• facebook
  • whatsapp
  • telegram

నాన్‌ - వెర్బల్‌ శ్రేణులు

చిత్రాలు.. చిహ్నాలు అర్థమైతే మార్కులు!

గాయకులు, సంగీతకారులు కొన్ని రకాల సంకేతాలను ముందు పెట్టుకొని వాటి ప్రకారం రాగ నియమాలను అనుసరించి పాడుతుంటారు, సంగీతం వినిపిస్తుంటారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నప్పుడు, పజిల్స్‌ చేస్తున్నప్పుడు వివిధ నమూనాలను గమనించి, పాటించాల్సి ఉంటుంది.  ఈ విధంగా భాష లేదా సంఖ్యల విలువలు లేకుండానే కొన్ని రకాల బొమ్మలను, చిహ్నాలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడమే నాన్‌-వెర్బల్‌ నైపుణ్యం. అభ్యర్థుల్లో తార్కిక ఆలోచనాశక్తిని, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పోటీ పరీక్షల్లో ఆ విధమైన ప్రశ్నలు అడుగుతుంటారు. దిశలు, కోణాలపై తగిన అవగాహన పెంచుకొని వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే వందశాతం మార్కులను సంపాదించుకోవచ్చు. నిర్దిష్ట నియమాన్ని పాటించే సంఖ్యలు లేదా అక్షరాలు లేదా పటాల సమూహాన్ని శ్రేణి అంటారు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలో భాగంగా మూడు పటాలు ఇస్తారు. ఈ పటాల్లో ఇమిడి ఉన్న నియమాన్ని గుర్తించి ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన నాలుగో పటాన్ని ఆప్షన్ల నుంచి గుర్తించాల్సి ఉంటుంది. దీనికి అభ్యర్థికి సవ్యదిశ, అపసవ్య దిశ, కోణాలు, పటంలోని వివిధ భాగాలపైన తగిన అవగాహన పెంచుకోవాలి.

సమస్య సాధనా పద్ధతులు: ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన పటాన్ని గుర్తించడానికి వివిధ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.

1. భ్రమణ దిశ: 

మొదటి మూడు పటాల్లో ఇచ్చిన మూలకాలు సవ్యదిశ లేదా అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నాయో గుర్తించాలి. 

2. మూలకాల స్థానాలు: 

మొదటి మూడు పటాల్లో ఇచ్చిన వివిధ రకాల మూలకాల స్థానాలు, ఆ తర్వాత పటంలో అవి మార్పు చెందే స్థానాలు, దిశలను గుర్తించాలి.

3. కోణీయ భ్రమణ దిశలు:

మొదటి మూడు పటాల్లోని మూలకాలు సాధారణంగా 450, 900, 1350, 1800, 2250, 2700, 3150, 3600 లాంటి వివిధ కోణాల్లో సవ్యదిశ, అపసవ్య దిశలో తిరిగే స్థానాలను గుర్తించాలి.

4. భిన్న రూప భ్రమణ దిశలు:

మొదటి మూడు పటాల్లోని మూలకాలు సాధారణంగా  అడుగుల్లో సాధారణంగా భ్రమణం చెందుతాయి. వీటి స్థానాలను గుర్తించి ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన పటాన్ని కనుక్కోవాలి.

పై అంశాలతో పాటుగా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలను సాధించే క్రమంలో మరికొన్ని అంశాలపైన కూడా అవగాహన పెంచుకోవాలి.

1) పటంలోని మూలకాల సంఖ్య

2) మూలకాల్లోని భుజాల సంఖ్య

3) పటంలోని మూలకాలు మారే క్రమం

4) పటాల పరిమాణాలు

పటంలోని మూలకాల సంఖ్య

వివరణ: సమస్యా చిత్రంలో మూలకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. వృత్తం త్రిభుజాలు క్రమంగా మారుతూ ఉన్నాయి.

జ: 4

భుజాల సంఖ్య ఆధారంగా

వివరణ: సమస్యా చిత్రంలో భుజాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. తర్వాత పటంలో 5 భుజాలు ఉండాలి. కాబట్టి 

జ: 2

మూలకాలు మారే క్రమం

వివరణ: ప్రతి పటంలో O, X లు సవ్యదిశలో ఒక అడుగు జరుగుతూ ఉన్నాయి కాబట్టి                  

జ: 1

పటాల పరిమాణాలు 

వివరణ: ప్రతి పటంలో కుడివైపు నుంచి ఒక్కో మూలకం షేడ్‌ అవుతుంది. కాబట్టి 

జ: 2


మాదిరి ప్రశ్నలు 


1. కింది పటంలో ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన పటాన్ని పటం ద్వారా గుర్తించండి.

వివరణ: ప్రతి పటం సవ్యదిశలో 900 కోణంతో తిరుగుతుంది. కాబట్టి     

జ: 3


2. 


వివరణ: ప్రతి పటంలో పైన, కింద ఒక అడుగు పెరుగుతుంది. కాబట్టి      

జ: 1


3. 


వివరణ: ప్రతి పటం మధ్యలో మూలకం సవ్యదిశలో 45ా కోణంతో ఒక అడుగు తిరుగుతుంది. మూలలోని మూలకాలు సవ్యదిశలో ఒక అడుగు తిరుగుతుంది. కాబట్టి

జ: 3


4. 

వివరణ: ప్రతి పటంలో చిన్న వృత్తం ఒక రేఖ క్రమంగా పెరుగుతూ ఉంది. కాబట్టి

జ: 1


 

వివరణ:  ప్రతి పటంలో చతురస్రంలో షేడ్‌ చేసిన ప్రాంతం కర్ణమూలంగా మారుతూ ఉంది. పై, కింది మూలకాలు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటున్నాయి. 

జ: 2

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 15-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌