• facebook
  • whatsapp
  • telegram

ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు

¤ ICRISAT - ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి ఏరిడ్ ట్రాపిక్స్ - హైదరాబాద్ - పటాన్‌చెరు
* ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - మనీలా (ఫిలిప్పీన్స్)
 

ఐ.సి.ఎ.ఆర్. పరిశోధన సంస్థలు
     ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐ.సి.ఎ.ఆర్.) ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1929లో రాయల్ కమిషన్ మొదట ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్‌ను ఏర్పాటుచేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో దీని పేరు మార్చారు. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ పర్యవేక్షణలో నడిచే స్వతంత్ర సంస్థ. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల వ్యవసాయ పరిశోధనలను చేస్తుంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలు, ఆక్వాకల్చర్, పశుసంపద, వ్యవసాయ సాంకేతికత లాంటి రంగాల్లో పరిశోధనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 45 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను పర్యవేక్షిస్తుంది. దీని ఆధ్వర్యంలో 97 పరిశోధనా సంస్థలు అనేక విషయాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. 
* నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కర్నాల్ (హర్యానా) 
* ఇండియన్ వెటర్నిటి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఇజత్‌నగర్
* సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కటక్ (ఒరిస్సా) 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రిసెర్చ్ - కాన్పూర్
* సెంట్రల్ టుబాకో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - రాజమండ్రి 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రిసెర్చ్ - లక్నో 
* షుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ - కోయంబత్తూర్ 
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రిసెర్చ్ - నాగ్‌పూర్ 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ - బెంగళూరు 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ - వారణాసి 
* సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా 
* సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్ 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్ - కాలికట్ 
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ - భోపాల్ 
* సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ - హైదరాబాద్ 
* సెంట్రల్ ఏరిడ్‌జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జోథ్‌పూర్ 
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - భోపాల్ 
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - లూథియానా 
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ - ముంబయి 
* సెంట్రల్ షీప్ అండ్ ఊల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - అవికానగర్ (రాజస్థాన్)
* సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కొచ్చి 
* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్ - భువనేశ్వర్
* నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ - న్యూఢిల్లీ 
* నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్ - నాగ్‌పూర్ 
* నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ - పుణే 
* నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్రీ - ఝాన్సీ 
* నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ - న్యూఢిల్లీ
* నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ - కర్నాల్ 
* నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ - లక్నో 
* డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ - పెదవేగి (పశ్చిమగోదావరి) 
* డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ - హైదరాబాద్
* డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రిసెర్చ్ - హైదరాబాద్ 
* నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్ 
* డైరెక్టరేట్ ఆఫ్ సోర్గం రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - హైదరాబాద్

ఐ.సి.ఎం.ఆర్. సంస్థలు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్.)ను 1949లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిధులను అందజేస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంటువ్యాధుల నిరోధం, మలేరియా, ఫైలేరియా, శిశుమరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలు. పోషకాహారలోప వ్యాధులు, ఎయిడ్స్‌పై పరిశోధనలు చేస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా 21 శాశ్వత ప్రయోగశాలలు, 6 ప్రాంతీయ పరిశోధనాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.


డి.ఆర్.డి.ఒ. పరిశోధన సంస్థలు
     డిఫెన్స్ డెవలప్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ.) భారతదేశంలో రక్షణ రంగ పరిశోధనలను నిర్వహించే సంస్థ. ఇది భారత రక్షణరంగ అవసరాలను తీర్చే అనేక పరికరాలను, క్షిపణులను, రాడార్లను, యుద్ధట్యాంకులను ఉత్పత్తి చేస్తుంది. సైనికులకు కావలసిన అన్ని ఉత్పత్తులపై ఇది పరిశోధన నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 47 పరిశోధనా, ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి. 
* అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ - హైదరాబాద్
* సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ - బెంగళూరు 
* సెంటర్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ - బెంగళూరు 
* డిఫెన్స్ బయో-ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబోరేటరీ - బెంగళూరు 
* డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ లేబోరేటరీ - డెహ్రాడూన్ 
* డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ లేబోరేటరీ - హైదరాబాద్
* డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లేబోరేటరీ - మైసూర్ 
* డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - పుణే 
* డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లేబోరేటరీ - హైదరాబాద్ 
* డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబోరేటరీ - హైదరాబాద్
 

అణువిద్యుత్ కేంద్రాలు - అవి ఉన్న రాష్ట్రాలు
* తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం     - మహారాష్ట్ర 
* కైగా అణు విద్యుత్ కేంద్రం              - కర్ణాటక 
* నరోరా అణువిద్యుత్ కేంద్రం            - ఉత్తరప్రదేశ్ 
* కాక్రపార్ అణువిద్యుత్ కేంద్రం          - గుజరాత్ 
* కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం    - తమిళనాడు

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌