1. ఏ రంగు కాంతి విషయంలో పట్టకం (పదార్థం) వక్రీభవన గుణకం కనిష్ఠం?
జ: ఎరుపు
2. కిందివాటిలో మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచేవి?
ఎ) కుంభాకార కటకం బి) పుటాకార కటకం
సి) కుంభాకార దర్పణం డి) పుటాకార దర్పణం
ఇ) సమతల దర్పణం
జ: బి, సి, ఇ
3. ఎండోస్కోపి, ల్యాప్రోస్కోపి వైద్య విధానంలో ఉపయోగపడే కాంతి ధర్మం ఏది?
జ: సంపూర్ణాంతర పరావర్తనం
4. కిందివాటిలో సరైన కాంతి జనకం - తరంగాగ్రం జత?
ఎ) బిందు జనకం - స్తూపాకార తరంగాగ్రం
బి) బిందు జనకం - గోళాకార తరంగాగ్రం
సి) అనంత దూరంలోని జనకం - సమతల తరంగాగ్రం
డి) పొడిగించిన జనకం - స్తూపాకార తరంగాగ్రం
జ: బి, సి, డి
5. శీతల సముద్ర తీరంలో దూరంగా ఉండే నౌక లూమింగ్ ధర్మం వల్ల ఏ విధంగా కనిపిస్తుంది?
జ: తలకిందులుగా, పైకి
6. వర్ణ విపథనం తొలగించడానికి వాడే కుంభాకార, పుటాకార సంయోగం పాటించే నియమం
జ:
7. న్యూటన్ వలయాలతో ముడిపడిన కాంతి ధర్మం ఏది?
జ: వ్యతికరణం
8. లేజర్ ఉత్పత్తిలోని జనాభా విలోమం వల్ల లేజర్ కాంతికి వచ్చే ప్రత్యేక ధర్మం -
జ: అధిక తీవ్రత
9. హోలోగ్రామ్ విషయంలో సరైంది?
ఎ) 3డి ఫొటోగ్రాఫ్
బి) కాంతి తీవ్రత, దశలు నిక్షిప్తం
సి) కాంతి వ్యతికరణంతో చిత్రీకరించిన చిత్రం
డి) పైవన్నీ
జ: డి ( పైవన్నీ)
10. పెరిస్కోప్‌లో ఏర్పడే ప్రతిబింబ లక్షణం వస్తువు దృష్ట్యా ఏ విధంగా ఉంటుంది?
ఎ) మిథ్యా ప్రతిబింబం
బి) పార్శ్వ విలోమం చెందిన ప్రతిబింబం
సి) పార్శ్వ విలోమం చెందని ప్రతిబింబం
డి) వస్తువు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం
జ: ఎ, సి, డి
11. ఆరోగ్యవంతుడైన మానవుడికి స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత?
జ: 25 సెం.మీ.
12. కిందివాటిని జతపరచండి.
ఫలితం | కారణం |
ఎ) ఇంద్రధనస్సు | i) సంపూర్ణాంతర పరావర్తనం |
బి) ఎండమావి | ii) రుజుమార్గంలో కాంతి ప్రసారం |
సి) గ్రహణాలు | iii) వక్రీభవనం |
డి) నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం | iv) కాంతి విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం |
ఎ బి సి డి
జ: iv i ii iii
13. కాంతి వేగం దేనిలో కనిష్ఠం?
జ: వజ్రం
14. సూర్యకాంతిని పట్టకం ద్వారా పంపితే అది ఏడు రంగులుగా విడిపోయే ధర్మాన్ని ఏమంటారు?
జ: విక్షేపణం
15. సాధారణ మైక్రోస్కోప్ కంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇచ్చే ఆవర్ధనం చాలా ఎక్కువ ఎందుకంటే?
జ: ఎలక్ట్రాన్ ద్రవ్య తరంగం తరంగ దైర్ఘ్యం, కాంతి తరంగ దైర్ఘ్యం కంటే తక్కువ
16. గాజులో అత్యల్ప వేగంతో ప్రయాణించే కాంతిరంగు?
జ: ఊదా రంగు కాంతి
17. వివిధ రంగుల్లో ఉన్న అక్షరాలు ముద్రితమైన కాగితంపై మందమైన గాజు పలకను ఉంచితే ఏ రంగు అక్షరాలు మిగతా వాటితో పోల్చితే తక్కువగా పైకి వచ్చినట్లు కనిపిస్తాయి?
జ: ఎరుపు
18. ‘అస్టిగ్మాటిజం’ అనే దృష్టి దోషంతో బాధపడేవారి కంటి అద్దాల్లో వేటిని అమర్చుతారు?
జ: స్తూపాకార కటకం
19. ధృవణాన్ని ప్రదర్శించే తరంగాలు ఏవి?
జ: కాంతి తరంగాలు
20. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జ: 3 × 108 మీ./సె.
21. నీటిపై తేలే పలుచని చమురు పొర వివిధ రంగుల్లో కనిపించడానికి కారణం?
జ: వ్యతికరణం
22. గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌కు కారణమైన తరంగాలు ఏవి?
జ: పరారుణ తరంగాలు
23. అంతరిక్షంలో ఆకాశం నలుపు రంగులో కనిపించడానికి కారణం?
జ: వాతావరణం లేకపోవడం, కాంతి పరిక్షేపణం చెందకపోవడం
24. కెలిడియోస్కోప్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
జ: పరావర్తనం
25. వాహనాల హెడ్లైట్లలో అమర్చి ఉండే దర్పణం ఏది?
జ: పుటాకార
26. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకం నుంచి 10 సెం.మీ. దూరంలో ఒక పెన్సిల్ని నిటారుగా ఉంచితే దాని ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది?
జ: నిటారైన ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం
27. CD (కాంపాక్ట్ డిస్క్) ని ఎండలో చూస్తే అది వివిధ రంగుల్లో కనిపించడానికి కారణం?
జ: కాంతి వివర్తనం
28. కింది ప్రవచనాల్లో సరికానిది?
జ: కుంభాకార కటక నాభీయ సామర్థ్యం రుణాత్మకం
29. ENT డాక్టర్ తన తలపై అమర్చుకునే పుటాకార దర్పణం కాంతిని ......
జ: రోగిపై కేంద్రీకరిస్తుంది
30. వ్యతికరణంలో చీకటి, వెలుగు పట్టీల వద్ద శక్తి ......
జ: పునర్విభజన చెందుతుంది