• facebook
  • whatsapp
  • telegram

ఘాతాంకాలు

సంక్లిష్ట సంఖ్యలకు సరళ రూపం!


చంద్రుడి దూరం, కాంతి వేగం, కంప్యూటర్‌ మెమొరీ తదితరాలను చెప్పాలంటే పెద్ద పెద్ద సంఖ్యలను ఉపయోగించాల్సి వస్తుంది. అవి పలకడానికి కూడా కష్టంగా అనిపిస్తాయి. అందుకే అలాంటి వాటిని సులభంగా వ్యక్తీకరించడానికి గణితంలో ఒక మార్గం ఉంది. ఒక సంఖ్యను అదే సంఖ్యతో ఎన్నిసార్లు గుణిస్తే అవసరమైన సంఖ్య వస్తుందో గుర్తిస్తారు. ఆ సంఖ్యను మూలంగా, పునరావృతాల అంకె లేదా సంఖ్యను ఘాతాంకంగా పరిగణించి, మూలసంఖ్యకు కుడివైపు పైన చిన్నగా ఘాతాంకాన్ని రాస్తారు.  దాని అర్థం మూలసంఖ్యను అదే సంఖ్యతో ఘాతాంక సంఖ్యసార్లు గుణించాలని అర్థం.  


* పెద్ద సంఖ్యలను సరళమైన రీతిలో వ్యక్తపరచడానికి ఉపయోగించే పద్ధతే ఘాతాంక రూపం.


ఉదాహరణ:


1. శూన్యంలో కాంతి వేగం సెకనుకు 30,00,00,000 మీ. = 3 × 108మీ.


2. భూమికి, చంద్రుడికి మధ్య దూరం 384,000,000 మీ. =384 × 106 మీ.

*  సాధారణంగా 'a' ఒక వాస్తవ సంఖ్య, 'n' ఏదో ఒక ధనపూర్ణ సంఖ్య అయితే 

an = a × a × a × ...... a(n సార్లు)


  anలో n  ను ఘాతాంకం,a  ను భూమి/ఆధారం అంటారు. 


ఘాతాంక న్యాయాలు: a, bలు ఏవైనా రెండు శూన్యేతర పూర్ణసంఖ్యలు;m, n  పూర్ణ సంఖ్యలు.


1)   am × an = am + n (ఒకే ఆధారం ఉన్న పదాల గుణకారం) 


2)    (am)n = amn(ఘాతం యొక్క ఘాతాంకం)


3)   am × bm = (ab)m(లబ్ధం యొక్క ఘాతం) 

 


మాదిరి ప్రశ్నలు

1. (20 - 30) X 40 = .......... 

1) 1      2) 0      3) 1      4) 2


వివరణ: a0 =1 (a ≠ 0) 

(20 − 30) × 40 =( 1 − 1) × 1 = 0 × 1 = 0


జ: 2


  

              = x0 = 1
జ: 2

3.  (-1) 2023 = .........

1) -1   2) 1    3) 1   4) 2013 


వివరణ: (-1)సరిసంఖ్య = 1 

(-1)బేసిసంఖ్య = -1 

(−1)2023 = −1

జ: 1



4.   ax-y x ay-z X az-x = ..........

1) a     2) 10    3) 1     4) ax + y + z

వివరణ: ax-y x ay-z X az-x

               a(x − y) + (y − z) + (z − x)

           = ax − y + y − z + z − x

             = a0 = 1

జ: 3




5. m = 3, n = అయితే9m2 - 10n3 = ..........

1) 2      2) 0      3) 1     4) -1 

వివరణ: m = 3, n = 2లను ఇచ్చిన సమాసంలో ప్రతిక్షేపించగా 

9m2 − 10n3 = 9(3)2 − 10(2)3

=- 9 × 9 − 10 × 8

=- 81 − 80 = 1

జ: 3


               


7.    9x + 3 = 27x - 1 అయితే x = ..........

1) 8    2) 7    3) 9    4) ఏదీకాదు 


వివరణ: 9x + 3 = 27x − 1

(32)x + 3 = (33)x − 1

32x + 6 = 33x − 3

2x + 6 = 3x − 3

3x − 2x = 6 + 3

x = 9

జ: 3


8. x = ya, y = zb, z = xc అయితే abc= ..........

1) 4      2) 3      3) 2     4) 1 

వివరణ: x = ya

x = (zb)a ( y = zb)

x = ((xc)b)a (z = xc

x1 = xcba (am = an ⇒ m = n)

1 = abc

జ: 4


9.  ax = by = cz, b2 = ac అయితే y = ..........

ప్రాక్టీస్‌ బిట్లు


1.  m, nలు పూర్ణాంకాలు;mn =121 అయితే(m − 1)n + 1 = .......

 1) 1   2) 10   3) 121   4) 1000


        


5.     ax = by = cz, abc =  అయితేxy + yz + zx = .......

    1) 0   2) 1   3) xyz  4)2xyz

6.     కిందివాటిలో మిక్కిలి పెద్దసంఖ్య?     

 1) 212   2) 38   3) 97   4) 813 



8.  ax = by, a = b2అయితే x, y ల మధ్య సంబంధం 

1) x = y            2) x = 2y 

3) x + y = 0        4) y = 2x

సమాధానాలు: 1-4; 2-2; 3-2; 4-4; 5-1; 6-3; 7-1; 8-4; 9-1; 10-2; 11-3; 12-3; 13-4; 14-3; 15-3.

రచయిత: డి.సీహెచ్‌. రాంబాబు

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌