• facebook
  • whatsapp
  • telegram

మహాజనపదాలు

శూరసేన

దీని రాజధాని మధురానగరం. ఇది యమునా నది తీరంలో ఉంది.

దీని రాజు అవంతి పుత్రుడు. ఇతడు బుద్ధుడి ప్రథమ శిష్యుల్లో ఒకడు.

యదువంశానికి చెందినవారు ఈ రాజ్యాన్ని పాలించారు.

​​​​​​​ ఈ రాజ్యానికి చెందిన అంధకులు, భోజకులు వృష్ణులు ఒక గణసమాఖ్యగా ఏర్పడగా, వాసుదేవ కృష్ణుడు దీనికి ముఖ్యడిగా ఉండేవాడు.

అవంతి

ఇది ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం. దీని రాజధాని ఉజ్జయిని. వింధ్య పర్వతాలు, వేత్రవతీ నది ఈ రాజ్యాన్ని ఉత్తర-దక్షిణ భాగాలుగా విభజిస్తున్నాయి. ఉత్తర అవంతి రాజధాని ఉజ్జయిని కాగా, దక్షిణ అవంతి రాజధాని మహిష్మతి నగరం (లేదా) మహిసట్టి. 

క్రీ.పూ. 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాల్లో అవంతి రాజ్యం ముఖ్యమైందిగా పేరొందింది. ఈ రాజ్యాన్ని పాలించిన వారిలో ప్రద్యోత గొప్పవాడిగా పేరొందాడు. 

క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో అవంతి రాజ్యం మగధలో కలిసిపోయింది.

గాంధార

ఇది ప్రస్తుత అఫ్గానిస్థాన్‌ ప్రాంతం. దీని రాజధాని తక్షశిల. పాకిస్థాన్‌లోని పెషావర్, రావల్పిడి జిల్లాలే అప్పటి తక్షశిల. దీన్ని తక్ష అనే రాజు నిర్మించాడు. ఇది ప్రముఖ వింద్యా, వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇది ఉన్నికి ్బ్ర్న్నః్శ ప్రసిద్ది. 

ఉద్దాలక, శ్వేతకేతు, కౌటిల్యుడు మొదలైనవారు ఇక్కడే విద్యను అభ్యసించారు. 

క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ పాలకుడైన పుక్కుసతి గాంధారను ఆక్రమించాడు. తర్వాత పర్షియా రాజు డేరియస్‌ దీన్ని హస్తగతం చేసుకుని, ఈ రాజ్యం నుంచి కప్పం (పన్ను) వసూలు చేశాడు. 

మహాభారతంలో ధృతరాష్ట్రుడి భార్య ‘గాంధారదేవి’ ఈ రాజ్యానికి చెందినవారే.

కాంభోజ

దీని రాజధాని రాజపురం లేదా భోజపురం. ఇది నేటి వాయవ్య సరిహద్దులోని రాజోరి, హాజీరా జిల్లాల ప్రాంతం. 

అర్థశాస్త్రం ప్రకారం ఈ రాజ్యం రాజరికం నుంచి గణరాజ్యంగా మారింది. 

నందినగరం ఈ రాజ్యంలో ప్రముఖ నగరం.

ఈ 16 మహాజనపదాలే కాకుండా క్రీ.పూ. ఆరో శతాబ్దంలో మరికొన్ని గణరాజ్యాలు కూడా ఉన్నాయి. వాటిలో కపిలవస్తు రాజ్యం, కొలియుల రాజ్యం, ధగ్గుల రాజ్యం, మొరియుల రాజ్యం ముఖ్యమైనవి. 

కపిలవస్తు శాక్యుల రాజ్యం.

కొలియుల రాజధాని రామగ్రామం, మొరియుల రాజధాని పిప్పిలవనం.

అశ్మక (అస్మక)

దీని రాజధాని పొటాన్‌/ పొతన్‌ లేదా బోధన్‌. ఇది నేటి తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. ములక రాజ్యం కూడా ఇందులో అంతర్భాగంగా ఉండేది. దీని రాజధాని పైఠాన్‌ లేదా ప్రతిష్ఠానపురం. 

ఇది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం. దీన్ని ఇక్ష్వాక రాజవంశస్తులు పాలించినట్టు పురాణాల్లో ఉంది. 

గోదావరి నదీ పరివాహక ప్రాంతమే ఈ అశ్మక రాజ్యం అని బౌద్ధగ్రంథాలు పేర్కొన్నాయి. అష్టాధ్యాయి, మార్కండేయ పురాణం, బృహత్‌సంహిత గ్రంథాల్లో అశ్మక రాజ్యం సింధూ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు. శి సుత్తనిపాత వ్యాఖ్యానంలో అస్మక, ములక రాజ్యాలను అంధకులు లేదా ఆంధ్రులు పాలించినట్లు పేర్కొన్నారు. 

బ్రహ్మదత్తుడు అనే అస్మక రాజు ఈ రాజ్యాన్ని పాలించిన వారిలో ముఖ్యుడు.


 

Posted Date : 11-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌