• facebook
  • whatsapp
  • telegram

సంవర్గమానాలు

సంక్లిష్ట గణనల సరళ వ్యక్తీకరణ! 

నిర్దిష్ట సంఖ్యను పొందేందుకు ఆధార సంఖ్య లేదా స్థిరసంఖ్యను పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించే ఘాతాంకమే సంవర్గమానం. దీనిని ఆధార సంఖ్యకు లాగ్‌గా వ్యక్తీకరిస్తారు. అంటే ఘాతాంకానికి, ఆధార అంకె లేదా సంఖ్యకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే ప్రాథమిక గణిత భావన సంవర్గమానం. ఘాతాంక స్పష్టీకరణకు, ఘాతాంక సమీకరణాలను పరిష్కరించడానికి దీనిని వినియోగిస్తారు. సంక్లిష్ట గణనలను సులభంగా నిర్వహించడానికి వాడతారు. సైన్స్, ఇంజినీరింగ్, గణిత, ఆర్థిక రంగాల్లో పలు అంశాల సరళ విశ్లేషణకు ఇవి అవసరం. పలు రకాల పోటీ పరీక్షల్లో ఈ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు దీనిపై కనీస అవగాహన పెంపొందించుకోవాలి. 


సంవర్గమానం: a, xలు రెండు ధన వాస్తవ సంఖ్యలై a 1 అయినప్పుడు an = x అయ్యేవిధంగా a యొక్క ఆధారానికి x యొక్క సంవర్గమాన విలువను n అంటారు. 

*    ధన వాస్తవ సంఖ్యలకు మాత్రమే సంవర్గమానాలు నిర్వచించవచ్చు.

*    సంవర్గమానాలను జాన్‌ నేపియర్‌ రూపొందించాడు. గుణకారాలకు ‘నేపియర్‌ పట్టిక’లను రూపొందించాడు. దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టాడు. 


ధర్మాలు: ఎ) 1 యొక్క ఏ ఆధారానికైనా సంవర్గమాన విలువ సున్నా. 

బి) ఒక సంఖ్య యొక్క అదే ఆధారానికి సంవర్గమాన విలువ ఒకటి. 

  logaa = 1 


సి) ఒక సంఖ్య యొక్క సంవర్గమానం విభిన్న ఆధారాలకు భిన్నంగా/వేర్వేరుగా ఉంటుంది.

 64 = 82 log864 = 2

64 = 43 ⇒ log464 = 3

64 = 26 ⇒ log264 = 6


సంవర్గమానాలను రెండు ఆధారాలతో సూచిస్తారు. 


  

సంవర్గమాన న్యాయాలు 


 

లాక్షణిక: ఒక సంఖ్య యొక్క సంవర్గమానంలో పూర్ణాంక భాగాన్ని లాక్షణిక అంటారు. 

ఉదా: 1) log 2= 0.3010 

లాక్షణిక = 0

2) log 16 = 1.2040

లాక్షణిక = 1


మాంటిసా (అంశ): ఒక సంఖ్య యొక్క సంవర్గమాన విలువలో దశాంశ భాగాన్ని మాంటిసా అంటారు. 

ఉదా: 1) log 2 = 0.3010

మాంటిసా = .3010

* మాంటిసా ఎల్లప్పుడూ ధనాత్మకం. దీని విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని లెక్కించడానికి సంవర్గమాన పట్టికలు అవసరం.

గమనిక: ఒక సంఖ్యలో - అంకెలు ఉంటే ఆ సంఖ్య సంవర్గమాన లాక్షణిక n − 1. దీని విపర్యం కూడా నిజం. అంటే సంవర్గమాన లాక్షణిక 'n' అయితే ఆ సంఖ్యలో అంకెలు n + 1.

లాక్షణిక    సంఖ్యలో అంకెలు 

     n            n + 1

  n − 1         n


మాదిరి ప్రశ్నలు 

.

1)  2     2)  9       3)  4     4) 27 

= 4(1) = 4 

జ: 3


జ: 1

జ: 2

6.  log(a + b) = log a + log b   అయితే b విలువ ఎంత?


వివరణ: log(a + b) = log a + log b 

log(a + b) = log ab

a + b = ab 

b − ab = −a

b(1 − a) = −a

జ: 2

7.   log(a2 + b2) = log 2 + log a + logb అయితే a, b ల మధ్య సంబంధం  

1) a2 = b      2) a = b2     3) a = b    4) a = 2b

వివరణ: log(a2 + b2) = log 2 + log a + log b

log(a2 + b2) = log 2ab

a2 + b2 = 2ab

a2 + b2 − 2ab = 0

(a − b)2 = 0

a − b = 0

a = b

జ: 3



 

log(1 + x2) = log 2x2

(1 + x2) = 2x2

x2 = 1

x = ±1

జ: 3


10.  x = 1 + logabc , y = 1 + logbca, z = 1 + logcab అయితే xy + yz + zx = 

xy + yz + zx = xyz

జ: 1


11.  2 log(x + 3) = log 81అయితే x = ?

1) 6       2) −12     3) 1, 2    4) ఏదీకాదు

వివరణ: 2 log(x + 3) = log 81

log(x + 3)2 = log 81

(x + 3)2 = 92

x + 3 = ±9

x = 6 లేదా -12


కానీ x = 12 వద్ద log(−12 + 3) = log (−9)  

రుణ విలువలకు సంవర్గమానం వివరించలేం. కాబట్టి x = 6మాత్రమే సమాధానం అవుతుంది.

జ: 1


 

12. log 2 = 0.3010 అయితే 825 లో ఎన్ని అంకెలు ఉంటాయి?

1) 22    2) 23    3) 24    4) 25

వివరణ: log825 = 25 log 8

= 25 log 23

= 75 log 2 

= 75 (0.3010) = 22.5750

లాక్షణిక = 22

అంకెలు =  22 + 1 = 23

జ: 2


13.  log103 = 0.4771 అయితే 340 లో ఉండే అంకెల సంఖ్య

1) 19       2) 21      3) 20      4) 40

వివరణ:  log 340

= 40 log 3

= 40(0.4771) 

= 19.0840

లాక్షణిక = 19

అంకెలు = 19 + 1 = 20

జ: 3

ప్రాక్టీస్‌ ప్రశ్నలు


1. log32x  = 0.8 అయితే x =   

1) 16   2) 10   3) 12   4) 256


1) 2   2) 3   3) 4   4) 5


3.  log 2 = 0.3010 అయితే 264 లో ఉండే అంకెల సంఖ్య

1) 17   2) 18   3) 19   4) 20


4.  log2log2log3log3273 =

1) 0   2) 2   3) 64   4) 512


5.  log10(0.0001) =    

1) 4  2) 1/4   3) −4    4) 0



9.   log 27 = 1.431 అయితే  log 9 =

 1) 0.934     2) 0.945      3) 0.954     4) 0.958

1) a + b = 1   2) a − b = 1   3) a = b   4) a2 − b2 = 1
 

1) 2     2) 8     3) 64     4) 512 


14.  log927 + log832 =

1) 3   2) 25   3) 6  4) 19


సమాధానాలు: 1-1; 2-3; 3-4; 4-1; 5-3; 6-1; 7-1; 8-3; 9-3; 10-1; 11-1; 12-3; 13-4; 14-2; 15-1; 16-2; 17-2.


రచయిత: డి.సీహెచ్‌.రాంబాబు

Posted Date : 23-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌