ఎంత?
1) 8460 2) 9260 3) 6480 4) 7280
సాధన: భాగఫలం = 16
విభాజకం = భాగఫలానికి 25 రెట్లు
= 25 × 16 = 400
విభాజకం = శేషానికి 5 రెట్లు
400 = 5 × శేషం
విభాజ్యం = విభాజకం × భాగఫలం+శేషం
= 400 × 16 + 80
= 6400 + 80 = 6480
సమాధానం: 3
సమాధానం: 4
4. ఒక సంఖ్య, 71ల లబ్ధానికి 47 కూడితే వచ్చిన మొత్తాన్ని 7తో భాగించగా భాగఫలం 98 వచ్చింది. అయితే ఆ సంఖ్య ఘనం ఎంత?
1) 729 2) 512 3) 343 4) 243
సాధన: ఒక సంఖ్య = x అనుకోండి
సమాధానం: 1
5. ఒక తోటలో 11136 మొక్కలను కొన్ని అడ్డు, నిలువు వరుసల్లో నాటాలని నిర్ణయించారు. వాటిని వరుసకు ఎన్ని మొక్కలున్నాయో, అన్ని వరుసలు ఉండే విధంగా నాటగా 111 మొక్కలు మిగిలాయి. అయితే ఆ తోటలో ఎన్ని వరుసల్లో మొక్కలు నాటారు?
1) 105 2) 104 3) 106 4) 109
సాధన: తోటలోని వరుసల సంఖ్య = x అనుకోండి
వరుసలోని మొక్కల సంఖ్య = x
మొత్తం నాటిన మొక్కల సంఖ్య = x × x = x2
మొత్తం మొక్కల సంఖ్య = నాటిన మొక్కల సంఖ్య + 111
11136 = x2 + 111
x2 = 11136 - 111 = 11025
x = √ 11025 = 105
సమాధానం: 1
6. రెండు సంఖ్యలు 3 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి గ.సా.భా, క.సా.గుల లబ్ధం 2028. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత?
1) 68 2) 72 3) 86 4) 91
సాధన: రెండు సంఖ్యల నిష్పత్తి = 3 : 4
మొదటి సంఖ్య = 3x అనుకోండి
రెండో సంఖ్య = 4x అనుకోండి
3x, 4x ల గ.సా.భా =x
3x, 4x ల క.సా.గు = 12x
దత్తాంశం ప్రకారం, రెండు సంఖ్యల గ.సా.భా, క.సా.గు లబ్ధం = 2028
గ.సా.భా × క.సా.గు = 2028
x × 12x = 2028
12x2 = 2028

ఆ సంఖ్యలు3x = 3 ×13 = 39
4x = 4 × 13 = 52
ఆ సంఖ్యల మొత్తం = 39+ 52 = 91
సమాధానం: 4
7. ఏ కనిష్ఠ సంఖ్యను 18, 27, 36 తో భాగిస్తే శేషాలు వరుసగా 5, 14, 23 వస్తాయి?
1) 196 2) 96 3) 95 4) 195
సాధన: 18, 27, 36లతో నిశ్శేషంగా భాగించగలిగే కనిష్ఠ సంఖ్య
= 18, 27, 36ల క.సా.గు
= 2 × 3 × 3 × 3 × 2 = 108
కావాల్సిన సంఖ్య
= 18, 27, 36 ల క.సా.గు-k
(k = 18 - 5 = 13, 27 -14 = 13, (లేదా) 36 - 23 = 13)
= 108 13 = 95
సమాధానం: 3
8. ఒక పర్సులో 20 పైసలు, 25 పైసల నాణేలన్నీ కలిపి మొత్తం 50 ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ. 11. అయితే ఆ పర్సులోని 25 పైసల నాణేల సంఖ్య ఎంత?
1) 20 2) 25 3) 30 4) 15
సాధన: పర్సులోని 25 పైసల నాణేల సంఖ్య = x అనుకోండి.
20 పైసల నాణేల సంఖ్య = (50-x) పర్సులోని నాణేల మొత్తం విలువ = 11 రూ.
25 × xపై + 20x (50 - x)పై = 1100 పై
25x + 1000 - 20x = 1100
5x = 1100 − 1000 = 100
సమాధానం: 1
9. ఒక మూడంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానంలోని అంకెకు రెట్టింపు ఉంది. ఆ అంకెల మొత్తం 18. ఆ సంఖ్యల్లో అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య అసలు సంఖ్య కంటే 396 తక్కువ. అయితే ఆ సంఖ్యలో వందల స్థానంలోని అంకెకు, పదుల స్థానంలోని అంకెకు గల భేదం ఎంత?
1) 4 2) 3 3) 2 4) 1
సాధన: ఒక మూడంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె = x అనుకోండి.
వందల స్థానంలోని అంకె = 2x
పదుల స్థానంలో అంకె = y అనుకోండి.
ఆ మూడంకెల సంఖ్య
= 100 (2x) + 10(y) + 1(x)
= 201x + 10y ........(1)
ఆ అంకెల మొత్తం =2x + y + x = 18
3x + y = 18 .... (2)
అంకెలను తారుమారు చేయగా ఆ సంఖ్య
= 100 (x) + 10 (y) + 1 (2x)
= 102x + 10y ........ (3)
సమస్య ప్రకారం,(1) − (3) = 396
201x + 10y − (102x + 10y) = 396
99x = 396

x = 4 ని (2) లో ప్రతిక్షేపించగా
3x + y = 18 ⇒ 3s4) + y = 18
y = 18 − 12 = 6
x = 4, y = 6, 2x = 8
వందల స్థానంలోని అంకెకు, పదుల స్థానంలోని అంకెకు గల భేదం
= 2x − y = 8 − 6 = 2
సమాధానం: 3
10. ఒక సంఖ్యను 0.72 తో గుణించమనగా ఒక విద్యార్థి పొరపాటున 7.2తో గుణిస్తే సరైన సమాధానం కంటే 5184 ఎక్కువ వచ్చింది. అయితే ఆ సంఖ్య ఎంత?
1) 200 2) 400 3) 600 4) 800
సాధన: కావాల్సిన సంఖ్య = x అనుకోండి.
సమస్య ప్రకారం, 7.2x − 0.72x = 5184
6.48x = 5184
సమాధానం: 4
అభ్యాస ప్రశ్నలు
1. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం.....
1) 3030 2) 4040 3) 5050 4) 6060
2.(632)60 లో ఒకట్ల స్థానంలోని అంకె....
1) 2 2) 4 3) 8 4) 6
3. నాలుగు వరుస సరి సంఖ్యల మొత్తం 108. అయితే ఆ సంఖ్యల్లో గరిష్ఠ, కనిష్ఠ సంఖ్యల లబ్ధం....
1) 720 2) 718 3) 716 4) 736
4. 10, 50ల మధ్యగల ప్రధానాంకాల్లో, వాటిలోని అంకెల స్థానాలను మార్చినప్పటికీ ప్రధానాంకాలయ్యేటట్లుగా ఉన్న వాటి సంఖ్య....
1) 3 2) 4 3) 5 4) 6
5. ఒక సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఘాతరూపంలో 23 ´ 35 ´ 44గా రాస్తే ఆ సంఖ్యకు గల కారణాంకాలు ఎన్ని?
1) 90 2) 120 3) 150 4) 60
సమాధానాలు
1-3 2-4 3-1 4-3 5-2
* 25 లోపు ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత?
1) 90 2) 100 3) 110 4) 123
సాధన: 25 లోపు ప్రధాన సంఖ్యల మొత్తం = = 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 = 100
జవాబు 2
* 100లోపు ఉన్న ప్రధాన సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో 3 గల ప్రధాన సంఖ్యలు ఎన్ని?
1) 8 2) 7 3) 6 4) 5
సాధన: ఒకట్ల స్థానంలో 3గల 100లోపు ప్రధాన సంఖ్యలు = 3, 13, 23, 43, 53, 73, 83
మొత్తం సంఖ్యలు = 7
జవాబు - 2
* 5824* అనే సంఖ్యను 11తో నిశ్శేషంగా భాగించగలిగితే * స్థానంలో ఉండాల్సిన అంకె?
1) 2 2) 3 3) 5 4) 6
సాధన: బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం = 0 (లేదా) 11 గుణిజం
(5 + 2 + * ) - (8 + 4) = 0 = 0 (లేదా) 11 గుణిజం
* = 5
జవాబు 3